Meghasandesam Serial Today November 17th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్‌ను రొమాంటిక్‌గా చూసిన భూమి – కోపంతో తిట్టిన గగన్
Meghasandesam serial today episode November 17th: లుంగీలో ఉన్న గగన్‌ను రొమాంటిక్ గా చూస్తుంది భూమి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: శారద, భూమి, శివ భోజనం చేస్తుంటారు. పూరి వడ్డిస్తుంది. గగన్ దూరంగా హాల్లో కూర్చుని టీవీ చూస్తుంటాడు. ఇంతలో శివ కోపంగా ఏంటి పూరి నువ్వు కూరలు చేస్తే చప్పగా ఉంటాయేంటి..? అంటాడు. దీంతో భూమి కోపంగా శివను తిడుతుంది.
భూమి: ఏమీ లేకపోతే తినలేవా..? ఉప్పు కారం తగ్గిస్తే కాస్త పౌరుషం అయినా తగ్గుతుంది. ఉప్పు కారం ఎక్కువ అయితే కోపం వచ్చినప్పుడు ఒంటి మీద స్పృహ ఉండదు. మనిషికి మేకకు తేడా తెలియకుండా కోసి చంపేద్దాం అనుకుంటారు.
శారద: భూమి వద్దు..
భూమి: ఈరోజు మీరు నన్ను ఆపాలని చూడకండి అత్తయ్య.. హాస్పిటల్ లో ఈ రోజు ఏం జరిగేదో మీకు తెలియదా..? ఈయన గారు ఆ అపూర్వను చంపేసి వెళ్లి జైల్లో కూర్చునే వారు. రేపటి నుంచి మీకు కొడుకు ఉండే వాడు కాదు.. నాకు భర్త ఉండే వాడు కాదు.
గగన్: భూమి.. ఇప్పుడు చెప్పండి నిన్న అర్థరాత్రి మీరు ఇద్దరూ ఎందుకు బయటికి వెళ్లారు. ఉదయం రెస్టారెంట్ లో కనిపించిన భూమి.. నన్ను వాష్ రూంలో లాక్ చేసి ఎందుకు వెళ్లిపోయింది.? అంత క్యారేజ్ పట్టుకుని భూమి హాస్పిటల్‌కు ఎందుకు రావాల్సి వచ్చింది. ఇదిగో మీ ఇద్దరినీ హాస్పిటల్ సీసీటీవీ పుటేజీలో చూశాను. చెప్పండి నాకు తెలియకుండా నా వెనక ఏమీ జరుగుతుందో నాకు తెలియాలి.
భూమి: సరే ఇంత దూరం వచ్చాక నీ దగ్గర ఎందుకు దాయాలి. నేను చెప్తాను..
గగన్: ఏయ్ నువ్వు కూర్చో.. నువ్వు నోరు తెరిస్తే పచ్చి అబద్దం.. క్షణం మారితే మాట మారుస్తావు. నేను నిన్ను నమ్మను.. నువ్వు కూర్చో.. అమ్మా నువ్వు చెప్పు.. ఇదిగో నిన్న అర్దరాత్రి నుంచి నువ్వ నన్ను హాస్పిటల్ లో అడ్డుకున్నంత వరకు ఏం జరిగిందో చెప్పు..
అని గగన్ బలవంతంగా అడుగుతుంటే.. శారద చెప్పడానికి ట్రై చేస్తుంటే.. భూమి చెప్పొద్దని సైగ చేస్తుంది.
గగన్: ఏయ్ కోతి ఇంకొక్కసారి నువ్వు సైగలు చేశావంటే ప్లేట్ ముఖం మీద ఉంటుంది. నువ్వు చెప్పమ్మా..? చెప్పమ్మా..?
శారద: చెప్పు చెప్పు అంటే ఏం చెప్పమంటావురా..? రాత్రి కొంచెం ఒంట్లో నలతగా ఉంటే భూమిని తీసుకుని హాస్పిటల్ కు వెళ్లాను.
గగన్: భూమిని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లడం ఏంటి..? నేను నీ కొడుకును లేనా..?
శారద: ఇది మరీ బాగుంది. ఎంత నువ్వు నా కొడుకువు అయినా నువ్వు కూడా ఒక మగాడితే.. మగాళ్లకు చెప్పుకోలేని ఆడాళ్ల సమస్యలు బోలెడు ఉంటాయిరా..? అందుకే సమస్య ఏంటో సాటి ఆడదానికి నా కొడలికి చెప్పుకుని హాస్పిటల్‌కు వెళ్లాను. ఉదయం నా టిఫిన్ కోసం రెస్టారెంట్ కు వచ్చింది. మధ్యాహ్నం నాకు భోజనం తెచ్చింది. చాలా ఇంకేమైనా కావాలా..? దీనికే నువ్వు మీ అమ్మను అనుమానిస్తే ఎలారా..?
గగన్: అదికాదు నేనేం నిన్ను అనుమానించలేదు. నా అనుమానం అంతా అదిగో ఈ కోతి మీదే..? చూడమ్మా.. ఆరోగ్య పరంగా నువ్వు నాకు చెప్పుకోలేనివి ఉంటే చెప్పదు కానీ ఎక్కడికి తీసుకెళ్లాలో చెబితే నేను తీసుకెళ్తాను. అంతే కానీ ఈ తైతక్కను మాత్రం నమ్మకు
అని చెప్పి గగన్ రూంలోకి వెళ్లిపోతాడు. గగన్ వెనకే వెళ్లిన భూమి గగన్‌తో సరసాలు ఆడుతుంది. లుండీ కట్టుకున్న గగన్‌ను అదో రకంగా చూస్తుంది. దీంతో గగన్ కోపంగా భూమిని తిడతాడు. అయినా భూమి గగన్‌ను రొమాంటిక్‌గా చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















