Naga Panchami Serial Today May 30th: 'నాగ పంచమి' సీరియల్: పంచమి పిల్లల మీద కరాళి సంజీవని ప్రయోగం.. కీడు జరుగుతుందన్న పంచమి!
Naga Panchami Serial Today Episode వైదేహి పంచమి పిల్లలకు తినిపించడంతో జ్వాల అత్తను నిలదీయడం చిత్ర జ్వాలని తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode వైశాలి, ఫాల్గుణిలకు హాల్‌లో వైదేహి అన్నం తినిపిస్తుంది. ఇద్దరూ ఆడుకుంటూ పరుగెడుతూ వైదేహిని పరుగులు పెట్టిస్తారు. జ్వాల, చిత్రలు రగిలిపోతుంటారు. ఇంతలో మోక్ష, పంచమి వచ్చి పరుగుల పెట్టకుండా తినమని చెప్తారు. పిల్లలు నానమ్మని తిప్పించడం చూసి పంచమి, మోక్ష నవ్వుకుంటారు.
వైదేహి: ఇక మీ వెనక నేను పరుగెత్తలేనమ్మ. నా బంగారాలు కదా దగ్గరకు రండి.
మోక్ష: నువ్వు తినిపించలేవు ఇటు ఇవ్వమ్మా మేం తినిపిస్తాం.
వైదేహి: పర్లేదులే పరుగెత్తుకుంటూ తింటేనే పిల్లలు కడుపునిండా తింటారు.
వరుణ్: జ్వాల ఎక్కడ చూసి తినిపిస్తున్నావ్ సరిగ్గా తినిపించు.
జ్వాల: ఏం అత్తయ్య గారు మీకు వాళ్లిద్దరే కనిపిస్తున్నారా నా కొడుకు కనిపించడం లేదా.
వైదేహి: అమ్మో నీ కొడుకుకా నువ్వు అసలు వాడిని మా దగ్గర వదిలితే కదా ఏమైనా తినిపించడానికి.
చిత్ర: ప్రపంచంలో నీ ఒక్కదానికే కొడుకు పుట్టినట్లు ఫీలైపోతున్నావ్. అందుకే వాడిని ఎవరి దగ్గరకు రానివ్వకుండా చెడగొట్టేస్తున్నావ్.
జ్వాల: నా కొడుకు నా ఇష్టం.
వరుణ్: ఆ జబ్బే వద్దు అనేది. పిల్లలు అన్నాక అందరితో కలిసిపోవాలి.
వైదేహి: ఫాల్గుణి, వైశాలి చూడు. నానమ్మ నానమ్మ అంటూ వెతుక్కుంటూ వస్తారు. నువ్వు మాత్రం నీ కొడుకును నా దగ్గరకు రానివ్వవు. ఇక తినిపిస్తే ఊరుకుంటావా చెప్పు.
పంచమి తాను తినిపిస్తాను అంటే జ్వాల అవసరం లేదు నువ్వు అస్సలు తినిపించవద్దు. పదరా లోపలికి. ఇక పంచమి పిల్లలు స్టార్స్ చూపిస్తేనే తింటామని అంటారు. మోక్ష తీసుకెళ్తాడు. మోక్ష తనని అడ్డుకోవడాన్ని కరాళి తలచుకుంటూ ఉంటుంది. తన అన్న ఇచ్చిన సంజీవని వేరుతో పంచమి ఇద్దరు పిల్లల్లో ఎవరు నాగాంశతో పుట్టారో ఎవరి వల్ల తనకు నాగమణి దొరుకుతుందో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆ వేరు పట్టుకొని మంత్రాలు చదువుతుంది. పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని అనుకుంటుంది. పంచమి, మోక్షలతో పిల్లలు ఆడుకుంటున్నట్లు కనిపిస్తుంది. దాంతో కరాళి వేరు పట్టుకొని వాళ్ల దగ్గరకు వస్తుంది.
వేరును మంత్రించి పిల్లలు దగ్గరకు విసురుతుంది. తర్వాత ఎవరూ చూడకుండా ఓ మూలకు వెళ్లి దాక్కుంటుంది.. ఆ వేరును చూసి విశాలాక్షి ఆత్మను ఆకర్షించి తన దగ్గరకు తీసుకురావాలి అని అంటుంది. వెంటనే వైశాలి పాప ఆడకుండా ఆగిపోతుంది. నడుచుకుంటూ ఆ వేరు ఉన్న వైపునకు వెళ్తుంటుంది. పంచమి మోక్షలు పాపని గుర్తించరు. వైశాలి నడుచుకుంటూ వెళ్లిని వేరును తీక్షణంగా చూస్తుంటుంది. మోక్ష వైశాలిని చూసి దగ్గరకు వెళ్తాడు. ఏమైందని పాపని పట్టుకొని అడుగుతాడు. అయినా వైశాలి కదలదు మెదలదు. పంచమి చూసి షాక్ అయి పరుగులు తీస్తుంది. ఇద్దరూ ఏమైందని పాపని అడుగుతారు.
పాప చేతికి ఉన్న రుద్రాక్షి ఏదని అడిగి మొత్తం వెతికి రుద్రాక్షిని మళ్లీ పాప చేతికి కడుతుంది. ఎప్పుడూ దాన్ని తీయొద్దని నీతోనే ఉండాలి అని పంచమి అంటుంది. ఇక మోక్షతో తన మనసుకి కీడు శంఖిస్తుందని పెద్ద ప్రమాదం తప్పిందని పిల్లల విషయంతో జాగ్రత్తగా ఉండాలని అంటుంది. పిల్లల్ని లోపలకి తీసుకెళ్లిపోతుంది. ఇక కరాళి ఎందుకు ఇలా జరిగిందో అని అనుకుంటుంది. వేరు తీసుకొని వెళ్లిపోతుంది. ఏమైందా అని గుర్తు తెచ్చుకుంటుంది. అయితే మోక్ష ఆ వేరును తొక్కడం వల్ల పని చేయలేదు అని తన కష్టం వృథా అయిపోయిందని అనుకుంటుంది. ఇక తన అన్న ఆత్మని రప్పిస్తుంది. అన్నతో తాను అనుకున్న కార్యం జరగలేదు అని చెప్తుంది. దాంతో నంబూద్రీ ఆ సంజీవినికి మళ్లీ శక్తి ప్రసాదిస్తాను అని అయితే దానికి జీవం రావాలి అంటే ముందు మంచి కార్యానికి ఉపయోగించాలని అంటాడు. పంచమి పిల్లల్ని పడుకోపెడుతూ జరిగిన అన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘మంజుమ్మెల్ బాయ్స్’ను వీడని సమస్యలు, మూవీ బడ్జెట్‌పై తప్పుడు లెక్కలు - నిర్మాతలపై పోలీసులు కేసు