అన్వేషించండి

Surekha Vani: అలా ఉంటేనే పతివ్రతలా భావిస్తారు, వాళ్లంతా పిచ్చినా కొడుకులు - రెండో పెళ్లిపై స్పందించిన సురేఖా వాణి

Surekha Vani: టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖా వాణి పర్సనల్ లైఫ్‌పై ఎప్పుడూ కాంట్రవర్సీలు వైరల్ అవుతూనే ఉంటాయి. దానిపై తను తాజాగా స్పందించారు.

Surekha Vani: బుల్లితెర నటిగా తన కెరీర్‌ను ప్రారంభించి దాదాపు 20 ఏళ్ల నుండి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు సురేఖా వాణి. ఒకప్పుడు తను ఎలా ఉండేదో అన్న విషయాన్ని పక్కన పెడితే.. గత కొన్నేళ్లుగా సురేఖా వాణి చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు తిరుగుతున్నాయి. తను ఏం చేసినా.. నెటిజన్లు ఆ విషయాన్ని హైలెట్ చేసి చూస్తున్నారు. తన పర్సనల్ లైఫ్‌లో సురేఖా వాణి చేస్తున్న ప్రతీ విషయాన్ని విమర్శించడానికి చాలామంది సిద్ధంగా ఉంటున్నారు. తాజాగా తనపై వస్తున్న కాంట్రవర్సీలపై, పర్సనల్ లైఫ్‌లోని పలు విషయాలపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేశారు సురేఖా వాణి.

అలవాటు అయిపోయింది..

కాంట్రవర్సీలు అనేవి తన ప్రమేయం లేకుండానే వస్తున్నాయని, దానికి తను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చారు సురేఖా వాణి. భర్త లేకుండా ఇలా ప్రవర్తిస్తుందని అందరూ అంటున్నారని, ఒకవేళ తన భర్త ఉన్నా కూడా తను ఇలాగే ఎంజాయ్ చేసేదాన్నేమో అని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ తనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయంపై స్పందిస్తూ.. సోషల్ మీడియా ఉపయోగించడం మొదలుపెట్టిన కొత్తలో ఆ కామెంట్స్‌కు చాలా కోపం వచ్చేదని, కానీ మెల్లగా అలవాటు అయిపోయిందని అన్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ఆ కామెంట్స్‌ను చదివి, తనను ప్రశ్నించినప్పుడు చదవడం మానేయమని సలహా ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. కామెంట్స్ చదివి రియాక్ట్ అవ్వడం కంటే చదవకుండా ఉండడం మంచిదన్నారు. వాటిని అస్సలు పట్టించుకోనని, పచ్చిగా చెప్పాలంటే పిచ్చినా కొడుకులు మాట్లాడుకుంటున్నారని అనుకుంటున్నానని చెప్పారు.

క్యాస్టింగ్ కౌచ్..

ఒకసారి రామ్ గోపాల్ వర్మతో ఫోటో దిగి షేర్ చేసినప్పుడు ఒక యూట్యూబ్ ఛానెల్ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిందని గుర్తుచేసుకున్నారు సురేఖా వాణి. మహిళలను భర్త ఉన్నప్పుడు ఒక విధంగా, భర్త లేనప్పుడు ఒక విధంగా ట్రీట్ చేస్తారని వాపోయారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ వల్ల తన కూతురు చాలా బాధపడేదని, ఇప్పుడు ఇద్దరూ వాటిని చూసి నవ్వుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం సురేఖా వాణి కూతురు సుప్రిత కూడా హీరోయిన్‌గా సినిమాల్లోకి అడుగుపెడుతోంది. దానిపై కూడా సురేఖా స్పందించారు. తెలుగమ్మాయిలకు సినిమాల్లోకి ఎక్కువగా అవకాశాలు రావడం లేదని, ఫెయిల్యూర్‌ను తన కూతురు యాక్సెప్ట్ చేయగలదా లేదా అనే భయాలతోనే ఇన్నిరోజులు తనను హీరోయిన్ చేయలేదని తెలిపారు సురేఖా. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా తను మాట్లాడారు.

రెండో పెళ్లి..

క్యాస్టింగ్ కౌచ్ అనే అనుభవం తనకు ఎప్పుడూ ఎదురవ్వలేదని తెలిపారు సురేఖా వాణి. భర్త చనిపోయిన తర్వాత తెల్లచీర కట్టుకొని ఉంటేనే పతివ్రతలలాగా భావిస్తారని, తను అలా ఉండడం లేదు కాబట్టి తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రెండో పెళ్లిపై స్పందిస్తూ.. తన కూతురు రెండో పెళ్లి చేసుకోమని చాలా బలవంతపెట్టిందని గుర్తుచేసుకున్నారు. కానీ తనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదని తెలిపారు. తన భర్త తేజను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు సురేఖా. తన తరపున మాట్లాడాల్సినవి, చెప్పుకోవాల్సినవి, అడగాల్సినవి ఉండిపోయాయని, అందుకే తేజ మళ్లీ తిరిగొస్తే బాగుంటుందని దేవుడిని కోరుకుంటానని చెప్పుకుంటూ ఏడ్చేశారు. తన భర్త చనిపోయిన తర్వాత తన కూతురే తనకు బలంగా మారిందని గుర్తుచేసుకున్నారు.

Also Read: మలయాళీ పాన్ వరల్డ్ మూవీలో అనుష్క - అబ్బో, ఎంత మారిపోయిందో చూశారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Salim Khan Discharged: ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Dhurandhar 3: 'ధురంధర్ 3' ఉంటుందా? రణవీర్ సింగ్‌తో ఆదిత్య ధర్ మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?
'ధురంధర్ 3' ఉంటుందా? రణవీర్ సింగ్‌తో ఆదిత్య ధర్ మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Tamil Nadu Elections 2026: నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
నాకు నయనతార కలలోకి వస్తుంది..స్టాలిన్ ఇస్తారా? - అన్నాడీఎంకే నేత ప్రశ్న - ఇదేం డిమాండ్?
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
Embed widget