Naga Panchami Serial Today December 25th Episode పంచమికి టెస్ట్ ట్యూబ్ బిడ్డను కనమన్న మోక్ష.. ఫణేంద్రకు చెక్ పెట్టిన మేఘన!
Naga Panchami Today Episode టెస్ట్ ట్యూబ్ ద్వారా బిడ్డను కనమని పంచమికి మోక్ష గడువు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Serial Today Episode
వైదేహి: మహామృత్యుంజయ యాగంతో మా మోక్షకు ఉన్న గండాలు అన్నీ తప్పిపోయాయి అని మేం భావిస్తున్నాం పంచమి. ఇంకా గండాలు ఉన్నాయి ప్రాణ హాని ఉంది అని నీకు తెలిస్తే చెప్పు అప్పుడు మా మోక్షతో కాపురం చేయి అని నిన్ను నేను బలవంతం చేయను.
పంచమి: మనసులో.. ప్రాణ హాని ఉంది మృత్యువు తరుముకుంటూ వస్తుంది అంటే వీళ్లు ఇంక నిద్ర పోరు. వీళ్లని బాధ పెట్టడం అనవసరం.
వైదేహి: చెప్పు పంచమి నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుంది. మా మోక్షకు ఇంకా ఏమైనా గండాలు ఉన్నాయా. మరి అలాంటప్పుడు నువ్వు కాపురం చేయకపోవడానికి కారణం ఏంటి. నా కొడుకు ఏదైనా వైకల్యం లోపం ఉంటే చెప్పు పంచమి. తప్పు లేదు. మరి నీలో ఏదైనా లోపమా.. త్వరలో ఆ శుభవార్త చెప్పకపోతే నా ఆలోచనలు వేరేగా ఉంటాయి అని హెచ్చరించాను. అయినా మీలో చలనం లేదు. ఇక ఎదురు చూసే ఓపిక నాకు కూడా లేదు. మా మోక్షని దండించుకోవాల్సిన అవసరం మాకు లేదు. నీలోనే ఏదో లోపం ఉందని స్పష్టంగా అర్థమైపోతుంది. అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నా పంచమి మా వాడి జీవితం లోంచి పక్కకు తప్పుకో. నేను నీకు ఎలాంటి అన్యాయం చేయడం లేదు కావాల్సినంత టైం ఇచ్చాను. స్వేచ్ఛను ఇచ్చాను. నా కొడుకును నీ చుట్టూనే తిప్పుకుంటున్నా నేను పట్టించుకోలేదు. అయినా మీరు ఉపయోగించుకోలేదు. నువ్వు మా మోక్ష మందు పెట్టావో మాయ చేశావో అని అనను పంచమి. కానీ వాడు నిన్ను చూడకుండా నీవ్వు లేకుండా ఉండలేని స్థితికి దిగజారాడు. నీ విషయంలో మేం ఏం చెప్పినా వినిపించుకోవడం లేదు. నాకు పంచమి తప్ప మీరెవ్వరూ అక్కర్లేదు అన్నా ఆశ్చర్యం లేదు. అందుకే భారం అంతా నీమీదే పెడుతున్నా పంచమి వాడు నిన్ను అసహ్యించుకొని నీ నుంచి దూరంగా వెళ్లి పోయేలా చేయాలి. లేదా వాడి నీకోసం ఎంత వెతికినా కనిపించనంత దూరం వెళ్లిపో. త్వరగా ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి తీరాలి.
పంచమి: అత్తయ్య నాకు భోగభాగ్యాల మీద ఆశ లేదు. నా ప్రాణం మీద తీపి లేదు. మోక్ష బాబు కోసం ఆత్మార్పణ చేసుకోవడానికి నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను. త్వరలోనే మీ ఆశ నెరవేరుతుంది. మీరు కోరినా కోరకపోయినా నా ప్రయాణం ఎటు వెళ్లాలో అటు సాగిపోతుంది. ఏ ఆపద ఏ అకాల మరణం లేని మోక్ష బాబుని మీకు అప్పగించి వెళ్లాలని నా ఆశ. ఆ కోరిక నెరవేరే దశలో ఉంది అత్తయ్య. అది పూర్తి కాగానే ఒక్క మోక్ష బాబు కంటికే కాదు అత్తయ్య ఎవరి కంటికి నేను కనిపించను.
వైదేహి: వెళ్లిపోతాను అని నా మీద ఒట్టు వేసి చెప్పు పంచమి.
పంచమి: ఈ ప్రమాణాలు అన్నీ చేసిన వెంటనే కాల గర్భంలో కలిసిపోయేవి. అంతిమంగా జరిగేది దేవుడి నిర్ణయమే. మీ కోరికలో న్యాయం ధర్మం ఉంటే అది తప్పక నెరవేరుతుంది.
మోక్ష-పంచమి
పంచమి: మనసులో.. శాశ్వతంగా వెళ్లిపోతున్నాను అంటే అస్సలు వదలరేమో. కానీ మన మధ్య ఎడబాటు తప్పదు. మీరు ప్రాణాలతో ఉండాలి అంటే నేను వెళ్లక తప్పదు.
మోక్ష: వద్దు పంచమి నువ్వు ఇక్కడ ఉండకూడదు. నేను లేని మరుక్షణం నిన్ను అష్టకష్టాలు పెడతారు. నువ్వు తట్టుకోలేవు. నువ్వు ఆ బాధలు అనుభవించలేవు. నేను ప్రాణాలతో ఉన్నప్పుడే నువ్వు నీ లోకం చేరుకోవాలి.
పంచమి: మీరు ఎక్కడికి వెళ్లరు మోక్షాబాబు. ఎప్పటిలాగే ఈ ఇంట్లోనే అందరి మధ్య తిరుగుతారు. మిమల్ని నేను కాపాడుకుంటాను. ఫణేంద్ర నాకు మాటిచ్చాడు బాబు. మిమల్ని బతికించుకోవడానికి మరో మార్గం లేదు. నాగలోకం నుంచి నాగమణి తీసుకొచ్చి మిమల్ని బతికించుకోవడానికి ఫణేంద్ర తోడుగా ఉంటాను అన్నాడు.
మోక్ష: పిచ్చి పంచమి నిన్ను నాగలోకం తీసుకెళ్లిపోవడానికి నీకు నా ప్రాణాలు ఆశ పెడుతున్నాడు. అది నువ్వు నమ్మావు. నన్ను మళ్లీ బతికించాల్సిన అవసరం నాగలోకానికి కానీ ఫణేంద్రకు కానీ లేదు పంచమి. నిన్ను నాగలోకం తీసుకెళ్లాలి. అంటే నివ్వు నన్ను కాటేసి చంపాలి అంతే వాళ్లకి కావాల్సింది. నువ్వు పక్కన లేకపోతే నాకు నా ప్రాణాలు అవసరం లేదు. నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే నాకు నువ్వు ప్రాణం పోయక్కర్లేదు. నా బిడ్డకు ప్రాణం పోయి. నాతో కలిస్తే నీకు ప్రాణ హాని అంటే టెస్ట్ ట్యూబ్ ద్వారా అయినా నువ్వు తల్లివి కావొచ్చు పంచమి. అది ఆలోచించు. ఈ రోజు రాత్రి వరకే నీకు గడువు. నా మాట వినకపోతే ఇక నీ దారి నువ్వు చూసుకో పంచమి.
మేఘన: నేను నాగ కన్య ఫణేంద్ర పూర్తిగా నమ్మేసింది. ఫణేంద్రతోనే ఎలాఅయినా నాగమణి తెప్పించుకోవాలి. నీ మీద యువరాణికి నమ్మకం లేదు ఫణేంద్ర.
ఫణేంద్ర: అసలు మోక్షని బతికించాల్సిన అవసరం నాకు లేదు. మోక్షని కాటేసి చంపడం మాత్రమే నా పని. యువరాణిని పెళ్లి చేసుకోవాలి అనే ఒక్క ఆశతోనే నాగదేవతని ఒప్పించి ఆమెను నాగలోకం తీసుకెళ్లాలి అనుకుంటున్నాను.
మేఘన: నీ కోరిక నెరవేరాలి అంటే చాలా ఆటంకాలు ఉన్నాయి ఫణేంద్ర. మొదట మన యువరాణి మోక్షని కాటేయాలి. అప్పుడే నాగదేవతని ఒప్పించి యువరాణికి నాగలోక ప్రవేశం కల్పించగలవు. కానీ అది అంత సులభం కాదు.
ఫణేంద్ర: అందుకే కద మోక్ష ప్రాణాలు కాపాడుతాను అని యువరాణికి ఆశపెట్టాను.
మేఘన: ఆశ పెట్టావా అంటే యువరాణికి నువ్వు నాగమణి తీసుకురావడంలో సాయం చేయవా. యువరాణిని మోసం చేయాలి అనుకుంటున్నావా.
ఫణేంద్ర: నాగమణిని తీసుకురావడానికి కచ్చితంగా సాయం చేస్తా.
మేఘన: నువ్వు యువరాణికి ఇచ్చిన మాట తప్పితే యువరాణి నాగలోకం వచ్చాక నిన్ను అస్సలు క్షమించదు. పైగా తాను యువరాణి అయితే ఇక్కడ జరిగిన దంతా గుర్తుండి నిన్ను చిత్ర హింసలు పెడుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా నువ్వు యువరాణిని మోసం చేస్తే తాను నీ అంతు చూస్తుంది. యువరాణికి మోసం చేయకుండా నాగమణిని ఇక్కడికి తీసుకొచ్చే విషయంలో నిజాయితా ఉండండి.
ఫణేంద్ర: వీళ్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నా మనసులో మాటలు కనిపెట్టుస్తున్నారు. యువరాణిని నాగలోకం తీసుకెళ్లేవరకు మనసులో ఏం తలచుకోకూడదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.