అన్వేషించండి

Naga Panchami Serial Today January 5th: 'నాగ పంచమి' సీరియల్: మోక్షను కాటేసి చంపేయనున్న పంచమి, ఇష్టరూప శక్తులు ప్రసాదించిన నాగదేవత!

Naga Panchami Serial Today Episode: ఫణేంద్రను పూర్తిగా నమ్మి పంచమి మోక్షని కాటేయడానికి సిద్ధమై అందుకు ఏర్పాట్లు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode: మోక్ష తన భార్యను అవమానించొద్దు అని చెప్తే మోక్ష తండ్రి అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం కూడా తప్పే నన్ను క్షమించు మోక్ష అని అంటాడు. ఇక మోక్ష అన్నలు కూడా సారీ చెప్పి మీది ఆదర్శమైన జంట అని పొగుడుతారు. ఇక మోక్ష తన తల్లి దగ్గరకు వెళ్లి సారీ చెప్తాడు. తర్వాత శబరికి కూడా క్షమాపణలు చెప్తాడు. ఇక మీనాక్షి మోక్ష లాంటి భర్త దొరికినందుకు పంచమి చాలా అదృష్టవంతురాలు అంటుంది. ఇక పంచమిని మోక్ష లోపలికి తీసుకెళ్తాడు. ఇక వైదేహి ఏం చేయలేకపోయింది అని జ్వాల, చిత్రలు వెంటకారం చేస్తారు. 

మోక్ష: పంచమి గదిలో తన అత్త అన్న మాటలు తలచుకుంటూ బాధపడుతుంటే.. నాకు అర్థమైంది పంచమి నువ్వు ఎంత భయపడ్డావో తెలుస్తుంది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. వాళ్ల మాటలు నిన్ను బాగా హర్ట్ చేసుంటాయి.
పంచమి: నేను బాధ పడుతున్నది వాళ్ల మాటలకు కాదు మోక్షాబాబు. వాళ్లు ఏం అబద్ధం ఆడలేదు. నేను పాము అని నిజం చెప్పారు. నా గురించి తెలిసిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉండి మిమల్ని కాపాడుకోలేను అన్న భయం తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు. ఒక భర్తగా నన్ను కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఎక్కువ కాలం నిజాన్ని దాచి ఉంచలేదు. 
మోక్ష: నేను ఉన్నంత వరకు ఈ ఇంట్లో నీకు ఏ హాని జరగనివ్వను పంచమి.
పంచమి: అది జరగని పని మోక్షాబాబు. నేను లేకుండా మీ ఇంట్లో మీ వారితో మీరు ఉండగలరు. కానీ మీరు లేకుండా నేను ఉండటం అనే ప్రశ్నే ఉండదు.
మోక్ష:  చెప్పాను కదా పంచమి ఇక మన మధ్య ఇలాంటి ప్రశ్నలకు చోటు ఉండదు. ఉంటే ఇద్దరం ఉంటాం. లేకపోతే ఇద్దరం ఉండము.
పంచమి: మీ నిర్ణయం మార్చుకోండి మోక్షాబాబు. నాకోసం మీరు ఎవర్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏదో ఒకటి చేసి మిమల్ని కాపాడుతాను.
మోక్ష: మరోసారి ఇలా మాట్లాడకు పంచమి. నువ్వు ఏం చెప్పితే అలా చేస్తా అని చెప్పాను కదా. నేను వస్తాను.. నేను ఫణేంద్రతో మాట్లాడుతాను. అందుకు ఏర్పాట్లు చేసుకుందాం. ఇంకేం ఆలోచించకు పంచమి నువ్వు అన్నట్లు ఈ ఇంట్లో ఉండటం అసాధ్యం.
పంచమి: మీకు కాదు మోక్షాబాబు నాకు కూడా సాధ్యం కాదు.
మోక్ష: పంచమి నువ్వు వేరు నేను వేరు కాదు.. మీ శివయ్య మనిద్దరినీ ఒకటి చేసేశాడు. ఈ భయం భయం బతుకులు ఇక మనకు వద్దు. నాకు నువ్వు ప్రాణం పోయగలిగితే కలిసి బతుకుదాం. లేదంటే మరేదైన జన్మలో కలుద్దాం. పంచమి ఈ ఒక్క రాత్రికి మనం ఈ ఇంట్లో ఉంటుంన్నాం. తెల్లవారితే ఎవరికీ కనిపించం. 
పంచమి: మనసులో.. ఒక జన్మకి సరిపోయినంత ప్రేమను పొందాను మోక్షాబాబు. ఇంక చాలు.. మిమల్ని ప్రాణాలతో మీవాళ్లకి క్షేమంగా అప్పగించి వెళ్తాను. నేను ఏ లోకంలో ఉన్నా మీ ప్రేమను మర్చిపోలేను. 

పంచమి - మోక్ష- మేఘన - ఫణేంద్ర  

మోక్ష: ఫణేంద్ర మీరు మాట్లాడుకున్న విషయం నాకు పంచమి చెప్పింది. నేను దానికి ఒప్పుకుంటున్నాను. మీరేం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను. 
ఫణేంద్ర: ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. నాగమణి చాలా శక్తివంతమైనది. ఇష్టరూప నాగు కాటుకి చనిపోయిన వారిని ఆ నాగమణితో బతికించొచ్చు.
మోక్ష: నాకు ఆ వివరాలతో పనిలేదు. నేను నిమిత్త మాత్రుడుని. పంచమి చెప్పింది నేనే ఒప్పుకున్నాను. నేను అన్నింటికి సిద్ధపడే ఉన్నాను. 
ఫణేంద్ర: మనసులో.. మోక్షను ఒప్పించింది అంటే యువరాణి నాతో నాగలోకానికి వచ్చేసినట్లే నాగదేవత నన్ను మెచ్చుకుంటుంది. మోక్ష ఇష్టరూప నాగజాతికి శత్రువు.. మహారాణి చావుకు కారణమైన వాడిని బతికించాల్సిన అవసరం లేదు. 
పంచమి: ఆలోచిస్తున్నావేంటి ఫణేంద్ర.. ఇంకా ఏదైనా అనుమానమా.. మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది కదా.. నేను నీ మీద పూర్తి విశ్వాసంతో నా భర్త ప్రాణాలను పణంగా పెడుతున్నాను.
ఫణేంద్ర: ఇక అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. మీరు స్థానం, సమయం నిర్ణయిస్తే మిగిలిన కథంతా నేను నడిపిస్తాను. 
మోక్ష: ఆలస్యం చేయొద్దు అంతా ఈ రాత్రికే జరిగిపోవాలి.
పంచమి: మనం నాగమణి తెచ్చేంత వరకు నా స్నేహితురాలు మేఘన మోక్షా బాబుని కాపాడుతుంది. 
మేఘన: ఆ పని నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా వెళ్లిరండి. 
పంచమి: ఇందుకు భద్రమైన స్థలం మేఘన ఉండే గదే. తనగదిలోకి ఎవరూ రారు. బయట ఇంకెక్కడైనా అందరికీ తెలిసిపోతుంది.ఫణేంద్ర అక్కడ నువ్వూ ఉండాలి కదా.
ఫణేంద్ర: ఉంటాను యువరాణి. కానీ నేను ఈలోపు నాగలోకానికి వెళ్లి అందుకు నాగదేవత అంగీకారం తీసుకోవాలి. ఆ తల్లి అనుమతిస్తే కానీ నువ్వు పాముగా మారి కాటేయలేవు. అదీకాక నీకు ఇష్టరూప నాగుల శక్తులు వస్తే గానీ నిన్ను నేను నిన్ను నాగలోకం తీసుకెళ్లలేను. ఇక నాగమణి సంగతి నేను చూసుకుంటాను. ముందు యువరాణికి ఇష్టరూప నాగుల శక్తులు వచ్చేస్తే అన్నీ జరిగిపోతాయి. యువరాణి నీకు ఇష్టరూప శక్తులు సంక్రమించాయి అంటే నాగదేవత అంగీకరించినట్టే. అప్పుడు మీకు నామీద పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. 
మోక్ష: నమ్మబట్టే ఇంత దూరం వచ్చాం. ఇక మా చేతుల్లో ఏం లేదు. అంతా నువ్వు చూసుకోవాల్సిందే. 
పంచమి: మేఘన నువ్వు ఇంటికి వెళ్లు. ఫణేంద్ర రాగానే రహస్యంగా మేం ఇంటికి వస్తాం. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా నువ్వే చూసుకోవాలి.
మోక్ష: పద పంచమి ఇదే మనం కలిసి ఉండే చివరి రోజు. క్షణం ఒక యుగంలా గడిపేద్దాం. 
పంచమి: అలా అనకండి మోక్షాబాబు. మీకు పునర్జన్మ ప్రసాదించిన రోజుగా గుర్తుపెట్టుకోండి. రేపటి నుంచి మీరు ఏ చీకు చింత లేకుండా ధైర్యంగా బతికేయొచ్చు.

ఫణేంద్ర: మాతా.. యువరాణి నాతో రావడానికి ఒప్పుకుంది. 
నాగదేవత: నమ్మశక్యంగా లేదు యువరాజా. అయినా ఒక బాధ్యత గల యువరాజువి నువ్వు చెప్తున్నావ్ కాబట్టి నేను నమ్ముతున్నా. నాకు ఒకింత ఆశ్చర్యంగానే ఉంది. నువ్వు ఇచ్చిన మాట కష్టపడి సాధించావ్. 
ఫణేంద్ర: యువరాణి మనిషి కాదు అన్న అనుమానం ఆ ఇంట్లో వచ్చేసింది. ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని మోక్ష తల్లి యువరాణికి కరాకండీగా చెప్పేసింది. దాంతో యువరాణికి అక్కడ ఉండే అవకాశం లేక భర్తతో గొడవ పడి చివరకు నాతో రావడానికి అంగీకరించింది. 
నాగదేవత: మంచి శుభవార్త చెప్పావు యువరాజా.. యువరాణి నాగలోకంలో కాలు పెట్టాలి అంటే శత్రు సంహారం పూర్తి చేయాలి అని తెలుసుకదా..  ముందు మోక్షని కాటేసి చంపిన తర్వాతే ఇక్కడికి రాగలదు. 
ఫణేంద్ర: యువరాణి అందుకు సిద్ధమైన తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను మాతా. మీరు యువరాణికి ఇష్టరూప నాగుల శక్తులు ప్రసాదిస్తే తాను పాముగా మారి ఈ రాత్రికే మోక్షను చంపే కార్యక్రమం పూర్తి చేయించుకొని నాతోపాటు యువరాణిని తీసుకొచ్చేస్తా మాతా. 
నాగదేవత: నీ మీద పూర్తి నమ్మకం ఉంది యువరాజా నీమీద నమ్మకంతో నేను యువరాణికి శక్తుల ప్రసాదిస్తాను. ఇందులో ఎలాంటి పొరపాటు జరిగినా నువ్వే పూర్తి బాధ్యత వహించాలి. అందుకు నువ్వు అంగీకరించాలి. మననాగలోక శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి అన్న సంగతి నీకు తెలుసుకదా.. క్షమాపణలకు ఇక్కడ చోటు ఉండదు. 

మరోవైపు పంచమి, మోక్ష మాట్లాడుకుంటూ నడిచి వెళ్తుంటారు. ఇంతలో నాగదేవత పంచమికి ఇష్టరూప శక్తులు ప్రసాదించడంతో పంచమి ఒక్కసారిగా కింద కూర్చొని పాములా మారుతుంటుంది. మోక్ష పంచమి అంటూ దగ్గరకు వెళ్తాడు. ఏమైంది అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Read Also: ఓటీటీలోకి మమ్ముటి గే పాత్రలో నటించిన మూవీ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget