Naga Panchami December 7th Episode మోక్షతో పంచమి చివరి మాటలు.. మృత్యుంజయ యాగం జరిపించనున్న సప్తరుషులు!
Naga Panchami Today Episode పంచమికి సాయం చేయడానికి సుబ్బు సప్త రుషులను ఆహ్వానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Naga Panchami Serial Today Episode
జ్వాలా, చిత్రలు తమ భర్తలను చాకులతో బెదిరిస్తారు. తమకు సేవలు చేయమని డిమాండ్ చేస్తారు. దీంతో అన్నదమ్ములిద్దరూ భార్యల కోసం కాఫీ చేసుకొని తీసుకొస్తారు. మరోవైపు పంచమి నాగులావరంలోని తన పుట్టింటిలో తిరుగుతూ చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటుంది. ఇంతలో అక్కడికి తన ఫ్రెండ్స్ లక్ష్మి, లత వాళ్లు వస్తారు. వాళ్లతో పంచమి మాట్లాడుతూ వాళ్లతో గడిపిన రోజుల్ని గుర్తుచేసుకుంటుంది.
మోక్ష- మోహిని(కరాళి)
మోహిని: మోక్ష నీ జీవితం గురించి ఆలోచిస్తే ఎప్పుడూ నీకు ఆశ్చర్యం అనిపించలేదా.. బాగా డబ్బు ఉంది. ఫారెన్‌లో చదువుకున్నావ్.. సిటీలో పుట్టి పెరిగావ్ అయినా నువ్వు ఈ మారుమూల గ్రామంలో ఏ చదువు సంధ్య లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నిజంగా వండర్ మోక్ష. ఆ చేసుకున్న భార్య కూడా పాము. మళ్లీ ఆ పాము నిన్నే కాటేసి చంపాలి. భార్యతో కలిస్తేనేమో చనిపోతావు. జీవితంలో సుఖం, సంతోషం అనేవే లేవు. భవిష్యత్ కూడా ఉండదు. అయినా భార్య అంటే ప్రేమ. ఇంత భయంకరమైన సత్యాన్ని గుండెల్లో పెట్టుకొని ఎలా నువ్వు తట్టుకోగలగుతున్నావు.
మోక్ష: నా గుండె నిండా పంచమినే ఉంది కాబట్టి. పంచమికి ఉన్న సంస్కారం బాగా చదువుకున్న వాళ్లకు కూడా ఉండదు. తనో అద్భుతం.. నేను నాభార్య కోసం ఏం చేయడానికి అయినా రెడీ. నా కోసం పంచమి చాలా త్యాగాలు చేసింది. అల్పాయుష్కుడిని ఎప్పుడు పోతానో తెలీదు. అలాంటి నన్ను కాపాడుకుంటూ వస్తోంది. ప్రతీక్షణం నాగురించే తప్ప తన గురించి మాత్రం ఆలోచించదు
మోహిని: మనసులో.. ప్రాణం పోతున్నా మోక్ష పంచమిని వదిలిపెట్టడు. మంత్ర శక్తులతోనే మోక్షను లొంగదీసుకోవాలి. ఏంటి మోక్ష పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటున్నావా
మోక్ష: నేను మరచి పోతే కదా మోహిని జ్ఞాపకం చేసుకోవడానికి నేను పంచమితో గడిపిన ప్రతీక్షణం నా మెదడులో చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి.
మోహిని: తను పాము అయి వెళ్లి పోతే ఏం చేస్తావు.
మోక్ష: పంచమి వెళ్లదు.. నేను వెళ్లనివ్వను.. నేను ఉన్నంత కాలం పంచమి నాతోనే ఉంటుంది
మోహిని: నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే నిన్ను పాము కాటేసినప్పుడు నీకు ఏం కాకుండా ఉండాలి అంటే ఏదో ఒక మందు కనిపెడితేనే సాధ్యం మోక్ష. అవును మోక్ష మనం పంచమి పాముగా మారినప్పుడు ఎలా అయినా బంధించి విషాన్ని తీయాలి. అప్పుడు నీ ప్రాణాలకు నేను గ్యారెంటీ ఇవ్వగలను.
మోక్ష: చూద్దాం మోహిని. ఏదీ నా చేతుల్లో లేదు
మోహిని: నా చేతుల్లో ఉంది మోక్ష. నేను నిన్ను కాపాడగలను. అయితే నువ్వు నన్ను పూర్తిగా నమ్మాలి. నేను అదే పనిలో ఉన్నాను మోక్ష ఇక్కడ అడవిలో ఉన్న చాలా రకాల మూలికలు వైద్యానికి అవసరమైన అన్ని రకాల పత్రాలు దొరుకుతాయి. నేను వెళ్లి వాటిని సంపాదిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ రాత్రికే నేను అంటే ఏంటో నీకు బాగా తెలిసిపోతుంది. వస్తాను మోక్ష
పంచమి: ( మోక్ష ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే) మోక్షాబాబు ఏంటి అలా చూస్తున్నారు
మోక్ష: ఈ ఊరు చూస్తుంటే నాకు నీతో గడిపిన జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి.
పంచమి: ఆ జ్ఞాపకాల్ని అలాగే ఉంచుకోండి మోక్ష బాబు. నాకన్నా అవే మీతో జీవితాంతం ఉంటాయి.
మోక్ష: నేను ఉన్నంత వరకు అవి ఎక్కడికి పోవు పంచమి
పంచమి: మిమల్ని ఎక్కడికి పోనివ్వను. మీకు రేపటి నుంచి శత్రువు అనేవాళ్లే లేకుండా చేస్తాను. ఇంకెప్పుడు ఆ పాము మీ వెంట పడదు. ఈ గ్రామంలోనే ప్రారంభమైన ఆ పాము బెడదను.. ఈ గ్రామంలోనే అంతం చేసి ఇంకెప్పుడు మీ దగ్గరకు రాకుండా చేస్తాను
మోక్ష: అదెలా సాధ్యం పంచమి.. ఆ పాము నువ్వే కదా. ఎలా ఆపాము లేకుండా చేస్తావు
పంచమి: మనసు ఉంటే మార్గం ఉంటుంది మోక్ష బాబు. మిమల్ని పెళ్లాడిన వరకు నాలో ఒక పాము ఉన్న సంగతి నాకే తెలీదు. మధ్యలో వచ్చి మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసిన ఆ పాముని బతకనివ్వను. ఎలా అయినా మీకు ఆ పాము పీడ లేకుండా చేస్తాను నన్ను నమ్మండి. రేపటి నుంచి మీరు ధైర్యంగా ఉండొచ్చు. (మనసులో.. ఇంకా కొన్ని గంటలే మోక్ష బాబు ఆ పాము బతికిఉండేది.. నాతో పాటే ఆ పాము కూడా చచ్చిపోతుంది.) ఇక వెళ్దామా మోక్ష బాబు
మరోవైపు సుబ్బు ధ్యానంలో ఉంటాడు. నాగదేవత తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అప్పుడు సుబ్బు దగ్గరకు వశిష్ట మహర్షి, అత్రిముని, గౌతమ మహర్షి, కష్యపు మహర్షి, భరద్వాజ, జమతగ్ని, విశ్వామిత్ర సప్త రుషులు వస్తారు.
సుబ్బు: నాకు పరమ భక్తురాలు ఉంది. దైవం మీద సంపూర్ణ విశ్వాసం, అనన్య భక్తి, అంకుటిత దీక్ష ఉన్న భక్తురాలు. ఆ భక్తురాలిది అపూర చరిత జన్మ. నాగలోకంలో పుట్టాల్సిన తను మానవ రూపంలో భూలోకంలో జన్మించింది. కారణ జన్మురాలు. ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే అలాంటి జన్మ ఉంటుంది. అందుకే నేను ఆ భక్తురాలికి అండగా నిలవాల్సి వచ్చింది. మీలాంటి మహర్షుల ఆశీర్వాదం కూడా ఉంటే నా భక్తురాలు తన జన్మను సార్థకం చేసుకుంటుంది.
రుషులు: తప్పకుండా స్వామి తమరు ఆదేశిస్తే ఆ కార్యం మా చేతుల మీద చేస్తాం
సుబ్బు: ఆ భక్తురాలి భర్త అల్పాయుష్కుడు నాగ గండం నుంచి మహా మృత్యుంజయ యాగం తలపెట్టింది. ఆ యాగం జరగకుండా చేసేందుకు ఇష్టరూపజాతి నాగులు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అలా జరగకుండా ఉండాలి అంటే సప్త రుషులు అయిన మీ చేతుల మీదగా ఆ యాగం జరిపిస్తే ఆ యాగం భగ్నం చేయడం ఎవరి తరం కాదు. అందుకే మిమల్ని ఆహ్వానించవల్సి వచ్చింది.
రుషులు: అలాంటి కారణ జన్మురాలికి సాయం చేయడం కూడా మాకు పుణ్యకార్యమే. మీ కోరిక నెరవేస్తాము స్వామి. ఎప్పుడు ఎక్కడ ఎలా జరిపించాలో చెప్తే మేము అక్కడికి వెళ్లి మా చేతుల మీద ఆ పుణ్యకార్యం పూర్తి చేస్తాం స్వామి.
సుబ్బు: ఒక నాగసాధువు ఆ యాగం చేయించడం కోసం వేద పండితుల్ని వెతకడానికి బయలు దేరాడు. ఇప్పుడు ఈ మార్గంలోనే వస్తున్నారు. మీరు ఆ సాధువు కంట పడి ఆ యాగం మీ చేతుల మీద జరిపించే ఏర్పాటు చేసుకోవాలి.