అన్వేషించండి

Naga Panchami Serial Today March 30th: 'నాగ పంచమి' సీరియల్: అదిరిపోయే సాక్ష్యంతో మోక్ష బండారం బయటపెట్టనున్న చిత్ర.. పంచమికి నల్లరంగు క్షుద్ర గాజులు వేసిన కరాళి!

Naga Panchami Serial Today Episode ఫణేంద్ర, మోక్షలు మాట్లాడుకోవడం ఫణేంద్ర పాములా మారడం చూసిన చిత్ర ఆ సీన్‌ను వీడియో తీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode  ఫంక్షన్‌లో పంచమి ఏ చీర కట్టుకోవాలో మోక్షసెలక్ట్ చేస్తాడు. తానే చీర కడతాను అని తాను కడితే కుందనపు బొమ్మలా ఉంటావని అంటాడు. ఇక వైదేహి, నాగేశ్వరిని తీసుకొని వస్తుంది. మోక్ష సెలక్ట్ చేసిన చీరను పంచమికి కట్టమని నాగేశ్వరికి వైదేహి ఇస్తుంది. నాగేశ్వరి చేతిలోకి చీర తీసుకొని గతంలో తాను పంచమితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటుంది. 

పంచమి: ఏంటి అలా చూస్తున్నారు. 
నాగేశ్వరి: ఏమీ లేదు.. అని నాగేశ్వరి పంచమికి చీర కడుతుంది. నిన్ను చూస్తుంటే నా సొంత చెల్లిలా కనిపిస్తున్నావ్ అందుకే చెప్తున్నా అమ్మ ప్రసవం జరిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. కడుపులో బిడ్డను నీ ప్రాణంలా చూసుకోవాలి. 
మోక్ష: ఫణేంద్ర తన ఇంటి బయట తిరగడం చూసి ఫణేంద్ర దగ్గరకు వెళ్తాడు. ఇక వారి సంభాషణను చిత్ర వింటుంది. ఇప్పుడు నీకు ఇక్కడ ఏం పని లేదు ఫణేంద్ర. పంచమి నాగలోకానికి రాదు. రాలేదు. తను ఇప్పుడు తల్లి కాబోతుంది. నువ్వు మళ్లీ కనిపిస్తే ఆందోళన పడుతుంది. దయచేసి నువ్వు మీ నాగలోకం వెళల్లిపో..
ఫణేంద్ర: వెళ్లను మోక్ష నువ్వు పంచమి నన్ను నమ్మించి మోసం చేశారు. మిమల్ని సంతోషంగా ఉండనివ్వను. రెండు సార్లు నీ ప్రాణాలను నిన్ను కాపాడాను. నాగలోకం వస్తాను అని చెప్పి పంచమి మాట తప్పింది. 
మోక్ష: నీకు దండం పెడతా ఫణేంద్ర. మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. నువ్వు వస్తే అది డిస్ట్రబ్ అయిపోతుంది. మన మధ్య ఏమైనా సమస్యలు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. దయచేసి ఇప్పుడు వెళ్లిపో.
ఫణేంద్ర: వెళ్తాను మోక్ష. కానీ శాశ్వతంగా కాదు. నేను ఇక్కడే ఉండి నీకు పంచమికి ఆనందం లేకుండా చేస్తా.. నరకం అంటే ఏంటో చూపిస్తా.. అని ఫణేంద్ర పాములా మారిపోతాడు. వాటి అన్నింటిని చిత్ర వీడియో తీస్తుంది. 
చిత్ర: దొరికి పోయావు మోక్ష. పంచమి పాము అని నిరూపిస్తాను. నీ బండారం మొత్తం బయటపెడతాను.

వైదేహి ఫంక్షన్‌కి అన్ని ఏర్పాట్లు చేయిస్తుంది. కొడుకు కోడలిని కూర్చొపెడుతుంది. ఏడు వారాల నగలను కోడలికి తానే వేస్తుంది. ఇక చిత్ర వచ్చి  జ్వాలతో అక్కా నీకొకటి చూపిస్తా ఎగిరి గంతేస్తావ్ అని అంటుంది. ఇంతలో జ్వాల వైదేహి పంచమికి ఏడువారాల నగలు వేయడం చిత్రకు చూపిస్తుంది. చిత్ర షాక్ అవుతుంది. ఇక నాగేశ్వరి అమ్మా అంతా అయిపోయిన తర్వాత నగలు తీసి దిష్టి తీయాలి అని చెప్తుంది. ఆ పని మీరే చేయండి అని వైదేహి నాగేశ్వరికి చెప్తుంది. మరోవైపు చిత్ర మోక్ష, ఫణేంద్రలు మాట్లాడుకోవడం. ఫణేంద్ర పాముగా మారిన వీడియోని జ్వాల, వరుణ్‌, భార్గవ్‌లకు చూపిస్తుంది. ఇక ఫంక్షన్ అయ్యేవరకు ఏం తెలీనట్లుండి తర్వాత చుక్కలు చూపిద్దామని అనుకుంటారు. 

రఘురాం అతిథులకు తన కొడుకు తండ్రి కాబోతున్నాడు అని చెప్పి తన కొడుకు కోడలికి మీ దీవెనలు ఇవ్వండి అని కోరుతారు. రఘురాం, వైదేహిలు తమ సంతోషాన్ని పంచుకుంటారు. ఇక ముందుగా నాగేశ్వరి పంచమికి గంధం కుంకుమ పెట్టి గాజులు వేసి దీవిస్తుంది. మరోవైపు కరాళి కూడా ముత్తయిదువులా మారి మంత్రించిన నల్ల గాజులు పట్టుకొని ఫంక్షన్ దగ్గరకు వస్తుంది.

కరాళి కూడా పంచమికి బొట్టు పెట్టి తాను తీసుకొచ్చిన నల్ల గాజులు వేయడానికి రెడీ అవుతుంది. వాటిని చూసి నాగేశ్వరికి అనుమానం వస్తుంది. అయితే కరాళి నలుపు గాజులు అని ఎవరూ ఏమీ అనుకోకూడదు అని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి తీసుకొచ్చిన గాజులు అని చెప్పి వాటిని పంచమికి వేయడానికి రెడీ అవుతుంది.

నాగేశ్వరి: వద్దమ్మా.. ఆ గాజులు పల్లెంలో పెట్టి అక్షింతలు వేసి దీవించండి.
కరాళి: ముత్తయిదువులు గాజులు వేస్తుంటే తిరస్కరించకూడదు అది నీ భర్తకు మంచిది కాదు. పంచమి చేయి ఇచ్చి గాజులు వేయించుకుంటుంది. గాజులు వేసి కరాళి వెళ్లిపోతుంది. వెనకాలే నాగేశ్వరి వెళ్తుంది.
నాగేశ్వరి: ఆగు.. నువ్వు కరాళివి కదా. 
కరాళి: అవును నాగేశ్వరి.
నాగేశ్వరి: ఎంత ధైర్యం ఉంటే నువ్వు నేరుగా ఇంటికే వచ్చి గాజులు తొడుగుతావు. ఇప్పుడే నిన్ను కాటేసి చంపుతాను.
కరాళి: నువ్వు నన్నేం చేయలేవు నాగేశ్వరి. ముందు వెళ్లి పంచమి ప్రాణాలు కాపాడుకో. 
నాగేశ్వరి: పంచమిని ఏం చేశావ్ చెప్పు కరాళి.
కరాళి: పంచమి చేతులకు నేను తొడిగింది క్షుద్ర శక్తి గాజులు. ఆ క్షుద్ర శక్తి పంచమి కడుపులో పిండాన్ని భక్షిస్తుంది. ఆ తర్వాత పంచమి ప్రాణాలు కూడా తీసేస్తుంది.
నాగేశ్వరి: ఎంత పని చేశావు కరాళి. నిన్ను.. పంచమి కడుపు నొప్పితో విలవిల్లాడిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు. రఘురాం డాక్టర్‌కి కాల్ చేస్తాడు. పంచమి కడుపు పట్టుకొని అల్లాడిపోతుంది. నాగేశ్వరి వచ్చి ఏం అవసరం లేదు. తనకి దిష్టి తగిలింది వెంటనే దిష్టి తీయాలి అని అంటుంది. అదేదో నువ్వే చేయ్ అని వైదేహి అంటే అందరి ముందు తీయకూడదు అని నాగేశ్వరి పంచమిని తన గదికి తీసుకెళ్తుంది. గదిలోకి తీసుకెళ్లి గాజులు తీసేయాలి అంటుంది. వద్దు అని పంచమి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 30th: ఘోర దగ్గరకు వెళ్లిన మనోహరి - భాగీ, అమర్‌ పెళ్లి చేసుకుంటారన్న మంగళ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
పవన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు
Mobile Phone Safety: ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Nitish Fabulous Century: నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ.. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న తెలుగు ప్లేయర్.. కంగారూ గడ్డపై సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ప్లేయర్
Embed widget