Meghasandesam Serial Today November 29th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ భోజనం తినిపించిన భూమి – గతం గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన గగన్
Meghasandesam serial today episode November 29th: ఎస్పీ సూర్యను కొట్టిన గగన్ కు దెబ్బలు తగలడంతో గగన్‌కు అన్నం తినిపిస్తుంది భూమి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: శరత్ చంద్ర ఇంటికి వెళ్లిన కేపీకి అపూర్వ చేత దిష్టి తీయిస్తుంది మీరా. తర్వాత గుమ్మడి కాయతో దీపం వెలిగించి కేపీకి దిష్టి తీసి బయటకు వెళ్లి గుమ్మడి కాయను పగుల గొడుతుంది మీరా. మీరా లోపలకి వచ్చే సరికి కేపీ కోపంగా అపూర్వను, శరత్ చంద్రను చూస్తుంటాడు. లోపలికి వచ్చిన మీరా ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది. కేపీని ఏవేవో ప్రశ్నలు వేస్తుంది. కేపీ మాత్రం పలకకుండా కోపంగా చూస్తుంటాడు. శరత్ చంద్ర తనను గన్ తో కాల్చిన విషయం అపూర్వ తనను తోసేసిన విషయం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు.
మీరా: ఏవండి ఏంటండి మాట్లాడటం లేదు.. అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నారు..? మీరు ఎలా బతికి వచ్చారు.. చెప్పండి.. అన్నయ్య మీరైనా అడగండి వదిన మీరేం మాట్లాడరేంటి..? ఒరేయ్ చెర్రి నువ్వైనా మీ నాన్నను అడగరా..? ఆయన ఆత్మహత్య చేసుకోవాలన్నంత కష్టం ఏమొచ్చిందో చెప్పమను చెర్రి మీ నాన్నని.
చెర్రి: అమ్మా ఇప్పుడు ఏమైంది అమ్మా..? నాన్న క్షేమంగా తిరిగి వచ్చారు కదా..? ఎందుకు ఏడుస్తున్నావు..?
మీరా: ఎందుకు ఏడవడం ఏంట్రా మనం అందరం ఉండగా మీ నాన్నకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. అది అడగరా మీ నాన్నను..
కేపీ: మీరా నేను ఆత్మహత్య చేసుకోవడం ఏంటి..? అసలు ఆ ఉద్దేశం కూడా నాకు లేదు. నేను ఆత్మహత్య చేసుకున్నానని ఎవరు చెప్పారు మీకు..
మీరా: అదేంటండి అందరూ అంటున్నారు కదండి.. మీరే కేసు విషయంలో తల దించుకుని ఆత్మహత్య చేసుకున్నారని.. ఆ ఏసీపి సూర్య కూడా చెప్పారు పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా మీరు ఆత్మహత్య చేసుకున్నట్టు వచ్చింది కదండి.. ఆ కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారట కదా..?
కేపీ: అయ్యో మీరా నీకు ఎలా చెప్పాలి.. అసలు మీరు తీసుకెళ్లిన బాడీయే నాది కానప్పుడు అది ఎలా చనిపోయిందో అలాగే రిపోర్టు వస్తుంది. ఏం బావ గారు మీరు కూడా ఇలాగే అనుకున్నారా..? నేను ఆత్మహత్య చేసుకున్నానని నమ్మరా..? నిజం ఏంటో మీరు కూడా చెప్పలేదా..? నాకు గుండెల్లో బుల్లెట్ తగిలితే కాలు జారి కొండ మీద నుంచి కింద పడిపోయాను.
మీరా: అదేంటండి.. మీ గుండెల్లో బుల్లెట్ దిగడం ఏంటి… ఎవరు మిమ్మల్ని కాల్చేశారు చెప్పండి… అయినా మా అన్నయ్యను అడుగుతున్నారేంటి..?
కేపీ: ఏం బావగారు ఏం జరిగిందో మీరు చెప్పలేదా..?
మీరా: నేను మిమ్మల్ని అడుగుతుంటే.. మీరేంటి మా అన్నయ్యను అడుగుతున్నారు..?
కేపీ: అపూర్వ గారు కనీసం మీరు కూడా జరిగింది చెప్పలేదా అండి..?
మీరా: అయ్యో రామ నేను మిమ్మల్ని అడుగుతుంటే.. మీరు మా అన్నయ్య, వదినను అడుగుతారేంటండి..?
అంటూ మీరా అడగ్గానే.. కేపీ కోపంగా మీరా నన్ను షూట్ చేసింది మీ అన్నయ్య వదినే.. అంటూ కేపీ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మరోవైపు ఎస్పీ సూర్యను కొట్టిన గగన్‌క దెబ్బలు తగిలితే భూమి కట్లు కడుతుంది. భోజనం తినిపిస్తుంది. దీంతో గగన్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. దీంతో భూమి, గగన్ ఇద్దరూ ఎమోషనల్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















