Naga Panchami Serial Today May 1st: 'నాగ పంచమి' సీరియల్: అన్నావదినల్ని తన్ని తరిమేస్తానన్న మోక్ష.. పంచమి, మోక్షల కారుకి అగ్ని ప్రమాదం, కారులో చిక్కుకున్న పంచమి!
Naga Panchami Serial Today Episode : పంచమి, మోక్షల కారు మీద కరాళి తన మంత్ర శక్తితో అగ్ని ప్రయోగించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Serial Today May 1st Episode : కరాళి మంత్ర శక్తితో గరుడ శక్తి కలిగిన ఫణేంద్ర జ్వాల కడుపులో ప్రవేశిస్తాడు. అది చూసిన కరాళి తాను అనుకున్నది జరగబోతుందని సంతోషపడుతుంది. మరోవైపు పంచమి తన తన కడుపులో పెరుగుతున్న తన తల్లి గురించి నాగేశ్వరి చెప్పిన మాటలు తలచుకుంటుంది. ఇక మోక్ష మరోచోట ఒంటరిగా కూర్చొని పంచమి గురించి, పంచమి ప్రెగ్నెంట్ అయిన నాటి నుంచి అందరూ అన్న మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత పంచమి కోసం స్వీట్స్, పూలు తీసుకొని వస్తాడు.
మోక్ష: పంచమి నువ్వు ఆలోచించడం మానేయాలి.
పంచమి: అలా ఆలోచించొద్దు అనుకుంటే ఎక్కువ గుర్తొస్తుంది మోక్షాబాబు. ఇక మోక్ష పంచమి తలలో పూలు పెట్టి భార్యకు స్వీట్ తినిపిస్తాడు.
మోక్ష: ఏంటి పంచమి అలా చూస్తున్నావ్.
పంచమి: మోక్షాబాబు మన బిడ్డ ఎలా ఉన్నా నేను తనని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా.
మోక్ష: మరి నన్ను ఎవరు చూసుకుంటారు. నవ్వు పాము అంశవని తెలిసినా నా మనసు మారలేదు పంచమి. నువ్వు నాగకన్యవి అని తెలిసినా నా మనసులో నీ స్థానం చెక్కు చెదరలేదు. మనద్దరం కలిసే అవకాశం లేదని తెలిసినా నేను నిన్ను తప్ప మరొకరిని నా భార్యగా ఊహించుకోలేదు. నిన్ను శాశ్వతంగా భూలోకంలో ఉంచుకోవడానికి నా ప్రాణాలు కూడా ఇవ్వడానికి నేను వెనకాడలేదు..
పంచమి: మీ త్యాగం ముందు నేను ఏమాత్రం సరితూగను మోక్షాబాబు.
మోక్ష: అలా అనకు పంచమి. ఈ గుండెకు ప్రాణం పోసిందే నువ్వు పంచమి.
మరోవైపు అందరూ టిఫెన్ చేయడానికి హాల్‌లోకి వస్తారు. పంచమిని తీసుకొని మోక్ష కూడా వస్తాడు. పంచమిని కూర్చొపెట్టి టిఫెన్ ఒడ్డించబోతే శబరి మోక్షని కూర్చొమని చెప్తుంది. దానికి చిత్ర వాళ్లకి ఎవరి సాయం వద్దని అన్నారు కదా అంటుంది. ఇక జ్వాల ఎవరి మాట వినకపోతే ఇలాగే ఉంటుందని అంటుంది. దీంతో మోక్షనే పంచమికి వడ్డిస్తాడు. ఇంతలో జ్వాల వాంతులు చేసుకుంటుంది. చిత్ర సాయంగా వెళ్తుంది.
జ్వాల: పొద్దున్నుంచి వాంతులు అవుతూనే ఉన్నాయి.
చిత్ర: అక్క ప్రెగ్నెంట్ ఏమోనే. నాకు తెలిసి నీకు ప్రెగ్నెన్సీ సింప్టమ్సే.
జ్వాల: అయినా నాకు ఇప్పుడప్పుడే వద్దమ్మ పిల్లలు.
చిత్ర: నువ్వు అలా అంటావ్ ఏంటి అక్క. ఈ ఇంట్లో కొందరు ఏం పుట్టినా పర్వాలేదు అని ధైర్యంగా ఉన్నారు.
జ్వాల: పుట్టిన తర్వాత కదా వాళ్లకి అసలు సినిమా కనిపించేది.
చిత్ర: అయినా నీకు పుట్టినా సూపర్ పిల్లలు పుడతారు. పురుగు, పామో నీ కడుపున ఎందుకు పుడుతుంది చెప్పు.
మోక్ష: మీరు కావాలనే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.
పంచమి: మోక్షాబాబు వదిలేయండి. వాళ్లు అనుకుంటే అనుకోని.
మోక్ష: ఏంటి అనుకునేది. అంతా వాళ్ల ఇష్టమా. ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే మర్యాద ఇచ్చి పుచ్చుకొని ఉండండి. లేదంటే నేనే తన్ని తరిమేయాల్సి వస్తుంది.
వరుణ్: రేయ్ మోక్ష. ఈ ఇళ్లు నీ ఒక్కడిదే కాదు మాటలు మర్యాదగా రాని. తంతాను గింతాను అంటే ఇక్కడ ఎవరూ పడరు.
మోక్ష: మీ భార్యల్ని అదుపులో పెట్టకోకపోతే అదే జరుగుతుంది.
భార్గవ్: ఏంట్రా కొడతావా.. రా..
జ్వాల: అత్తయ్య మీ చిన్న కొడుకుని అదుపులో పెట్టుకోండి. ఏదో ఆస్తి మొత్తం అతడిదే అన్నట్లు మాట్లాడుతున్నాడు. బెదిరిస్తే ఇక్కడెవ్వరూ తగ్గేవారు లేరు మేం ఎంత దూరం అయినా వెళ్తాం.
వైదేహి: మోక్ష ఆడవాళ్లతో అలా మాట్లాడటం తప్పు.
శబరి: వాళ్లు ఆడవాళ్లలా మాట్లాడుతున్నారా.
మోక్ష: పంచమి జోలికి వస్తే నేను ఆడ మగ అని చూడను.
వరుణ్: ఇక్కడెవరూ గాజులు తొడుక్కొని లేరు.
రఘురాం: వరుణ్ ఏంట్రా ఆ మాటలు. మోక్ష పంచమిని తీసుకొని లోపలికి వెళ్లు.
వైదేహి: ఎంట్రా ఈ గొడవలు నిన్నా మొన్నటి వరకు ఎలా ఉన్నారురా.
చిత్ర: అన్నింటికీ ఆ పంచమి కడుపులో బిడ్డే కారణం. అయినా ఆ సోదామె చెప్పింది కదా ఇంట్లో వాళ్లు నాశనం అవుతారు అని ఇప్పుడు అదే జరుగుతుంది.
శబరి: మీ అందరి చూపు ఆ బిడ్డ మీదే పడింది. ఏమైనా జరిగితే ఆ పాపం మీదే.
జ్వాలకు కళ్లు తిరడగంతో వరుణ్ రూంలోకి తీసుకెళ్తాడు. ఇక జ్వాలకు ప్రెగ్నెన్సీ రాకూడదని చిత్ర మొక్కుకుంటుంది. మరోవైపు కరాళి మోక్ష, పంచమిలు బయటకు వెళ్తుంటే వాళ్ల మీదకు అగ్ని ప్రయోగిస్తుంది. దీంతో ఇద్దరూ కారులో కూర్చొగానే మంట వచ్చి కారు మీద పడుతుంది. మోక్ష పంచమిని దగ్గరకు తీసుకుంటాడు. ఇంట్లో వాళ్లు అందరూ బయటకు వస్తారు. మరోవైపు పంచమి సృహా కోల్పోతుంది. మోక్ష బయటకు వస్తాడు. పంచమి రాలేకపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: లిప్ లాక్ సీన్ చూసి మా ఆవిడ ఆ సలహా ఇచ్చింది: సుహాస్