Meghasandesam Serial Today October 12th: ‘మేఘసందేశం’ సీరియల్: కేపీ వస్తువులు బయట పడేసిన శరత్ చంద్ర – స్టేషన్‌లో కేపీని చూసి షాకైన భూమి
Meghasandesam serial today episode October 12th: స్టేసన్ కు వెళ్లిన భూమికి ఏసీపీ సూర్య మీ అమ్మను మా అన్నయ్యను చంపింది ఇతనే అంటూ కేపీని చూపిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: రత్న తనతో మర్డర్లు చేయించింది కేపీ అని చూపిస్తుంది. దీంతో శరత్ చంద్ర కోపంగా కేపీని కొడుతుంటాడు. ఎవరు అడ్డు వెళ్లినా ఆగడు. దీంతో అపూర్వ శరత్ చంద్రను మరింత రెచ్చగొడుతుంది.
అపూర్వ: నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. మీరాను పెళ్లి చేసుకోవడానికి కన్నా ముందే నీకు పెళ్లి అయిపోయిందన్న నిజం నా శోభాచంద్ర అక్కకు తెలిసిందనే నువ్వు మా అక్కను చంపేశావు కదా..? నీ నిజాలు బయటపడతాయనే ఆ ఎస్సని చంపిచావు కదా…? సైలెంట్‌గా ఉండే నీ వ్యక్తిత్వం వెనక ఇంత దుర్మార్గుడు ఉన్నాడా..?
అంటూ అపూర్వ తిడుతుంటే కేపీ షాక్ అవుతాడు. ఇంతలో పోలీసులు వస్తారు.
శరత్: వెంటనే వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లండి.. చేసిన తప్పుకు శిక్ష పడేలా చేయండి. ఇన్ని రోజులు నమ్మకద్రోహిని పక్కలో పెట్టుకుని పెంచాను.
అంటూ శరత్ చంద్ర చెప్పగానే.. పోలీసులు కేపీని తీసుకెళ్తారు. దీంతో మీరా బిందు ఏడుస్తుంటారు. శరత్ చంద్ర కోపంగా లోపలికి వెళ్లి కేపీ బట్టలు వస్తువులు తీసుకొచ్చి బయట పడేస్తాడు.
శరత్: ఆ కృష్ణ ప్రసాద్ గాడి జ్ఞాపకాలు ఇక ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెంటనే వాడి సామాన్లు తీసేయండి..
బిందు: ఏంటి మామయ్యా మీరు మాట్లాడేది. నాన్న జ్ఞాపకాలు అంటే మేము కూడా నాన్న జ్ఞాపకాలమే కదా మేము కూడా ఇంట్లోంచి వెళ్లిపోవాలా..? మమ్మల్ని ఇన్‌డైరెక్టుగా ఇల్లు వదిలి వెళ్లిపొమ్మని చెప్తున్నావా..?
శరత్: అయ్యో బిందు మిమ్మల్ని కాదమ్మా.. నేను అనేది ఆ కృష్ణ ప్రసాద్‌ను అంటున్నాను..
బిందు: మామయ్య నాన్న అలాంటి వాడు కాదు. మీరు ఇన్ని రోజుల నుంచి నాన్నను చూస్తున్నారు కదా ఆయన గురించి ఎవరో ముక్కు మెఖం తెలియని వ్యక్తి ఏదో చెబితే ఎలా నమ్ముతారు మామయ్య
శరత్: అది పెద్ద హంతకురాలు. డైరెక్టుగా మన ఇంటికే వచ్చి మీ నాన్నే తనతో ఈ నేరం చేయించాడని చెప్తుంది. ఇంకా నమ్మకుండా ఎలా ఉండటం బిందు.. అలాంటి వాడిని ఇంట్లోనే ఉండనివ్వకూడదు. అందుకే వాడి జ్ఞాపకాలు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు.
బిందు: అయితే నాన్న లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను మామయ్య. నేను కూడా ఎటైనా వెళ్లిపోతాను.. ఇక్కడ ఉండను..
చెర్రి: అవసరం లేదు బిందు. మనం ఎవ్వరం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్లిపోతే నాన్న నిజంగానే తప్పు చేశారు. అందుకే ఆయన పిల్లలను కూడా శరత్ చంద్ర ఇంట్లోంచి గెంటి వేశాడని అందరూ అనుకుంటారు. ఆ నిందలు మనం నాన్న మీద వేయించడం కరెక్టు కాదు బిందు. నాన్న నిర్ధోషి అని నిరూపించుకుని స్వచ్చంగా ఇంటికి వచ్చే వరకు మనం ఇక్కడే ఉంటున్నాము. ఈ పెద్ద మనిషికి నిజం తెలిసేంత వరకు... నిజం తెలిసేలా చేసేంత వరకు మనం ఇక్కడే ఉంటున్నాం.. అవును మామయ్య నీకు నిజం ఏంటో తెలిసేలా చేసేంత వరకు మేము ఇక్కడే ఉంటాము.. మీకు అపూర్వ అత్తయ్య మీద ప్రేమతో మీ కళ్లు మూసుకుపోయాయి. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మీరు తెలసుకోవాలంటే.. మందు మీ కళ్లు తెరిపించాలి. అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాము.. ఇక్కడ జరుగుతున్నవి మీకు తెలిసేలా చేస్తాము..
అపూర్వ: ఓరేయ్ చెర్రి ఏం మాట్లాడుతున్నావు.. చూశావా బావ వీణ్ని చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా పెంచాను. ఇప్పుడు నా మీద నిందలు వేస్తున్నాడు.
చెర్రి: అవును మామయ్య శోభాచంద్ర అత్తయ్యను చంపింది అపూర్వ అత్తయ్యే..
శరత్: ఏం వాగుతున్నావురా..?
అంటూ చెర్రిని కొడతాడు శరత్ చంద్ర. మీరు కొట్టినా చంపినా ఇదే నిజం మామయ్య అంటూ చెర్రి చెప్తుంటాడు. అపూర్వ షాక్ అవుతుంది. మరోవైపు స్టేషన్‌కు వెళ్లిన భూమి అక్కడ కేపీని చూసి షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















