అన్వేషించండి

Naga Panchami Serial Today December 16th Episode - 'నాగ పంచమి' సీరియల్: పంచమిని కొట్టి కొట్టి చంపుతారన్న నాగదేవత.. నాగలోకం చేతుల్లో మోక్ష ప్రాణాలు!

Naga Panchami Today Episode నాగదేవత పంచమికి కనిపించి మోక్ష ప్రాణాలు తీసే బాధ్యత ఇకపై నాగలోకం తీసుకుంది అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Naga Panchami Serial Today Episode 

జ్వాలా: నేనేం చేసినా చెప్పి చేయను చిత్ర. చేస్తే మాత్రం ఎవ్వరూ మిగలరు.
చిత్ర: వామ్మో ఇదేంటి పాము కన్నా డేంజర్‌గా ఉంది. ఆస్తి కోసం ఇది అందరితో పాటు నన్ను కూడా చంపడం ఖాయం. దాని కంటే ముందే నేనే దీన్ని ఏదో ఒకటి చేయాలి. మంచిగా ఏదో ఒకరోజు మేడ మీదకు తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేస్తే సరి. ఇక నాకు దీని భయం లేకుండా పోతుంది. 
శబరి: (మోక్ష ఫ్యామిలీ అంతా నాగులావరం నుంచి ఇంటికి వచ్చేస్తారు) మోక్ష, పంచమి మీరిద్దరూ గుమ్మం బయటే ఉండండి.. దిష్టి తీసిన తర్వాత లోపలికి వెళ్దురు. 
మోక్షఅత్త: జ్వాలా, చిత్రలకు.. ఎవరో ఒకరు వెళ్లి దిష్టి నీళ్లు తీసుకురండి.
జ్వాలభర్త: అత్త వాళ్ల చేతులతో వద్దు నువ్వే వెళ్లి తీసుకొని రా.
మోక్షఅత్త: అదీ నిజమే సగం దిష్టి వీళ్లిద్దరిదే ఉంటుంది. 
జ్వాలా: అలా అయితే ప్రతీ రోజు మృత్యుంజయ యాగం చేయించుకోండి బామ్మ. పాము కాటేయకుండా ఉండటానికి యాగం చేయిస్తారు. మరి భార్యతో కలిస్తే భర్త పోతాడు అనే గండానికి ఏం పూజ చేయిస్తారు. 
మోక్షతండ్రి: అమ్మా పంచమి మా మోక్షని కాపాడావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా. 
వైదేహి: మా మోక్ష కోసం మేము యాగం చేసినా.. చివరకు ఆ ఐదు తలల పాము నుంచి నువ్వే మా అబ్బాయిని కాపాడావు. నీ మేలు మర్చిపోలేము.
శబరి: (ఐదు తలల పాము ఏంటి అని జ్వాలా వాళ్లు షాక్ అయి అడగడంతో) మోక్షని కాటేయడానికి నిన్న రాత్రి ఐదు తలల పాము వచ్చింది. దాని నుంచి పంచమినే మోక్షని కాపాడింది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను పంచమి ఒక్కర్తే మన మోక్షను నాగగండం నుంచి కాపాడగలదని. ఇప్పటికైనా మీరందరూ ఆ విషయాన్ని గుర్తించండి. 
చిత్ర: మోక్ష నువ్వు నిజంగా ఐదు తలల పామును చూశావా. 
జ్వాలా: నేను నమ్మను పంచమిని ఇంటి నుంచి పంపించకుండా ఉండేందుకు మోక్ష అల్లిన కట్టు కథ ఇది. 

పంచమి: (ఒంటరిగా కూర్చొని తనలో తాను) ఇంట్లో వాళ్లు అంతా మోక్ష బాబుని నేనే కాపాడాను అన్న భ్రమలో ఉన్నారు. ఆ ఐదు తలల పాము నేనే అని తెలిస్తే ఇక ఎప్పటికీ వీళ్లెవరికీ నిద్ర పట్టదు. ఈ రోజు కాకపోతే రేపు అయినా నా ఉనికి అందరికీ తెలిసిపోతుంది. పొగిడిన ఆ నోళ్లతోనే తిట్టించుకోకతప్పదు. ఇంతలో నాగదేవత ప్రత్యక్షమవుతుంది.
నాగదేవత: నీ నాగలోకాన్ని, నీ నాగ జాతిని ఇంకా ఎన్ని సార్లు మోసం చేస్తావు యువరాణి. ఈ మానవ లోకంలో పడి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇది ఒక మాయాలోకం. ప్రేమలు, బంధాలు అంతా ఓ భ్రమ. అందుకే నేను ఏం చెప్పినా నీ చెవికి ఎక్కడం లేదు. 
పంచమి: అదేం లేదు మాతా. మీరు అంటే నాకు చాలా గౌరవం ఉంది.
నాగదేవత: ఆపు ఇంక నీ మాయమాటలు. ఇలా మాటలు చెప్పి భయం నటిస్తూ మమల్ని ఇంకా వెర్రివాళ్లని చేయకు. 
పంచమి: లేదు మాతా ఒక్క నా భర్త విషయంలో తప్ప ఇంకా మీరు ఏ విషయంలో ఆదేశించినా నేను పాటిస్తాను.
నాగదేవత: నాకోసమో, నాగలోకం కోసమో మోక్షని కాటేసి చంపమనడం లేదు. నీ కన్న తల్లి చివరి కోరిక తీర్చడం కోసమే ఈ పట్టుదల అంతా.
పంచమి: నా తల్లి ఆత్మకు నేను క్షమాపణ చెప్పుకుంటాను. చిన్న వయసులో ఏదో తెలీక చేసిన తప్పునకు ఎవరూ ఇంత పెద్ద శిక్ష వేయరు. 
నాగదేవత: నాగదేవత అయిన నాకే నీతులు నేర్పకు యువరాణి. జాతి దిక్కరణ పెద్ద నేరం. 
పంచమి: అంత క్రూరమైన జాతి నాకు అక్కర్లేదు.
నాగదేవత: నువ్వు పుట్టింది కూడా నాగ జాతికే అని మర్చిపోయి మాట్లాడకు యువరాణి. నీలో ప్రవహించే రక్తం కూడా నాగజాతిదే. కేవలం నీ బుద్ధి, నీ మనసు మాత్రమే మానవ జాతి చుట్టూ తిరుగుతూ ఉంది.
పంచమి: మీరు చెప్పిన అన్ని విషయాలు ఒప్పుకుంటాను. ఒక్క మోక్ష బాబు విషయంలో మాత్రం మిమల్ని ప్రాధేయపడుతున్నాను.
నాగదేవత: నువ్వు వస్తాను అన్నా తీసుకెళ్లడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేదు. ఇక మీదట నువ్వు నాగలోకంలోకి రావాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకున్నట్లు ఇక్కడే ఈ భూలోకంలో ఉండిపో. ఎప్పటిలాగే నువ్వు ప్రతీ పౌర్ణమికి పాములా మారుతూ ఉంటావు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే నీ ఒళ్లు అంతా విషం నిండి ఉంటుంది కాబట్టి నువ్వు మోక్ష శారీరకంగా కలవలేరు. ఒకవేళ అతిక్రమించి కలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు.

కాబట్టి మానవ రూపంలో ఉండి కూడా నువ్వు ఏం సుఖం పొందలేవు. నీ మనసు నాకు తెలుసు. ఆ సుఖం సంతోషం కూడా వదులు కోవడానికి నువ్వు ఏమాత్రం ఆలోచించవు. మోక్ష కోసం ఎంతటి త్యాగానికైనా నువ్వు సిద్ధపడతావు. ఇప్పుడు నీకు మింగుడు పడని ఓ ముఖ్యమైన విషయం చెప్తాను విను. నీవ్వు ఎన్ని పోరాటాలు చేసినా.. ఎంతటి త్యాగాలకు ఒడికట్టినా.. ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడినా అన్నీ నువ్వు నీ ప్రాణం అనుకునే మోక్ష కోసమే.

ఇక ఏ క్షణమైన నువ్వు బలంగా కాపాడుకోవాలి అనుకునే మోక్ష చావుకు సిద్ధంగా ఉండాలి. మోక్షని ఇక మీదట నువ్వు పాముగా మారి చంపాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యతను ఇప్పుడు నాగలోకం తీసుకుంటుంది. ఈ నిమిషం నుంచే లెక్కపెట్టుకో యువరాణి ఏ వైపు నుంచి ఏ నాగు వచ్చి కాటు వేసి చంపుతుందో తెలీదు. ఇక నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా మోక్ష ప్రాణాలు కాపాడలేవు. 

పంచమి: ఇదేమైన న్యాయమా మాతా.. మోక్ష మీద పగ తీర్చుకోవాల్సింది నేను. మీరే అధర్మం పాటిస్తే ఎలా తల్లి.
నాగదేవత: నీ మీద నమ్మకం పోయిన తర్వాతే పంచమి ఈ బాధ్యత నుంచి నిన్ను తప్పించింది. ఒకసారి మోక్ష ప్రాణాలు పోయిన తర్వాత ఈ ఇంట్లో నువ్వు దిక్కులేని దానివవుతావు. పౌర్ణమికి నువ్వు పాములా మారిన తర్వాత నిన్ను కాపాడే నాధుడే కరువవుతాడు. నువ్వు ఎవరో ఒకరి కంట్లో పడి దెబ్బలు తిని నరకయాతన అనుభవించి మరణిస్తావు. రాసిపెట్టుకో యువరాణి ఇక నీ విషయంలో జరగబోయేది ఇదే. 
పంచమి: అమ్మా మాతా అదే నేను నీ బిడ్డను అయితే ఇలాగే చేస్తారా తల్లీ. 
నాగదేవత: నీ స్థానంలో నిజంగా నా బిడ్డే ఉంటే నా మాట దిక్కరించిన మరుక్షణమే మరణ శిక్ష విధించి నా చేతులతో నేనే చంపేసేదాన్ని. నువ్వు మహారాణి బిడ్డవు నాగలోకానికి కావాల్సిన యువరాణివి కాబట్టి నేను కఠిన నిర్ణయాలు తీసుకోలేదు.
పంచమి: నాకు చాలా పెద్ద శిక్ష వేశావు మాతా. నా కన్న తల్లి బతికి ఉంటే నాకు ఈ శిక్ష పడుండేది కాదు. 
నాగదేవత: సరే యువరాణి.. నువ్వు నీ తల్లి మహారాణిని గుర్తు చేశావు కాబట్టి నీకు ఒక చిన్న ఉపశమనం కలిగించే మాట చెప్తాను. ఇదే నా చివరి మాట. నా నుంచి మరో అవకాశం కోసం ఎదురుచూడకు. రాబోయే మార్గశిర మాసం ముక్కోటి ఏకాదశి వరకు నీ భర్తకు ప్రాణభిక్ష పెడుతున్నాను. ఆ రోజే నీ భర్త మరణానికి ముహూర్తం పెడుతున్నాను. ఇది ఇంకా ఎవరూ మార్చలేరు. 
పంచమి: నాగదేవత వెళ్లిపోయిన తర్వాత తనతో తాను.. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష వేయడం ఏంటి. తను ఇప్పుడు నా భర్త. నా పసుపు కుంకుమలు తుడిచేయడానికి వాళ్లు ఎవరు. ప్రాణం పోయినా నేను ఒప్పుకోను. 
మోక్ష: అప్పుడే అక్కడికి వచ్చి.. పంచమి.. ఒంటరి తనం మనిషిని భయపెడుతుంది పంచమి. నాతోడు కూడా లేకపోతే నువ్వు పిచ్చిదానివి అయిపోతావు. ఒక్క తల్లి తనమే పంచమి నిన్ను అన్ని ఆలోచనలనుంచి దూరం చేస్తుంది. నేను చెప్పేది వింటున్నావా పంచమి. 
పంచమి: నేను వినను. ఇప్పుడు నాకు ఏం వినిపించదు. నా లక్ష్యం వేరు మీ ఆశలు ఆశయాలు వేరు. ప్రస్తుతానికి అవి రెండు కలవవు. నేను నా భర్త కోసం పోరాడుతున్నాను. మీరు తండ్రి కావాలి అని తపన పడుతున్నారు. పిల్లలు ఉన్నా లేకున్నా బతకొచ్చు. లేదంటే ఎలా అయినా పొందొచ్చు. కానీ తోడును పోగొట్టుకుంటే జీవితం అంధకారమైపోంది. అప్పుడు జీవించి ఉన్నా లేకున్నా ఒక్కటే. నేను ఇప్పుడు కాపాడుకోవాల్సింది మిమల్ని. లేని పిల్లల్ని కాదు. మీకు నేను ముఖ్యమా పిల్లలు ముఖ్యమా అని మీరే తేల్చుకోవాలి.
మోక్ష: నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతావని ఊహించలేదు పంచమి.
పంచమి: పరిస్థితులు ఎవర్ని అయినా రాటు దేర్చుతాయి మోక్షబాబు. నా గుండె మాత్రం ఎన్ని కష్టాలు అని తట్టుకోగలదు. నేను ఏ తప్పు చేశానని ఎంత మందితో పోరాడాలి.. నేను అందరిలా ఎన్నో అశలతో పెరిగిన దాన్ని మోక్ష బాబు. సగటు ఆడదాన్ని.. అని ఏడుస్తుంది... 
మోక్ష: పంచమి.. అంటూ దగ్గరకు తీసుకుంటాడు.. (నువ్వు ఐదు తలల పాములా మారినప్పుడే నేను బతకడం అసాధ్యం అని అర్థమైపోయింది పంచమి. నీ ఆశ నెరవేరదు.) పంచమి నేను నీకు నిరాశ పరచడం లేదు పంచమి. నిన్ను ఒక్క క్షణం కూడా విడిచి పెట్టకూడదు అనుకునే నేను శాశ్వతంగా నిన్ను వదిలేసి వెళ్లిపోవాలి అంటే నేను ఎంత నరక యాతన అనుభవిస్తున్నానో ఆలోచించు పంచమి. గాలిలో దీపాన్ని నువ్వు ఎన్ని చేతులు అడ్డు పెట్టినా ఆరిపోకుండా అడ్డుకోలేవు పంచమి. కానీ నువ్వు తలచుకుంటే మరో దీపాన్ని వెలిగించగలవు. ఆ వెలుతురులో నువ్వు ప్రశాంతంగా గడిపేయాలి అనేదే నా అశ.
పంచమి: ఆకాశంలో ఎన్ని  చుక్కలు ఉన్నా మనకు సూర్యుడితో సమానం కాదు అండీ. నాకు కావాల్సింది నాకు వెలుగును ఇచ్చే దీపం. నేను చుక్కను కాను. 
మోక్ష: మహా మృత్యుంజయ యాగం జరిపించడానికి  ముందు నువ్వు నాకు మాటిచ్చావు పంచమి. 
పంచమి: నేను మాట తప్పను మోక్షబాబు. ఇక నేను ఓడిపోతాను అన్నప్పుడు యుద్ధం చేయను. అస్త్ర సన్యాసం చేసి మీ ముందు నిలబడతాను అప్పుడు మీ ఇష్టం. నేను మీ మాటకు అడ్డు చెప్పను. 
మోక్ష: నాకు అంత సమయం లేదు అని నీకు తెలుసు పంచమి. నువ్వు ఐదు తలల పాముగా మారి నన్ను కాటేయడానికి విశ్వ ప్రయత్నం చేశావు. ఆ యోగ ఫలమో లేక నీ పూజల ఫలమో ఒక్క త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయట పడ్డాను. ఇక నా చావు నీ చేతుల్లో కూడా లేదని నాకు తెలిసిపోయింది పంచమి. ఆ ఇష్టరూప జాతి నాగులు నీకు కూడా తెలీకుండా ఏ క్షణం అయినా నన్ను కాటేసి చంపడం ఖాయం. 
పంచమి: మీరు చెప్పింది అక్షరాలా నిజం మోక్ష బాబు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: శైలేంద్రని షూట్ చేసిన మహేంద్ర, వసుధార బాధ్యత ఇకపై అనుపమదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Roster Dating : ఎవరితోనైనా, ఎందరితోనైనా, ఎప్పుడైనా డేట్ చేయొచ్చట.. రోస్టర్ డేటింగ్​లో అమ్మాయిలదే హవా
ఎవరితోనైనా, ఎందరితోనైనా, ఎప్పుడైనా డేట్ చేయొచ్చట.. రోస్టర్ డేటింగ్​లో అమ్మాయిలదే హవా
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Embed widget