అన్వేషించండి

 Vishwak Sen Post: 'గామి' నెగిటివ్‌ రేటింగ్‌ వివాదం - వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా, విశ్వక్‌ సేన్‌ షాకింగ్‌ పోస్ట్‌

Vishwak Sen Shocking Post: 'గామి' మూవీ రేటింగ్‌ వివాదంపై హీరో విశ్వక్‌ సేన్‌ స్వయంగా స్పందించాడు. ఈ మేరకు పోస్ట్‌ షేర్‌ చేస్తూ మూవీ సక్సెస్‌ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్‌ చెప్పాడు. అలాగే..

Vishwak Sen React on Gaami Negative Rating Issue: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. మాస్‌ యాక్షన్‌ను పక్కన ఘోరగా కొత్త ప్రయత్నం చేశాడు. విశ్వక్‌ సేన్ హీరోగా చాందీని చౌదరి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్‌ మూవీ 'గామి'. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌ వీక్‌లోనే మేకర్స్‌ని లాభాల్లో పడేసింది. విడుదలైన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ రివ్యూస్‌తో దూసుకుపోతుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా 'గామి' నాలుగు రోజుల్లోనే రూ.22 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసి లాభాల్లోకి వెళ్లిపోయింది. విడుదలకు ముందు ఈ మూవీకి ఎన్నో అటంకాలు ఎదురైన సంగతి తెలిసిందే.వాయిదాల మీద వాయిదాలు పడుతు ఫైనల్‌గా థియేటర్లోకి వచ్చిన మంచి విజయం సాధించింది.

ఎంత లాగితే అంత పైకి వస్తాను..

అయితే ఈ మూవీకి బుక్‌ మై షోలో నెగిటివ్‌ రేటింగ్‌ వివాదం నెలకొంది. తాజాగా దీనిపై విశ్వక్‌ సేన్‌ స్వయంగా స్పందించాడు.  తన మూవీని సక్సెస్‌ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్‌ చెబుతూనే బాట్స్‌కి(ఊరు పేరు లేని అకౌంట్స్‌) గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ మేరకు విశ్వక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్ చేశాడు.  'మా సినిమా గామిని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రియమైన సినీ ప్రేక్షకులు, సినిమా ఔత్సాహికులను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమాకు కొందరు నెగిటివ్‌ ప్రచారం, రేటింగ్‌ సమస్య నా ద్రష్టికి వచ్చింది. ఈ సందర్భంగా దానిపై నేను మాట్లాడాలనుకుంటున్నా. బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కొందరు కావాలనే 10కి 1 రేటింగ్‌ ఇస్తున్నారు. రకరకాల యాప్స్ ఉపయోగించి ఫేక్ రేటింగ్ ఇవ్వడం వల్ల 9 ఉన్న రేటింగ్ 1కి పడిపోయింది. దీనికి వెనక ఎవరూ ఉన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishwak Sen (@vishwaksens)

వారి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. అలాంటి వారు నన్ను ఎంత కిందకు లాగాలనుకుంటే అంతకు రెట్టింపు ఉత్సాహం, శక్తితో పైగా వస్తాను. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. 'గామి'ని సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్, మీడియాకు ధన్యవాదాలు. ఈ మూవీ రేటింగ్‌ విషయంలో జరుగుతున్న అవకతవకలపై చట్టపరంగా ముందుకెళ్తాను" అంటూ విశ్వక్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇటీవల కాలంలో ఒక మూవీ హిట్టా? ఫట్టా? అనేది తెలియాలంటే బుక్‌మై షోలో ఉండే రేటింగ్‌ చూసి తెలుసుకుంటున్నారు. అయితే ఇందులో కొన్ని బాట్స్‌ సినిమాలకు తక్కువ రేటింగ్‌ ఇస్తుండటం హిట్టైన సినిమాకు కూడా అతి తక్కువ రేటింగ్‌కి నమోదవుతుంది. ఇది మహేష్‌ బాబు గుంటూరు కారం చిత్రానికి ఇలానే జరిగింది. ఇప్పుడు విశ్వక్‌ సేన్‌ గామి చిత్రానికి కూడా ఇదే రిపీట్ అవ్వడం గమనార్హం. 

Also Read: అలా ఉంటేనే పతివ్రతలా భావిస్తారు, వాళ్లంతా పిచ్చినా కొడుకులు - రెండో పెళ్లిపై స్పందించిన సురేఖా వాణి

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj Allu Arjun : అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
October Third Week OTT Movies : అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget