అన్వేషించండి

Kaathal The Core OTT Streaming: ఓటీటీలోకి మమ్ముటి గే పాత్రలో నటించిన మూవీ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Kaathal The Core OTT: మమ్ముట్టి, జ్యోతిక కలిసి నటించిన మళయాల హిట్ చిత్రం ‘కాథల్ ది కోర్’. తాజాగా ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

Kaathal The Core OTT Streaming: మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కొనసాగుతున్నారు. 'కన్నూర్ స్క్వాడ్' సక్సెస్ తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం ‘కాథల్ ది కోర్’. జో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన జ్యోతిక నటించింది. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ఎలా వ్యవహరిస్తుంది అనే కథాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించింది. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో ఈ మూవీ కొనసాగుతోంది. న‌వంబ‌ర్ 23న విడుద‌లైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు సైతం అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. తమిళ స్టార్ హీరో సూర్య, మరో నటుడు సిద్ధార్థ్ ఈ సినిమా చాలా గొప్పగా ఉందన్నారు. జ్యోతిక సైతం ఈ చిత్రంలో మమ్ముట్టి నటనకు ఫిదా అయినట్లు చెప్పింది. ఆయన హీరోలకే హీరో అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది.  

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కాథల్ ది కోర్’ స్ట్రీమింగ్

బ్లాక్ బస్టర్ ‘కాథల్ ది కోర్’ సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో వారికి గుడ్ న్యూస్ అందించింది అమెజాన్ ప్రైమ్ వీడియో. తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.  

‘కాథల్ ది కోర్’ కథ ఏంటంటే?

బ్యాంకులో ప‌ని చేసి రిటైర్ అయిన జార్జ్(మమ్ముట్టి), ఆయన సతీమణి ఓమన(జ్యోతిక)తో కలిసి  ఓ పల్లెటూరులో నివసిస్తుంటారు. ఆ ఊరిలో పంచాయతీ ఎన్నికలు రావడంతో మమ్ముట్టి పోటీ చేయాలని భావిస్తారు. అధికారులకు నామినేషన్ పత్రాలు కూడా అందజేస్తారు. అదే సమయంలో జార్జ్ భార్య ఓమన కోర్టులో కేసు వేస్తుంది. డ్రైవింగ్ స్కూల్ నడిపే వ్యక్తితో తన భర్తకు స్వలింగ సంబంధం ఉందని ఆరోపిస్తుంది. తనకు విడాకులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతుంది. ఈ ఆరోపణలను మమ్ముట్టి ఖండిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారికి విడాకులు వచ్చాయా? ఇంతకీ ఆమె ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది? అనే విషయాలను ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమాను కువైట్‌, ఖతార్‌ దేశాలు  బ్యాన్ చేశాయి. స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా  మూవీ ఉందని ఈ నిర్ణయం తీసుకున్నాయి.

వరుసగా 4 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్

అటు 2023లో మమ్ముట్టి నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 'నాన్ పాకల్ నేరతు మాయక్కమ్', 'క్రిస్టోఫర్', 'కన్నూర్ స్క్వాడ్' సహా 'కాథల్ ది కోర్' సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 'కాథల్ ది కోర్' సినిమాను  మమ్ముట్టి కంపానీ, వేఫేరర్ ఫిలింస్ బ్యానర్‌ కలిసి నిర్మించాయి. మాథ్యూస్ పులికాన్ సంగీతం అందించారు.

Read Also: ఆమాట విని తారక్ సీరియస్ అయ్యారు, రామ్ చరణ్ బ్రేక్ తీసుకుందాం అన్నారు - రాజీవ్ కనకాల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget