Meghasandesam Serial Today November 21st: ‘మేఘసందేశం’ సీరియల్: కేపీకి పిండ ప్రదానం చేస్తానన్న గగన్ - షాక్‌లో శారద, భూమి
Meghasandesam serial today episode November 21st: శరత్ చంద్ర అడగడంతో కేపీకి పిండ ప్రదానం చేయడానికి గగన్ డిసైడ్ అవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: శరత్ చంద్ర ఇంటికి వెళ్లి వచ్చిన భూమి డల్లుగా ఉంటుంది. ఎదురుగా వెళ్లిన శారద ఏమైందని అడుగుతుంది. ఇంటికి వెళ్లి వచ్చావు కదా మీ నాన్న ఏమన్నారు అని అడుగుతుంది. భూమి పలకకుండా అలాగే చూస్తుంది.
శారద: చెప్పమ్మా భూమి మీ నాన్న గారు ఏమన్నారు..? నిన్ను ఏమీ తిట్టలేదు కదా..? నీపై కోప్పడలేదు కదా..?
భూమి: ఏమీ అనలేదు అత్తయ్య..
శారద: అయితే మొత్తానికి మీ నాన్నగారి కోపం చల్లారింది అన్నమాట. ఇంతకీ ఆయన ఏమన్నారు.. నీతో అసలు మాట్లాడలేదా..? నువ్వు ఇంటికి వెళితే ఆయన ఏదో ఒకటి అనే ఉంటారు కదా భూమి.. నువ్వేమో ఆయన ఏమీ అనలేదు అంటున్నావు..
భూమి: ఆయన నా మీద కోప్పడలేదు కానీ నాకో కండీషన్ పెట్టారు.. ఆ కండీషన్ ప్రకారం నేను నడుచుకోవాలన్నారు.. అత్తయ్య
శారద: ఏం కండీషన్ పెట్టారు భూమి.. చెప్పు.. ఎందుకు కండీషన్ పెట్టారు..?
భూమి: ఆయన చెప్పినట్టు చేస్తే నన్ను ఆయన కూతురిగా అంగీకరిస్తా అన్నారు అత్తయ్య.. పైగా ఇంత వరకు జరిగిన విషయాలు మొత్తం మర్చిపోతారట. అందరూ హ్యాపీగ ఉండొచ్చని అన్నారు.
శారద: ఇంతకీ ఆయన ఏ కండీషన్ పెట్టారు.. ఏం పని చేయమని చెప్పారు అది చెప్పు భూమి.. అది చెప్పకుండా నువ్వేదో చెప్తున్నావు.. ఇంతకీ మీ నాన్న గారు చెప్పిన ఆ పనేంటి భూమి..? ఆయన కోసం నువ్వేమైనా చేస్తావు కదా భూమి.. ఇప్పుడు ఇది ఎందుకు చేయకూడదు..? ఇంకా ఆలోచిస్తావేంటి..? ఆయన చెప్పిన పని చేసి ఆయన కోపం తగ్గించొచ్చు కదమ్మా..?
భూమి: ( మనసులో) ఆయన చెప్పిన కండీషన్ తెలిస్తే మీరు తట్టుకోలేరు అత్తయ్య.. మీకు ఎలా చెప్పాలి నేను ఆ విషయం
అనుకుంటుండగా.. శారద మాత్రం ఆత్రుతగా చూస్తుంది. కానీ భూమి అసలు విషయం చెప్పకపోయే సరికి కోప్పడుతుంది.
శారద: ఏంటి భూమి ఆలోచిస్తున్నావు.. ఇంతకీ మీ నాన్న గారు ఏం కండీషన్ పెట్టారు చెప్పమ్మా..?
భూమి: అత్తయ్య ఆయన పెట్టిన కండీషన్ గురించి తెలిస్తే మీరు బాధపడతారు. మీరు కూడా అందుకు నన్ను ఒప్పుకోవద్దంటారు అత్తయ్య..
శారద: ఏం కండీషన్ పెట్టారు.. గగన్ ను వదిలేసి రమ్మన్నారా..? లేకపోతే ఈ ఇంటి కోడలిగా కాకుండా ఆ ఇంటి శరత్ చంద్ర బిడ్డగా బతకమని చెప్పారా..? ఏం చెప్పారు చెప్పు భూమి.. ఆయన ఎలాంటి కండీషన్ పెట్టినా ఆయన కోసం నువ్వు చేస్తావా..? భూమి..
భూమి: అదేం లేదు అత్తయ్య ఆయన వేరే కండీషన్ పెట్టారు.. మీకే కాదు బావకు కూడా కోపం తెప్పించే విషయం అత్తయ్య
శారద: మాకు నచ్చదు కోపం వస్తుంది అంటున్నావు కానీ అసలు మీ నాన్న గారు ఏమన్నారో చెప్పమంటే చెప్పడం లేదేంటి..? భూమి..
భూమి: బతికున్న మామయ్యకు పిండ ప్రదానం చేయమని అది కూడా గగన్ బావతో చేయించమని అందుకోసం బావను నన్నే ఒప్పించాలని కండీషన్ పెట్టారు అత్తయ్య.. అప్పుడే నన్ను కూతురిగా మళ్లీ అంగీకరిస్తా అన్నారు..
అని భూమి చెప్పగానే.. శారద షాక్ అవుతుంది. ఇంతలో పై నుంచి గగన్ రావడంతో భూమి, శారద ఆ విషయం మాట్లాడకుండా ఉండిపోతారు.. అయితే మీరు లేని టైంలో మన ఇంటికి ఆ శరత్‌చంద్ర వచ్చాడు అమ్మ అని గగన్ చెప్పడంతో భూమి, శారద భయపడతారు. అయితే శరత్ చంద్ర అడిగిన విషయం చెప్పి కేపీకి నా చేతులతో పిండ ప్రధానం చేయాలనుకుంటున్నాను అని గగన్ చెప్పడంతో ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















