Meghasandesam Serial Weekly Roundup July 21st to 26th: ‘మేఘసందేశం’ సీరియల్: శోభాచంద్రను మర్డర్ చేశారన్న ఎస్సై – ఎస్సైని చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు
Meghasandesam serial weekly episode July 21st to 26th: శోభాచంద్రను మర్డర్ చేశారని శరత్‌చంద్రకు ఎస్సై ఫోన్ చేయడంతో మొదలైన ఈ వారం ఏపిసోడ్స్.. ఎస్సై మర్డర్ కావడంతో ఈ వారం ఆసక్తిగా ముగిసింది

Meghasandesam Serial weekly Episode: భూమిని వెతుక్కుంట సిటీకి వచ్చిన శివను కొంత మంది రౌడీలు వెంబడిస్తారు. వాళ్లకు దొరక్కుండా శివ పారిపోతుంటే కానిస్టేబుల్ చూసి సేవ్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఎస్సైకి శివ గురించి చెప్పగానే.. ఎస్సై శివ గురించి వివరాలు అడుగుతాడు. తనకు ఎవ్వర లేరని.. తన అక్క భూమిని వెతుక్కుంటూ సిటీకి వచ్చానని శివ చెప్పగానే.. ఎస్సై ఎమోషనల్ అవుతాడు. శివకు తినడానికి టిఫిన్స్ తెప్పించి అతని దగ్గర ఉన్న బోమ్మలోని కెమెరాను ఓపెన్ చేసి చూస్తాడు. అందులో శోభాచంద్రను అపూర్వ మంటల్లో తగటబెట్టిన వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన ఎస్సై షాక్ అవుతాడు. వెంటనే బయటకు వచ్చి శరత్ చంద్రకు కాల్ చేసి విషయం చెప్తాడు. అయితే శరత్ చంద్ర ఎస్సైతో మాట్లాడటం వెనక నుంచి వింటుంది అపూర్వ. ఎస్సై మాటలకు షాక్ అవుతుంది. అయితే ఆ విషయం గురించి నిజం చెప్పడానికి గెస్ట్‌హౌస్‌కు రమ్మని చెప్తాడు శరత్‌చంద్ర. సరే అంటూ కాల్ కట్ చేసి ఎస్సై లోపలికి వెళ్లగానే అక్కడ శివ ఉండడు. టీవీలో భూమి నృత్యం చూసి వెళ్లిపోతాడు. తర్వాత శివ వెళ్లి నేరుగా భూమి కారు కింద పడితే భూమి షాక్ అవుతుంది. శివను తీసుకెళ్లి భోజనం పెట్టించి.. చెర్రికి ఫోన్ చేస్తుంది. చెర్రి రాగానే.. శివ గురించి మొత్తం చెప్పి… ఎలాగైనా శివను గగన్ వాళ్ల ఇంట్లో ఉండేలా చేయాలని చెప్తుంది. సరేనని చెర్రి, శివను తీసుకెళ్లి గగన్ వాళ్ల ఇంట్లో ఉండేలా చేస్తాడు.
అంతకు ముందు భూమి కోసం శరత్‌చంద్ర ఇంటికి వెళ్లిన శారద, పూర్ణిని రూంలో వేసి బంధిస్తుంది మీరా. ఎంత చెప్పినా ప్రాధేయపడినా వినకుండా శరత్‌చంద్ర, అపూర్వక ఫోన్ చేస్తుంది. అయితే బిందు వెల్లి కేపీకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. దీంతో కేపీ ఇంటికి బయలుదేరుతాడు. అంతకుముందే ఇంటికి వచ్చిన అపూర్వ.. శరత్ చంత్ర శారదను అవమానిస్తారు. మాటలతో చెబితే వినే రకం కాదని ఇక జన్మలో కేపీ వైపు చూడకుండా చేయాలని అపూర్వ నిర్ణయించుకుంటుంది. అందుకోసం ముగ్గురు విధవలను పిలిపించి శారదను కూడా విధవను చేయాలనుకుంటుంది. అలాగే శారదను బయటకు లాక్కెళ్లి బొట్టు, గాజులు తీసేసి ముఖానికి పసుపు రాసి విధవను చేస్తుంటారు. ఇంతలో కేపీ వచ్చి అందరినీ తిట్టి శారదను అక్కడి నుంచి పంపిచేస్తాడు.
శరత్ చంద్ర గెస్ట్ హౌస్‌కు వచ్చిన ఎస్సైని వాచ్‌మెన్ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. ఎస్సై శరత్చంద్రకు ఫోన్ చేసి తాను వచ్చానని చెప్తాడు. అయితే శరత్ చంద్ర కూడా పది నిమిషాల్లో వస్తున్నాను అని చెప్తాడు. ఇంతలో వాచ్‌మెన్ వెజిటేబుల్ కోసం మార్కెట్‌కు వెళ్తాడు. వాచ్‌మెన్ వెళ్లగానే.. శరత్ చంద్ర వస్తాడు. లోపలికి వెళ్లి చూడగా ఎస్సై మర్డర్ అయి ఉంటాడు. శరత్ చంద్ర షాక్ అవుతాడు. వెంటనే డీఎస్పీకి కాల్ చేసి విషయం చెప్తాడు. డీఎస్పీ కొంత మంది పోలీసులను తీసుకుని శరత్‌చంద్ర గెస్ట్ హౌస్‌కు వస్తాడు. అక్కడ ఎస్సై మర్డర్ జరిగిన తీరు చూసి షాక్ అవుతాడు. ఇది ఎవరో కావాలని ఫ్రీప్లాన్డ్‌గా చేశారని చెప్తాడు. కేసు క్లోజ్ అయ్యే వరకు శరత్ చంద్ర ఎక్కడికి వెళ్లకూడదని.. అవసరం అయితే కోర్టుకు కూడా రావాలని చెప్తాడు. ఇలా ఈ వారం మేఘసందేశం ఎస్సై కాల్ తో మొదలై.. అదే ఎస్సే మర్డర్‌తో ముగుస్తుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















