(Source: ECI/ABP News/ABP Majha)
Naga Panchami Serial Today March 14th: 'నాగ పంచమి' సీరియల్: అయ్యో.. పంచమితో ఒక్కటై ప్రాణాలు కోల్పోయిన మోక్ష.. గుండెలు పగిలేలా ఏడ్చిన కుటుంబం!
Naga Panchami Serial Today Episode పంచమితో కలిసిపోయిన మోక్ష ఆ విష ప్రభావానికి ప్రాణాలు కోల్పోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode : మోక్ష తన తల్లి, పంచమి మాటలు తలచుకొని బాధపడతూ ఉంటాడు. ఇంతలో పంచమి అక్కడికి వస్తుంది. మోక్ష దగ్గర పంచమి కూర్చొంటే పంచమి చేతులు పట్టుకొని మోక్ష ఏడుస్తాడు. అది చూసి పంచమి కూడా ఏడుస్తుంది.
మోక్ష: నేనేం చేశాను పంచమి. ప్రేమించడం తప్పా. నువ్వు చేసిన ఈ జీవితం తలచుకుంటేనే శూన్యం. జ్ఞాపకాలతో నా జీవితాంతం బతకడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా జ్ఞాపకాల్లో నువ్వు లేని నా బతకు వృథా. పంచమి నీకో విషయం తెలుసా. ప్రేమిస్తే ఇంత నరకం ఉంటుందా.. నా గుండె చప్పుడు ఎప్పుడూ పంచమి పంచమి అనే అంటుంది. నమ్మడం లేదా నువ్వు అంటూ తన గుండె మీద చేయి వేసుకొని విను. వినిపిస్తుందా పంచమి.. పంచమి ఇక ఈ ప్రాణం నీది.
పంచమి: మోక్షాబాబు మోక్షాబాబు.. అని ఏడుస్తుంది.
మోక్ష: పంచమి నన్ను వదిలి వెళ్లకు ప్లీజ్.. పంచమి నన్ను వదిలి వెళ్లకు నువ్వు నాతోనే ఉండిపో పంచమి నువ్వు లేకుండా ఉండలేను. అని పంచమి ఒడిలో పడుకుంటాడు. పంచమి నువ్వు నా పక్కన ఉంటే నాకు ధైర్యం. నువ్వు నాతో ఉంటే దేన్ని అయినా సాధిస్తాను. నన్ను నమ్ము పంచమి. నన్ను వదిలి వెళ్లకు పంచమి. నువ్వు లేకుండా ఉండలేను. నన్ను వదిలి వెళ్లకు పంచమి. అని మోక్ష పంచమిని హగ్ చేసుకొని ఏడుస్తాడు. పంచమి కూడా మోక్షని హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఈ జన్మకు నీతో ఒక్క క్షణం గడిపినా చాలు అని ఇద్దరూ బెడ్ మీద పడుకుండిపోతారు.
వైదేహి: ఏవండీ ఏంటి ఇంకా ఎవరూ రెడీ అయినట్లు లేరు. ఉదయమే వెళ్లాలి అని రాత్రి చెప్పాను కదా. మోక్ష, భార్గవ్, వరుణ్‌లను వైదేహి పిలుస్తుంది.
పంచమి: పంచమి ఫ్రెష్ అయి వస్తుంది. బెడ్ మీద మోక్ష పడుకొని ఉంటే మోక్షని లేపుతుంది. మోక్ష లేవడు. పంచమికి అనుమానం వచ్చి ఊపిరి చూస్తుంది. చూస్తే మోక్ష ఊపిరి ఆడదు. దీంతో పంచమి షాక్ అయిపోయి రాత్రి జరిగింది తలచుకుంటుంది. దీంతో విషకన్య అయిన తనతో మోక్ష కలిసి చనిపోయాడని తెలుసుకొని కుప్పకూలిపోతుంది. తలబాదుకొని ఏడుస్తుంది.
పంచమి: అయ్యో అయ్యో నేనేం తప్పు చేశాను ఎందుకింత శిక్ష. మోక్షాబాబు.. మోక్షాబాబు అని మోక్ష చైన్ కింద పడి ఉంటే పట్టుకొని మోక్షని లేపుతుంది. ఎంతకీ మోక్ష లేవడు. మోక్షాబాబు కళ్లు తెరవండి.
శబరి: ఏంటి ఇంకా ఎవరూ రాలేదా.. ఇంతకీ మీ పెళ్లాలు ఏర్రా..
జ్వాల: నిన్నే చెప్పాం కదా మేం రామని.
మీనాక్షి: ఇంటిళ్లపాది వెళ్లి పూజ చేయించాలి అని చెప్పింది కదా అమ్మ.
రఘురాం: సరే మోక్షావాళ్లు వస్తారు. పిలవండి. వరుణ్ మోక్షని పిలవడానికి తమ గదికి వెళ్తాడు.
పంచమి మోక్షాబాబు అని ఏడ్వడం వరుణ్ విని పంచమిని పిలుస్తాడు. పంచమి తలుపు తీయకపోవడంతో తోసుకొని వెళ్లి మోక్షని చూసి షాక్ అవుతాడు. మోక్ష మోక్షా అంటూ లేపుతాడు. ఏమైంది అని పంచమిని అడుగుతాడు. వరుణ్ ఇంట్లో పరుగున వెళ్లి అందరిని పిలుస్తాడు.
వరుణ్: అమ్మా నాన్న మోక్ష లేవడం లేదు. రండి.. అందరూ మోక్ష గదికి పరుగులు తీస్తారు.
రఘురాం: పల్స్ కూడా పనిచేయడం లేదు. బ్రీతింగ్ కూడా తీసుకోవడం లేదు. పంచమి మోక్షకి ఏమైంది.
శబరి: ఏమైంది నాన్న ఏమైంది నీకు కళ్లు తెరువు నాన్న.
వైదేహి: మోక్ష.. మోక్ష ఏమైంది నాన్న పంచమి మోక్షకి ఏమైందో చెప్పు.
భార్గవ్: మా మోక్షకు ఏమైందో చెప్పు పంచమి.. మాట్లాడు.
జ్వాల: ఏం జరిగిందో చెప్పకుండా ఏడుస్తావ్ ఏంటి. మోక్షని నువ్వే చంపేసి ఉంటావ్.
మేఘన: మనసులో కచ్చితంగా రాత్రి వీళ్లిద్దరి మధ్య ఏదో జరిగింది. పంచమి విషకన్య కాబట్టి మోక్ష ఇక బతకడు. నా ఆశలు అన్నీ పంచమి కాల్చి బూడిద చేసేసింది.
వైదేహి: ఓసేయ్ రాక్షసి నీ వల్లే నా మోక్షకు ఈ కష్టాలు అన్నీ. నువ్వు ఒక్క నిమిషం కూడా ఇక్కడుంటానికి వీల్లేదు. వెళ్లు పో బయటకు అంటూ వైదేహి పంచమి మెడపట్టుకొని తరిమేస్తుంది.
పంచమి: సుబ్రహ్మణ్యేశ్వరా నువ్వే నాకు దిక్కు. మోక్షా బాబుని కాపాడు. లేదంటే నన్ను తీసుకెళ్లిపో స్వామి. నేను నీ దగ్గరకే వస్తున్నాను.
మేఘన తన గదికి వచ్చేసి జరిగినదంతా తలచుకొని రగిలిపోతుంది. మరోవైపు పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుడికి పరుగులు తీస్తుంది. తన భర్తను కాపాడమని వేడుకుంటుంది. తనకు దారి చూపాలి అని మీ కాలి దగ్గర ప్రాణాలు వదిలేస్తాను అని తన ప్రాణాలతో తన భర్త ప్రాణాలు కాపాడాలని వేడుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: జయలలిత: తండ్రిలాంటి వ్యక్తితో సంబంధం కట్టారు - అందుకే ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ వదిలేశా: జయలలిత