Meghasandesam Serial Today November 9th: ‘మేఘసందేశం’ సీరియల్: కేపీకి పిండ ప్రదానం చేస్తానన్న అపూర్వ – ఎలాగైనా అడ్డుకుంటానన్న భూమి
Meghasandesam serial today episode November 9th: కేపీకి పిండ ప్రధానం చేయాలని అపూర్వ చెప్పడంతో భూమి ఎలాగైనా ఆపాలనుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: శారద గుడికి వెళ్లి అర్చన చేయించడం అపూర్వ చూస్తుంది. శారద ఎవరి పేరుతో అర్చన చేయించిందో తెలుసుకోవడానికి పంతులు దగ్గరకు వెళ్తుంది అపూర్వ.
అపూర్వ: నమస్కారం స్వామి..?
పంతులు: నమస్కారం అమ్మా.. మీ పేరు గోత్రం చెప్పండి అమ్మ..
అపూర్వ: ఇప్పుడు నా పేరు గోత్రంతో పని లేదు కానీ జస్ట్ ఒక సమాచారం ఇవ్వండి చాలు..
పంతులు: ఏంటమ్మా అది..?
అపూర్వ: ఇప్పుడు ఒకావిడ వచ్చి అర్చన చేయించింది కదా..? అది ఎవరి పేరు మీద చేయించింది
పంతులు: ఇప్పుడంటే జస్ట్ ఇప్పుడే వెళ్లిపోయారు కదమ్మా..? ఆవిడ గురించి అడుగుతున్నారా..?
అపూర్వ: అవునండి ఆవిడే..
పంతులు: అది ఆవిడ ఎర్ర రంగు చీర కట్టుకున్నారు కదా ఆవిడ గురించే కదమ్మా..?
అపూర్వ: అయ్యో ఆవిడ గురించే ఇది తీసుకోండి తీసుకోండి పంతులు గారు.. ( డబ్బులు ఇస్తుంది)
పంతులు: నీ పేరేంటి అమ్మా..?
అపూర్వ: అపూర్వ.. అపూర్వ పంతులు గారు..
పంతులు: ఎంత విచిత్రం నీ పేరు మీదే ఆవిడ అభిషేకం చేయించారు. ఇదిగోమ్మా తీసుకోండి భక్తులు తమ బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తారు. నీలాంటి వారికి వివరాలు ఇచ్చే మధ్యవర్తిగా ఆ శ్రీమన్నారాయణుడు నాకు జన్మను ఇవ్వలేదు. ఏదైనా కష్టం ఉంటే ఆ దేవుడికి చెప్పుకోండి..
అని పంతులు లోపలికి వెళ్లిపోతాడు. అపూర్వ బయటకు వెళ్లి చూస్తుంది. అక్కడ శారద ముడుపు కడుతుంది. కట్టి వెళ్లిపోతుంది. ఆ ముడుపులో ఎవరి పేరు ఉందో చూడాలని శారద కట్టిన ముడుపు విప్పబోతుంది అపూర్వ. అక్కడే ఉన్న భక్తులు వచ్చి అది విప్పకూడదమ్మా..? ఒకసారి కట్టిన ముడుపు మళ్లీ విప్పకూడదమ్మా.. కావాలంటే కొత్తది కట్టండి అని చెప్పగానే.. అలాగే అలాగే చేస్తాను అని అపూర్వ చెప్తుంది. దీంతో భక్తులు ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. వెంటనే అపూర్వ ముడుపు తీసుకుని కారులో వెళ్తుంది. కారులో కూర్చుని ముడుపు విప్పి అందులో పేరు చూసి షాక్ అవుతుంది. అందులో ఆయణ్ని బతికించినందుకు నీకు వేల వేల కృతజ్ఞతలు స్వామి అని రాసి ఉంటుంది. దీంతో అపూర్వ ప్లాన్ ప్రకారం కేపీ బతికే ఉన్నాడన్న విషయం శారద, భూమి చేత చెప్పించాలని కేపీకి పిండ ప్రదానం చేయాలని చెప్తుంది ఆ విషయం తెలిసి భూమి ఎలాగైనా పిండ ప్రధానం ఆపాలని చూస్తుంది. తర్వాత హాస్పిటల్‌లో శారద కేపీకి భోజనం తినిపిస్తుంది. పక్కనే భూమి నిలబడి సైగ చేస్తుంది.
కేపీ: శారద ఇంకా ఎన్నాళ్లు నాకు ఈ అజ్ఞాతవాసం.. అదేంటమ్మా భూమి.. ఎందుకు అలా ఉన్నావు..? ఏమైంది..? (అని అడగ్గానే.. ఎవ్వరూ పలకరు) చెప్పమ్మా ఏమైంది ఎందుకు మౌనంగా ఉన్నావు.. ఏమైంది శారద నువ్వైనా చెప్పు..
భూమి: ఏమీ లేదు మామయ్య.. మీరు లేరని అందరూ అనుకుంటున్నారు కదా..? అలాగే మీకు పిండ ప్రదానం చేయాలని అపూర్వ చెప్పింది.
అనగానే కేపీ ఎమోషన్ అవుతాడు.
కేపీ: నాకే ఈ కర్మ ఎందుకు శారద..
భూమి: మీరే బాధపడకండి మామయ్య నేను ఉండగా ఆ కార్యక్రమాన్ని జరగనిస్తానా.? కాకపోతే అది ఆపడానికి మీ సహాయం కావాలి మామయ్య..
కేపీ: ఏ సహాయం అయినా చేస్తాను భూమి.. మీరు అడగడం కాదు ఏం చేయాలో చెప్పండి చేస్తాను
అని కేపీ చెప్పగానే.. ఏం చేయాలో భూమి చెప్తుంది. దీంతో అలాగే చేస్తాను అంటాడు. దీంతో అందరూ కలిసి నాటకం మొదలు పెడతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















