Naga Panchami December 6th శివయ్య ఎదురుగానే ప్రాణం వదిలేస్తా.. షాకిచ్చిన పంచమి!
Naga Panchami Today Episode నాగులాపురంలోని శివయ్య గుడి దగ్గర తన ప్రాణాలు వదిలేయాలి అని పంచమి నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Naga Panchami Serial Today Episode
మోక్ష, పంచమి దగ్గరకు వచ్చి మాట్లాడుతాడు. ఈ ఇంట్లో ఇదే తనకు చివరి రోజు అనుకొని బయలుదేరుతానని పంచమితో చెప్తాడు. దీంతో పంచమి.. మోక్ష బాబు మీరు అలా అంటే నేను ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను అని చెప్తుంది. ఇద్దరూ ఎమోషనల్ అయి కౌగిలించుకొని ఏడుస్తారు.
మోక్షతండ్రి: మనల్ని రెడీ అవ్వమని చెప్పి మోక్ష ఎక్కడికి వెళ్లాడు.
జ్వాలా: ఇళ్లంతా ఒకసారి చూసి వద్దామని వెళ్లుంటాడు మామయ్య. ఈ పౌర్ణమికి ఆ యాగం ప్రాణాలు కాపాడితే పర్లేదు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. లేదంటే ఇదే మోక్షకు చివరి రోజు కదా
మోక్షతండ్రి: ఏంటా మాటలు.. ఇంటి కోడలుగా నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా అవి
జ్వాలా: సారీ మామయ్య.. నేను చాలా ప్రాక్టికల్‌గా ఉంటాను. ఇప్పుడు మీరు ఈ యాగం చేస్తున్నదే మోక్ష క్షేమంగా ఉండాలి అని. అలా జరిగితే అసలు ప్రాబ్లమే లేదు. జరగకపోతే ఎలా అని ఆలోచించడంలో తప్పు లేదు కదా
ఇక మోక్ష, పంచమి అక్కడికి వస్తారు. అందరూ నాగులాపురం వెళ్దామని బయలు దేరుతారు. మోక్ష తండ్రి జ్వాలా, చిత్రలను వాళ్ల భర్తలను ఉండిపోమని చెప్తాడు. దీంతో పాప మోక్ష దగ్గరకు వెళ్లి నేను వస్తాను బాబాయ్ అంటుంది. దీంతో చిత్ర పాప మీద సీరియస్ అవుతుంది. వాళ్లు వెళ్లేది షికారుకు కాదు.. వెళ్లే వాళ్లలో అందరూ తిరిగివస్తారో రారో కూడా తెలీదు అని నోరు జారుతుంది. జ్వాలా కూడా చిత్రకు సపోర్ట్ చేస్తుంది.
మోక్ష: మీరేం తప్పుగా మాట్లాడలేదు. ఉన్నమాటే అన్నారు. నన్ను పాము కాటేస్తే నేను ప్రాణాలతో రాలేను. కానీ పంచమి వస్తుంది. దయచేసి తనని వేధించకండి. పంచమి రా అంటూ మోక్ష తీసుకెళ్తాడు. ఇక మీనాక్షి, మోక్ష తల్లిదండ్రులు, బామ్మ నాగులావరం బయలుదేరుతారు. ఇక పంచమి తల్లి గుడి దగ్గర పూజలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు.
పంచమితల్లి: నువ్వు పుట్టింటికి వచ్చావు పంచమి. కన్నీళ్లు పెట్టుకోకూడదు.
మీనాక్షి: అమ్మా (శబరితో) మన మోక్షకి, పంచమికి పెళ్లి జరిగింది ఈ గుడిలోనే.
శబరి: ఇప్పుడు ఆ స్వామినే మనల్ని కూడా ఇక్కడికి రప్పించుకున్నాడు అమ్మా. స్వామిని దర్శించుకున్నాక పూజ ప్రారంభించుదాం
సుబ్బు: పంచమి, మోక్ష ముందు దేవుడి దగ్గర దీపాలు వెలిగించండి.
పంచమి: కార్తీకమాసంలో వెలిగించిన దీపాల వెలుగు ఎవరి మీద పడితే వాళ్లని ఆ భగవంతుడు కరుణిస్తాడు అంట మోక్షబాబు నాకు సుబ్బు చెప్పాడు
మోక్ష: సుబ్బు చెప్తే అది కరెక్ట్‌గా ఉంటుంది. అంతే కదా సుబ్బు
సుబ్బు: ఇక్కడ దీపం వెలిగించినట్లే మనసులోనూ వెలిగించాలి. ఇక్కడ చీకట్లు తొలగిపోయినట్లే అక్కడ మనసులోని భయాలు తొలగిపోతాయి.
పంచమి: సుబ్బు మాటలు వేదాలతో సమానం మోక్షబాబు. మీరు గుండెల నిండా ధైర్యం నింపుకోండి
మోక్ష: నువ్వే నా ధైర్యం పంచమి. నువ్వు పక్కన ఉంటే నాకు ఇంకేం అవసరం లేదు
పంచమి: ఎవరి తోడు ఎంత వరకు ఉంటుందో తెలీదు మోక్ష బాబు. మిమల్ని నేను మధ్యలో కలిసిన దాన్ని అందుకని నన్ను లెక్కలోకి తీసుకోవద్దు. మీరు స్వతహాగా స్వతంత్రంగా ఆలోచన చేయండి
శబరి: దీపాలు వెలిగించడం పూర్తయితే వచ్చేయండి అమ్మ
పూజారి: అమ్మ కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఈ ఊరిలో వెలసిన శివయ్యను దర్శనం చేసుకోవడం అంటే ఎంతో మహాభాగ్యం కలిగి ఉండాలి. మీరు మీ కోరికల్ని నేరుగా విన్నవించుకోవాలి. ఇక్కడ వెలిసిన ఈ శివయ్య మీ విన్నపాలను ఆలకిస్తాడని ప్రతీతి.
శబరి: స్వామి నా మనవడికి మీ చెంతనే పెళ్లి జరిపించారు. వాళ్లిద్దరూ పిల్లాపాపలతో పది కాలాల పాటు చల్లగా ఉండేలా చూడు స్వామి.
మోక్ష: పంచమిని నా భార్యగా మీరే నాకు అప్పగించారు స్వామి. తను ఎప్పటికీ సంతోషంగా ఉండాలి
పంచమి: నేను ఈ స్వామి పాదాల దగ్గరే పుట్టాను. శివయ్య కళ్ల ఎదురుగానే పెరిగాను. నన్ను ఎప్పుడు ఏం చేయాలో ఆ స్వామికి బాగా తెలుసు
శబరి: అడగినిదే అమ్మ అయినా పెట్టదు తల్లీ నీ కోరిక కూడా శివయ్యకు చెప్పుకో.
పంచమి: శివయ్య నీ కళ్ల ముందే పుట్టాను. మొదటి శ్వాస ఇక్కడే పీల్చుకున్నాను. నా చివరి శ్వాస కూడా నీ కనుసన్నల్లోనే వదలాలి స్వామి. నన్ను నీలో ఐక్యం చేసుకో శివయ్య. నాకు ఉన్న ఒక్క కోరిక ఆఖరి కోరిక ఇదొక్కటే స్వామి.
మరోవైపు చిత్ర హాల్‌లో పాట పాడుతూ ఎంజాయ్ చేస్తుంది. అందరూ వచ్చేలోపు ఎంజాయ్ చేద్దామని జ్వాలాకు కూడా చెప్తుంది. దీంతో జ్వాలా ఇలా తాత్కాలిక సంతోషం కాకుండా జీవితాతం సంతోషంగా ఉండాలి అంటుంది. దానికి చిత్ర అలా అయితే మనం ముసలి వాళ్లమైతే అది జరుగుతుంది అంటుంది. దీంతో జ్వాలా అలా డీలా పడకు చిత్ర.. ఈ ఇంట్లో ఒక్క ముషలం జరిగితే చాలా అందరూ మంచాన పడతారు అని అంటుంది. అప్పుడు మనదే రాజ్యం అని చెప్తుంది. ఇక మోక్ష తిరిగిరాడు.. వస్తాడు అని రాసిన చిట్టీలను వేసి ఇద్దరూ మోక్ష తిరిగిరాడు అని చిట్టీ తీస్తారు. ఇక మోక్ష రాడు అని డిసైడ్ అయ్యి పండగ చేసుకుంటారు. ఇక వాళ్ల భర్తలు వచ్చి భోజనం కావాలి అంటే ఖాళీ గిన్నెలు చూపిస్తారు. వంట చేయకపోగా వాళ్లకు బాగా ఆకలి వేస్తుంది అని చెప్పి వంట చేయమని చెప్తారు. ఇక జ్వాలా, చిత్రలు చాకులతో తమ భర్తలను బెదిరిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.