Meghasandesam Serial Today September 20th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్‌కు నిజం చెప్పిన శారద – కోపంతో ఊగిపోయిన గగన్
Meghasandesam serial today episode September 20th: శారద నిజం చెప్పడంతో అపూర్వను చంపేస్తానని గగన్ ఆవేశంతో వెళ్లిపోతాడు. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: కేపీ వాళ్ల అమ్మతో కలిసి గగన్‌ను కలవడానికి వెళ్తారు. అక్కడ కేపీ బయటే ఉండి వాళ్ల అమ్మ మాత్రమే అకాడమీ లోపలికి వెళ్తుంది. కేపీని కూడా రమ్మంటే నేను వస్తే వాడు నీతో కన్నా నాతోనే ఎక్కువగా మాట్లాడతాడు అని చెప్తాడు కేపీ. దీంతో ఒక్కతే వెళ్తుంది. గగన్‌తో పెళ్లి గురించి మాట్లాడుతుంది.
గగన్: నాన్నమ్మ అసలేం జరిగిందంటే..
కేపీ తల్లి: నాకేం చెప్పకురా..? పుట్టుక మన చేతుల్లో లేదు. చావు మనకు చెప్పి రాదు. పెళ్లి ఒక్కటే.. నచ్చినట్టు నచ్చిన వాళ్లతో నిర్నయించుకుని చేసుకునేది. నీ పెళ్లి చూడాలని నేను ఎంత ఆశపడ్డానో తెలుసా..?
గగన్: నాన్నమ్మ నీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్తం కావడం లేదు..
కేపీ తల్లి: రేయ్ అయిపోయిన దాని గురించి నిన్ను అడిగి బాధపెట్టడం ఎందుకులే.. ఇంతకీ భూమి ఎక్కడుంది ఇంటి దగ్గరా..?
గగన్: డాన్స్ క్లాస్ కు వెల్లింది.
అని చెప్పగానే తన మెడలో గోల్డ్ చైన్ తీస్తుంది
కేపీ తల్లి: గగన్ నువ్వు భూమి పెళ్లి చేసుకున్న తర్వాత నీ చేత్తో ఈ నగను భూమి మెడలో వేయించాలనుకున్నాను. అప్పుడు కుదరలేదు ఇప్పుడు ఇస్తున్నాను తీసుకో..
గగన్: నాన్నమ్మ వద్దు వద్దులే
కేపీ తల్లి: రేయ్ నేను ఆ ఇంటి మనిషిని కాదురా ఈ ఇంటి మనిషినే.. కొడుక్కోసం తప్పక అక్కడ ఉండాల్సి వస్తుంది తీసుకో నాన్న.
గగన్: నేను వద్దంటున్నాను కదా..
కేపీ తల్లి: ఇది మీ నాన్న డబ్బు తోనో ఆ ఇంట్లో వాళ్ల డబ్బుతోనో చేయించింది కాదురా మీ తాతయ్య కష్టార్జీతంతో చేయించింది. ఇది ఎప్పటికైనా మీకు ఇవ్వాల్సిందే తీసుకో..
అంటూ చేతిలో పెట్టబోతుంటే గగన్ తీసుకోకుండా జరగని పెళ్లికి నువ్వు ఇచ్చే బహుమతి తీసుకోమంటావా..? అని అడుగుతాడు. దీంతో ఆమె షాక్ అవుతుంది. గగన్ తాను తాళి కట్టలేదని ఎమోషనల్ అవుతాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు బుల్లెట్ గాయాలతో ఇంట్లో పడిపోయిన శారదను వెంటనే భూమి హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది. రత్న ఇంట్లో కెమెరా కోసం వెతికి పారిపోతుంది. అపూర్వకు విషయం చెప్తుంది. దీంతో అపూర్వ ఎలాగైనా శారద బతకకూడదని ఆలోచిస్తుంది. మరోవైపు హాస్పిటల్ లో ఉన్న శారద దగ్గరకు గగన్ పరుగెత్తుకుంటూ వస్తాడు. ఏడుస్తూ శారదను చూస్తుంటాడు. ఇంతలో శారద కళ్లు తెరుస్తుంది.
భూమి: బావా అత్తయ్యా కళ్లు తెరుస్తుంది చూడు..
గగన్: అమ్మా.. అమ్మా.. ఏంటమ్మా..
అని అడగ్గానే.. నోటికి ఉన్న ఆక్సిజన్ తీసేయమని సైగ చేస్తుంది శారద. గగన్ ఆక్సిజన్ తీసేస్తాడు. దీంతో శారద తాను కెమెరాలో చూసింది గుర్తు చేసుకుంటుంది.
శారద: నీ గదిలో నాకు ఒక పాత కెమెరా దొరికింది. అందులో శోభా చంద్రను అపూర్వ చంపుతున్న వీడియో ఉందిరా..? ఆ కెమెరా ఇంట్లో పడిపోయింది. ఆ రత్న కూడా అపూర్వ మనిషే..
గగన్: ఈ క్షణమే అపూర్వను చంపేస్తాను.. దాన్ని వదిలిపెట్టను..
అంటూ గగన్ ఆవేశంగా వెళ్లిపోతుంటే.. భూమి, పూర్ని ఆపాలని ప్రయత్నిస్తారు. గగన్ ఆగడు. శారద పిలుస్తున్నా ఆగకుండా ఆవేశంగా అపూర్వను చంపేస్తాను అంటూ వెళ్లిపోతాడు. దీంతో భూమి ఏడుస్తూ.. శారద దగ్గరకు వస్తుంది.
భూమి: అత్తయ్యా ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్యా..
శారద: వాడు మామూలుగానే మాట వినడు. ఇప్పుడు వాడికి నిజం తెలిసింది ఇక వాణ్ని మనం ఆపగలమా..? ఆవేశంతో ఇప్పుడు వాడు అపూర్వను చంపేస్తాడేమో..?
అని శారద చెప్పగానే.. భూమి టెన్షన్ పడుతుంది. మరోవైపు నిజం తెలుసుకున్న గగన్ తనను చంపడానికి వస్తున్నాడని తెలుసుకున్న అపూర్వ భయంతో అటూ ఇటూ తిరుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















