అన్వేషించండి

Anushka Shetty: మలయాళీ పాన్ వరల్డ్ మూవీలో అనుష్క - అబ్బో, ఎంత మారిపోయిందో చూశారా?

Anushka Shetty: అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో 'కథనార్' అనే హారర్ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెట్స్ లోకి అనుష్క ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతోనే అనుష్క మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

Anushka Shetty Kathanar Movie Updates: అనుష్క శెట్టి.. ఈమెను ఫ్యాన్స్ స్వీటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. చ‌క్క‌టి అందం, అభినయంతో, ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తూ ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది అనుష్క‌. తెలుగు, త‌మిళ్ త‌దిత‌ర భాష‌ల్లో న‌టించిన అనుష్క‌.. ఇప్పుడు ఇక మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌నే విష‌యం తెలిసిందే. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా కంటే ముందే ఆమె ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. అయితే, దానికి సంబంధించి షూట్ లో జాయిన్ అయ్యారు అనుష్క‌. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. ఇక అనుష్క లేటెస్ట్ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

ఇప్ప‌టికే రిలీజైన ఫ‌స్ట్ గ్లింప్స్.

ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. కాగా.. అందులో అనుష్క‌ను ఎక్క‌డా చూపించ‌లేదు. ఈ సినిమాలో అనుష్క స‌ర‌స‌న జ‌య‌సూర్య న‌టించ‌నుండ‌గా.. రోజిన్ థామ‌స్ డైరెక్ట్ చేస్తున్నారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమతుత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క నెగ‌టివ్ రోల్ ప్లే చేస్తున్న‌ట్లు స‌మాచారం. అరుంధ‌తి త‌ర‌హాలో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నార‌ని, మొత్తం 14 భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతుందని, అందులో ఒకటి 2024లో విడుదలవుతుందని మేకర్స్ గ‌తంలో వెల్లడించారు. ఇలాంటి ఒక సూపర్ నేచురల్ హారర్ సినిమాలో అనుష్క శెట్టి కూడా భాగం కావడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం. మరి అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న మొదటి పాన్ వరల్డ్ మూవీ, ఆమెకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

ఆక‌ట్టుకున్న గ్లింప్స్.. 

ఇక‌ ఈ సినిమా గ్లింప్స్ విష‌యానికొస్తే చాలా ఆసక్తిక‌రంగా ఉంది .. రెండు నిమిషాల నిడివితో సాగే ఈ గ్లిమ్స్ లో జయసూర్యను చర్చి అధికారులకు ఖైదీగా చూపించారు. జయ సూర్య తమ చర్చిని నాశనం చేసే కొన్ని దుష్టశక్తులను కలిగి ఉన్నాడని వాళ్లంతా నమ్ముతారు. మరోపక్క గ్రామస్తులు వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా ఇందులో చూపించారు. ఇక ఈ గ్లింప్స్‌లో ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. 

స్లిమ్ అయిపోయిన స్వీటీ.. 

అనుష్క ఒక‌ప్పుడు తెలుగులో వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డిపింది. ఆ త‌ర్వాత ఆమె ఎక్కువ‌గా సినిమాల్లో క‌నిపించ‌లేదు.  'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'  త‌ర్వాత ఎక్క‌డా ఆమె ఫొటోలు, అప్ డేట్స్ రాలేదు. చాలా రోజుల త‌ర్వాత  'కథనార్' మూవీ టీమ్ ఆమె ఫొటోలు షేర్ చేసింది. అందులో అనుష్క స్లిమ్ అయ్యి క‌నిపించింది. స్వీటీ స్లిమ్ అయిపోయింది అంటూ ఆమె అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో ఆమె క్రిష్ డైరెక్ష‌న్ లో న‌టిస్తున్నారు. కాగా.. దానికి సంబంధించి ఎలాంటి డీటైల్స్ బ‌య‌టికి రాలేదు. 

Also Read: సూర్య, జ్యోతిక ఆస్తులు అన్ని కోట్లా? భార్యాభర్తలు బాగానే సంపాదిస్తున్నారుగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Flipkart Mobile Offers: ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget