అన్వేషించండి

Naga Panchami Serial Today March 27th: పంచమి, మోక్షలకు యాక్సిడెంట్.. కరాళి, ఫణేంద్రలపై నాగేశ్వరి విశ్వరూపం, వైదేహి వింత ప్రవర్తన!

Naga Panchami Serial Today Episode పంచమి, మోక్షలకు కరాళి తన మంత్ర శక్తితో యాక్సిడెంట్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది.

Naga Panchami Today Episode మోక్ష భార్య పంచమికి ధైర్యం చెప్పి కొబ్బరి బొండం తాగమని చెప్తాడు. తాను కూడా పంచమి ఎంగిలి చేసిన బొండం తాగుతాడు. ఇక కరాళి, ఫణేంద్రలు ఆ సీన్ చూస్తారు. మోక్షకి ఏం కాదు. తనకి ఏం కాలేదు అని మోక్ష చెప్తాడు. 

మోక్ష: చూశావా నాకు ఏం కాలేదు. ఇప్పటి వరకు మనం అనుభవించిన నరకాలు చాలు ఇక మనకు అంతా వెలుగే. ఈ రోజు నుంచి మనది కొత్త జీవితం. మన ప్రపంచంలో మనం ముగ్గురమే ఉంటాం. నువ్వు, నేను, మన ప్రాణం అని కడుపులో బిడ్డ గురించి చెప్తాడు.
కరాళి: పద ఫణేంద్ర అని కరాళి తన మంత్ర శక్తితో పంచమి వాళ్లు వెళ్తున్న కారు మీదకు తన మంత్ర శక్తిని ప్రయోగిస్తుంది. దాతో కారు అద్ధం మీద నల్లటి పొగ అల్లుకొని ఏమీ కనిపించక యాక్సిడెంట్ అయిపోతుంది. 

పంచమి కింద పడిపోతుంది. మోక్షకు దెబ్బలు తగులుతాయి. ఇద్దరూ స్పృహా కోల్పోయి పడిపోతారు. కరాళి, ఫణేంద్ర అక్కడకి వెళ్లి వాళ్లని చూస్తారు. కరాళి సమీపంలోని రాయి తీసుకొని వచ్చి పంచమి మీద విసిరి చంపడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో నాగేశ్వరి పాము బయటకు వచ్చి కరాళిని చుట్టేస్తుంది. దీంతో ఫణేంద్ర భయంతో పాముగా మారిపోతాడు. కరాళి కూడా భయపడి ఏమీ చేయలేకపోతుంది. రెండు పాములు ఒకదానికి ఒకటి ఎదురై బుసలు కొట్టుకుంటాయి. పాములు రెండు గొడవ పడటంతో కరాళి మరోసారి రాయి తీసుకొని వచ్చి పంచమి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనితో నాగేశ్వరి పాము నాగేశ్వరిలా మారి కరాళిని అడ్డుకుంటుంది. ఫణేంద్ర పంచమి గొంతు నులుపడానికి వెళ్తే అదే రాయితో నాగేశ్వరి కరాళిని చంపేస్తాను అని బెదిరిస్తుంది. దీంతో ఇద్దరూ భయపడతారు.

నాగేశ్వరి: నా నాగశక్తిని తట్టుకొని మీరు నిలబడలేరు. ఇక్కడి నుంచి పారిపోకపోతే ఇద్దరినీ చంపేస్తాను.
ఫణేంద్ర: మేం ఇద్దరం ఉన్నాం నాగేశ్వరి నువ్వేం చేయలేవు.
నాగేశ్వరి: నువ్వు వెంటనే పారిపోకపోతే కరాళిని చంపేస్తాను. 
కరాళి: వద్దు నాగేశ్వరి వద్దు.. ఫణేంద్ర వెళ్లిపో.. నేను చెప్తున్నా ఫణేంద్ర త్వరగా వెళ్లిపో.. ఫణేంద్ర వెళ్లిపోయాడు.
నాగేశ్వరి: ఇంకెప్పుడు పంచమి జోలికి రాను అని చెప్పు నిన్ను వదిలేస్తా.. అలాగే ఇప్పుడు నువ్వు లేచి నా మీద మంత్ర ప్రయోగం చేయకూడదు.
కరాళి: అలాగే నాగేశ్వరి చేయను. 
నాగేశ్వరి: అయినా నీ దగ్గర నన్ను కట్టిడి చేసే మంత్ర శక్తులు లేవు కరాళి అయినా నిన్ను వదిలేస్తున్నాను మళ్లీ ఎప్పుడూ నాకు కనిపించకు. వెళ్లిపో. 

ఇక నాగేశ్వరి ముసలి బామ్మలా రూపం మార్చుకొని పంచమి, మోక్ష గాయాలను మాయం చేస్తుంది. కారులోని నీరు తీసుకొని పంచమి ముఖం మీద వేసి లేపుతుంది. మోక్ష కూడా లేస్తాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు జాగ్రత్తలు చెప్పుకుంటారు. నాగేశ్వరి ఇద్దరికీ దెబ్బలు తగల్లేదు. జాగ్రత్తగా వెళ్లండని చెప్తుంది. ఇద్దరూ వెళ్లిపోతారు. 

ఫణేంద్ర: ఈరోజు వాళ్లని నేను వదిలి పెట్టను కరాళి. ఏదో ఒకటి చేసి తిరిగి వస్తాను. 

మరోవైపు  వైదేహి గతంలో తానా పంచమికి చేతులు ఎత్తి మొక్కిన సంఘటనలు అన్ని గుర్తు చేసుకుంటుంది. రఘురాం వైదేహి దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు.

వైదేహి: పంచమి గురించే అండీ తను ఒకసారి ఒకలా ఉంటుంది. తనని చూస్తే ఏమీ తెలియని అమాయకురాలిగా ఉంటుంది. ఒక్కోసారి అపర కాళిలా ప్రవర్తిస్తుంది. 
రఘురాం: యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది వైదేహి. ఏ విషయం అయినా అంత దూరంగా ఆలోచించకూడదు. లోటుపాట్లు లేని మనిషి ఉండరు. లోపాలు వెతకడం మానేసి పంచమి మంచి తనం చూడు. న్యాయంగా ఆలోచిస్తే నాగగండం ఉన్న మన మోక్షకు పెళ్లే చేయకూడదు. అలాంటిది పంచమి అన్నీ తెలిసి మోక్షని పెళ్లి చేసుకుంది. మోక్ష కోసం తనే మనకంటే ఎక్కువ పూజలు చేసి రక్షించుకుంది.  సరే పంచమి త్యాగం కూడా పక్కన పెడదాం. మనం స్వార్థంగా మన మోక్ష గురించి ఆలోచిద్దాం. పంచమి గురించి మనల్ని కూడా వదులుకుందామని అన్నాడు అంటే పంచమి ఎలాంటిది అర్థం చేసుకో. పంచమిలో నాకు అన్నీ మంచి లక్షణాలే కనపడుతున్నాయి. వైదేహి మన కూతురు తల్లి కాబోతుంది అని తెలిస్తే నీ ప్రవర్తన ఇలాగే ఉంటుందా వైదేహి. నువ్వే ఆలోచించు.
వైదేహి: మీరు ఇంకాం చెప్పకండి ఏం చేయాలో నాకు తెలుసు.

మోక్ష, పంచమిలు ఇంటికి వస్తారు. నాగేశ్వరి పాము కూడా వారి వెంటే వస్తుంది. పంచమి, మోక్షలను ద్వారం దగ్గరే ఆపుతుంది. ఇక ఫణేంద్ర పాము కూడా అక్కడికి వస్తాడు. వైదేహి మీనాక్షిని పిలవడంతో మీనాక్షి హారతి పట్టుకొని వస్తుంది. వైదేహి నవ్వుతూ తన చేతులతో కొడుకు కోడలికి దిష్టి  తీస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. పంచమి, మోక్ష, రఘురాం వాళ్లు చాలా సంతోషిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: రామ్‌ చరణ్‌ బర్త్‌డే - అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ స్పెషల్‌ విషెస్‌, అరుదైన వీడియో షేర్‌ చేసిన బన్నీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Siddaramaiah MUDA Case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
CM Revanth Reddy: 'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
Embed widget