Naga Panchami Serial Today March 12th: 'నాగ పంచమి' సీరియల్: ఆపదలో పంచమి.. మహారాణి ఆత్మ సాయం కోరిన నాగేశ్వరి!
Naga Panchami Serial Today Episode పంచమి ఆపదలో ఉందని తన కన్నతల్లి నాగలోకం మహారాణి ఆత్మను పిలిచి నాగేశ్వరి సాయం కోరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode మోక్ష తన ఫ్యామిలీతో మాట్లాడిన మాటల్ని గుర్తుచేసుకుంటారు. అప్పుడు పంచమి వచ్చి మోక్షాబాబు మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మేఘన కన్నీళ్లు పెట్టుకుంటే అది ఈ ఇంటికే మంచిది కాదు అని చెప్తుంది.
మోక్ష: మరి నా గుండెలో కార్చుతున్న కన్నీటి సంగతి ఎవరికి చెప్పుకోవాలి. ఆ పాపం ఎవరికి తగులుతుంది చెప్ప పంచమి. నా బాధని ఎవరూ అర్థం చేసుకోరే. ఇష్టం లేనప్పుడు నిశితార్థం ఎందుకు ఒప్పుకున్నావని అందరూ నన్ను దోషిగా చూస్తున్నారు కానీ కారణాలు వేరు.
పంచమి: మీ కారణాలు ఎవరికి కావాలి మోక్షాబాబు. మిమల్ని నమ్మినందుకు మేఘనకు అన్యాయం జరగకూడదు.
మోక్ష: అదే చెప్తున్నాను పంచమి. పెళ్లి పీటల మీద కూడా ఈ పెళ్లి ఆగిపోవచ్చు అని నేను మేఘనకు చెప్పాను. తను సరే అంది. అందుకే నేను ఒప్పుకున్నాను.
పంచమి: ఇది చాలా సున్నితమైన విషయం మోక్షాబాబు. బాగా అర్థం చేసుకోండి. నిశితార్థం జరిగిపోయిన తర్వాత పెళ్లి ఆగిపోతుందని ఏ ఆడపిల్ల అనుకోదు. మనం చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే మీరు మేఘనను పెళ్లి చేసుకోవడానికి ఒకే చెప్పారు.
మోక్ష: నిన్ను మార్చుకోవడానికి మెడికల్‌గా నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఆ విషయం కూడా మేఘనకు తెలుసు. ఇంకా కొంచెం టైం దొరికితే మెడిసిన్ రెడీ అయిపోతుంది. అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్..
పంచమి: ఆ మందు పనిచేయొచ్చు. చేయకపోవచ్చు. కానీ మేఘనతో మీ పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది. సరే మోక్ష బాబు ఇక నేను నాగలోకం బయల్దేరుతాను.. మీరు మాట తప్పారు అని నేను కూడా మాట తప్పలేను మోక్షాబాబు. మీరు న్యాయంగా ధర్మంగా మేఘన మెడలో తాళి కడతాను అంటే. ఆ క్షణం వరకు మీ కోరిక మేరకు నేను మీ కళ్లెదుట కనిపిస్తూ ఉంటాను. లేదంటే వెళ్లిపోతాను ఇక శాశ్వతంగా మీకు కనిపించను.
మోక్ష: పంచమి నువ్వా అలా మాట్లాడేది.
పంచమి: అవును మోక్షాబాబు మీరు మేఘన మెడలో తాళి కడితే నేను సంతోషంగా నాగలోకం వెళ్తాను. లేదంటే బాధగా దూరం అవుతాను. కానీ వెళ్లిపోవడం ఖాయం.
నాగేశ్వరి: పంచమి తల్లి నాగలోక మహారాణి ఆత్మతో.. మీ కన్నబిడ్డ పంచమి ప్రాణం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. నేను నాగదేవత సాయం కోరాలి అని ఆశించాను. కానీ నాగ దేవతకు నా మీద కోపం ప్రత్యక్షం కాదు. అందుకే మీరు జ్ఞాపకం వచ్చి మిమల్ని వేడుకున్నాను. మీ బిడ్డ కోసం మీరు ఏమైనా సాయం చేయగలరేమో అని ఆశించాను మహారాణి.
మహారాణి: కోరికలు తీరక నా ఆత్మ త్రిశంఖు స్వర్గంలో పడి ఎటూ వెళ్లలేక సతమతమవుతుంది నాగేశ్వరి. నీ ప్రార్ధన నా ఆత్మను తట్టి లేపింది.
నాగేశ్వరి: చనిపోతూ మీరు మాకు చెప్పినట్లు చేయడానికి మా శాయశక్తులా ప్రయత్నించాను మహారాణి. మిమల్ని చంపిన నంబూద్రీ మీద మీ కూతురు పగ తీర్చుకుంది. కానీ మోక్షని చంపలేకపోయింది.
యువరాణి: నా చావుకి నంబూద్రీ మాత్రమే కారణం నాగేశ్వరి. మోక్షను నంబూద్రీ తప్పు దోవ పట్టించాడు. అయినా నా పగ ప్రతీకారం తీరిపోయింది. నా కూతురు నా స్థానంలో రాణి కాలేదు అన్న కోరిక మిగిలిపోవడంతో నా ఆత్మ ఇంకా ఇక్కడ కొట్టుకుంటూ ఉంది. ఆ కోరిక కూడా నెరవేరితే నా ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది.
నాగేశ్వరి: ఆ కోరిక ఎంత వరకు నెరవేరుతుందో నాకు తెలీదు మహారాణి. నంబూద్రీ చెల్లెలు కరాళి మహామాంత్రికురాలు. అది నన్ను రాయిగా మార్చింది. ఇప్పుడు ఆ కరాళి రక్తం నాకు తగిలి నాకు శాప విమోచనం కలిగి నా రూపం నాకు వచ్చింది. మీ కూతురు పంచమికి తన భర్త మోక్ష అంటే ప్రాణం. తనని వదిలి నాగలోకం వెళ్లడానికి పంచమి ఒప్పుకోదు.
మహారాణి: నా కోరిక తీరక పోతే నేను ఆత్మ గానే ఘోషిస్తాను నాగేశ్వరి. త్వరగా నా కోరిక తీరేలా చేయండి.
నాగేశ్వరి: ప్రస్తుతం పంచమి ఆపదలో చిక్కుకుంది. ఆ కరాళి మోక్షను బలిచ్చి పంచమిని కూడా చంపేయాలి అని చూస్తుంది. అలా జరగకుండా ముందు వాళ్లని కాపాడాలి దానికి మీరు ఏమైనా సాయం చేయగలరేమో అనే అశతోనే మిమల్ని ప్రార్ధించాను.
మహారాణి: ఆత్మగా నేను నిరాకారిణి. భౌతికంగా నేను ఏం చేయలేను. అదే నువ్వు నీ శక్తితో నా ఆత్మను ప్రేరేపించి నీ దగ్గరకు రప్పించగలిగావ్. లేకపోతే స్వయంగా ఆత్మగా కూడా రాలేను.
నాగేశ్వరి: పర్వాలేదు మహారాణి. నేను ఒకసారి నాగదేవతను ప్రసన్నం చేసుకొని వేడుకుంటాను.
మహారాణి: అలాగే నాగేశ్వరి ఎలా అయినా నా కూతుర్ని కాపాడి.. నా కోరిక నెరవేరేలా చేసి నా ఆత్మకు విముక్తి కలిగించు. నువ్వు ఇప్పుడు ప్రార్థించినట్లే నా శక్తిని ప్రేరేపించి ఆవాహనం చేసుకుంటూ ఉండు. మరోవైపు కరాళి తన అన్న ఆత్మను పిలిచి జరిగిందంతా చెప్తుంది.
పంచమి: నా ప్రయత్నాలు అన్నీ మోక్షాబాబుకి మంచి జరగడానికే. నా జీవితం దుఃఖ సాగరం. అందులో పడి మోక్షాబాబు కొట్టుమిట్టాడకూడదు. నన్ను వదులు కొనే బాధ క్షణికం కానీ మోక్షాబాబు జీవితం అంతా బంగారు మయం అయిపోతుంది. నేను కోరుకునేది అదే అదే జరగాలి.
ఫణేంద్ర: మోక్ష గంటకో మాట మార్చుతున్నాడు. తన మనసు నిలకడగా ఉండటం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోను అనడం ఎంత వరకు న్యాయం.
పంచమి: మోక్షాబాబు మాట తప్పడం లేదు ఫణేంద్ర. నేను మాట తప్పుతున్నాను. మోక్షాబాబు మా బంధానికి కట్టుబడి ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆ బంధాన్ని నేనే తెంపాలి అని చూస్తున్నా. అయినా నువ్వు బాధ పడకు ఫణేంద్ర. ఎల్లుండే వాళ్ల పెళ్లి జరుగుతుంది. మనం నాగలోకం వెళ్తున్నాం. ఇంతలో మోక్ష వస్తే.. మీరు మేఘన మెడలో తాళి కట్టే వరకు మీ కళ్ల ముందే ఉండమని చెప్పారు ఆ విషయం ఫణేంద్రకు చెప్తున్నాను.
ఫణేంద్ర: నాగదేవత తలచుకుంటే ఈ క్షణమే పంచమిని నాగలోకం తీసుకెళ్లిపోతుంది మోక్ష. పంచమి మీకు ఇచ్చిన మాట కోసం ఎదురు చూస్తాం.
పంచమి: నేను నా మాటకు కట్టుబడక తప్పదు.
మరోవైపు నాగులావరం పూజకు అందరం కలిసి వెళ్దామని శబరి అంటుంది. జ్వాల రాను అంటే పూజ ఒక్కటే కాదు తెల్లారితే మోక్ష పెళ్లి కూడా అని వైదేహి అంటుంది. అందరం కలిసి వెళ్దామని అంటుంది. ఇక ఈ పెళ్లి జరగదు అని జ్వాల అంటే జరుగుతుంది అని పంచమి అంటుంది. ఇక వైదేహి మోక్షని పిలిచి ఎల్లుండి ఉదయమే మీ పెళ్లి అని చెప్తుంది దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది.