అన్వేషించండి

Naga Panchami Serial Today May 3rd: 'నాగ పంచమి' సీరియల్: వైదేహి కుటుంబానికి షాకిచ్చిన సిద్ధాంతి, ఇంట్లో ఇద్దరు గర్భవతులు.. ఇక పాము, గరుడల పోరాటమే!

Naga Panchami Serial Today Episode: వైదేహి పిలిపించిన సిద్దాంతి జ్వాల కూడా ప్రెగ్నెంట్ అని పంచమి, జ్వాల ఒక చోట ఉండకూడదని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode మోక్ష తమకు పుట్టబోయే బిడ్డ కోసం డాక్టర్లతో మాట్లాడటానికి వెళ్తాడు. పంచమి గదిలో ఏడుస్తూ ఉండగా వైదేహి అన్నం తీసుకొని వస్తుంది. ఇకపై తనని తల్లి అనుకోమని చెప్పి పంచమికి గోరు ముద్దలు తినిపిస్తుంది. అత్త ప్రేమకు పంచమి కన్నీరు పెట్టుకుంటుంది. 

వైదేహి: నీకు నీ బిడ్డకు ఏ లోటు రానివ్వను.
పంచమి: చాలు అత్తయ్య ఈ జీవితానికి ఇది జాలు. నాకు ఇప్పుడు ఈ బిడ్డ మీద ఎలాంటి బెంగ లేదు.
వైదేహి: నా కొడుకు సైంటిస్ట్ పంచమి. మీ బిడ్డకు ఈ లోపం రానివ్వడు. మీకు బంగారం లాంటి బిడ్డ పుడుతుంది. పంచమి మీరు ఏమైనా అనుకోండి. నేను మాత్రం ఆ బిడ్డను వదిలిపెట్టి ఒక్క నిమిషం ఉండను. పేరు పెట్టడం దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటాను. అయితే ఇదంతా మోక్ష కల. తన తల్లి భార్యను అంత ప్రేమగా చూసుకుంటుందని కలకంటాడు. అది నిజం అయితే బాగున్నని అనుకుంటాడు. 

మోక్ష కలిసిన డాక్టర్ కూడా బేబీని ఉంచుకుంటే కష్టమని తీసేయ్‌మని అంటుంది. అయితే కొంత కాలం ఆగి అప్పుడు పిండం మనిషిలా మారుతుందేమో చూద్దామని అంటుంది. 

మరోవైపు వైదేహి మహా సిద్ధులు అని ఓ స్వామిజీని పిలిపిస్తుంది. ఆ స్వామిజీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పంచమి కూడా అక్కడికి వస్తుంది. 

వరుణ్: అమ్మ మోక్ష ఇంటిలో లేడు. ఆ సిద్ధుడు ఏం చెప్పినా మోక్ష వింటాడు అని లేదు. ఇదంతా వృథా ప్రయాసే. 
వైదేహి: పంచమి నువ్వే సాక్ష్యం. సోది చెప్పినామె మాటలు కొట్టి పడేశారు. మా గురువు గారు చెప్పినవి మోక్ష, నువ్వు చెవికెక్కించుకోలేదు. ఇప్పుడు ఈ సిద్ధుడు ఏం చెప్పినా చేసేలా మోక్షని ఒప్పించాల్సిన బాధ్యత నీదే. 
పంచమి: అత్తయ్య గారు మీరు నమ్మినా నమ్మకపోయినా నా మీద నాకు అధికారం లేదు. నేను ఇప్పుడు మోక్షాబాబు గారి భార్యని నా భర్త చెప్పిందే నాకు వేదం. వారు ఏం చెప్తే నేను అలా నడుచుకుంటాను.
శబరి: మంచి మాట చెప్పావు పంచమి. భర్త అడుగు జాడల్లో నడిచేదే భార్య. 
భార్గవ్: పెద్దమ్మ మోక్ష ఉన్నప్పుడే ఆ సిద్ధాంతి గారిని పిలిపించాల్సింది. 
వైదేహి: ఎప్పుడు అంటే అప్పుడు ఆయన రారు. ఏదో రికమండేషన్ ఉపయోగించి పట్టుకున్నాను.
రఘురాం: సరే సరే ముందు ఆ సిద్ధాంతి గారు ఏం చెప్తారో విందాం. 

సిద్ధాంతి గారు వస్తారు. వైదేహి, రఘురాం ఆయనకు ఎదురుగా వెళ్లి స్వాగతం పలుకుతారు. సిద్ధాంతి గారు ఇంటి ద్వారం దాటబోయి అక్కడ పాము, గరుడల శబ్దాలు రావడంతో అడుగు వెనక్కి తీసుకుంటారు. తన దివ్య దృష్టితో పంచమి పాముగా మారడం, జ్వాల కడుపులోకి గరుడ ప్రవేశించడం చూస్తారు. జ్వాల, పంచమిలను గమనిస్తారు. 

రఘురాం: స్వామి మా ఇంట్లో కొన్ని ప్రమాద సంఘటనలు జరుగుతున్నాయి.
వైదేహి: కొంత కాలంగా మా ఇంట్లో ఎవరూ ప్రశాంతంగా లేము స్వామి. చాలా సంతోషంగా ఉండే మా కుటుంబంలో మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయి. 
సిద్ధాంతి: పరస్పర విరుద్ధ అంశాల జాతులే మీ కుటుంబ కలహాలకు కారణ భూతాలు. వంశ పార పర్య దోషాలు తరాలు మారినా ఆ వంశస్తుల తల రాతల మీద ప్రభావం చూపుతాయి. మీ కుటుంబంలోకి రాబోయే కొత్త  జననాల ప్రభావ ఫలితమే మీ ఇంటిలో జరిగే అరిష్టాలకు కారణం. పుట్టబోయే జీవుల మూలాంశాలు రాశి చక్ర ఫలితాల ఆధారంగా దుష్ఫలితాలు జరుగుతూ ఉంటాయి. మంచి చెడుకు ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మీ ఇంటిలో ఇద్దరు తల్లులు కాబోతున్నారు. 
వైదేహి: లేదు స్వామి ఆ అమ్మాయి ఒక్కర్తే గర్భంతో ఉంది. 
సిద్ధాంతి: జ్వాలను చూపిస్తూ ఆవిడ కూడా తల్లి కాబోతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇద్దరు గర్భవతులు ఒకే ఇంట్లో ఒకే దగ్గర ఉంటే పుట్టబోయే బిడ్డల్లో పూర్వ తరాల వైషమ్యాలు ఏమైనా ఉంటే అవి బయట పడి అలజడి సృష్టిస్తూ ఆ ఇంట్లో దుష్ఫలితాలు కలిగిస్తాయి. 
వైదేహి: పుట్టబోయే బిడ్డల ద్వారా అరిష్టాలు జరుగుతాయా స్వామి. 
సిద్ధాంతి: ఎన్ని ఆటంకాలు సృష్టించినా పుట్టాలి అనుకున్న జీవిని పుట్టించకుండా ఆపే శక్తి లేదు. 
వైదేహి: అలాంటప్పుడు మేం ఈ అరిష్టాలు జరగకుండా ఏం చేయాలి స్వామి.
సిద్ధాంతి: ప్రస్తుతానికి గర్భవతులుగా ఉన్న ఇద్దరినీ వేరు వేరుగా ఉంచండి. ఒకరి ముఖం ఒకరు చూసుకోనంత దూరంగా ఉండటం మరీ మంచిది. అప్పుడు మీ ఇంట్లో జరిగే దుర్ఘటనలు ఆగిపోతాయి.
వరుణ్: జ్వాల నువ్వు ప్రగ్నెంట్ ఏంటి.
జ్వాల: నాకు ఆశ్చర్యంగా ఉంది.
భార్గవ్: ఏది ఏమైతేనేం అన్నయ్య వదినా కంగ్రాట్స్. 

మరోవైపు కరాళి గరుడని ప్రయోగిస్తుంది. ఇక జ్వాల సిద్దాంతి చెప్పిన మాటలు తలచుకొని ఉంటూ ఉంటుంది. ఇంతలో గరుడ జ్వాలలోకి దూరుతుంది. దీంతో జ్వాల బయటకు వెళ్తున్న పంచమి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కల్యాణం జరిపించనున్న మధుమిత, సూర్యలు.. సీత ప్లాన్‌కి బిత్తరపోయిన మహాలక్ష్మి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Tragedy Incident: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - ఆ స్పీడ్ బ్రేకర్ మనిషి ప్రాణాలు కాపాడింది, ఎక్కడో తెలుసా?
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - ఆ స్పీడ్ బ్రేకర్ మనిషి ప్రాణాలు కాపాడింది, ఎక్కడో తెలుసా?
Kerala: హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ?  తప్పు కదా ?
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ? తప్పు కదా ?
Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Embed widget