Meghasandesam Serial Today November 13th: ‘మేఘసందేశం’ సీరియల్: హాస్పిటల్‌లో కేపీని చూసిన అపూర్వ – కేపీ కోసం గాలిస్తున్న గగన్
Meghasandesam serial today episode November 13th: హాస్పిటల్ లో కేపీని గగన్, అపూర్వ చూడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: రూంలో కేపీ ఫోటో పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటుంది మీరా. కేపీ వచ్చి తనక పిండ ప్రధానం గగన్ మాత్రమే చేయాలని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది.
మీరా: కొంచెం ఆలస్యం అయ్యుంటే నేను మీకు ఇచ్చిన మాట తప్పేదాన్నండి. మీకు పిండ ప్రధానం జరిగిపోయేది. అదృష్టం కొద్ది ఆఖరి నిమిషంలోనైనా ఆపగలిగాను. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానండి. మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి. మరో జన్మలో నేనే మీ భార్యను కావాలండి
అంటూ ఫోటోకు చెప్పుకుంటూ ఏడుస్తుంటే.. అప్పుడే అక్కడికి అపూర్వ, సుజాత వస్తారు.
అపూర్వ: మీరా..? నీ బాధ చూస్తుంటే నా గుండె చెరువు అయిపోతుంది మీరా..?
సుజాత: నా గుండె అయితే ఏకంగా సముద్రమే అయిపోయింది అమ్మాయి.
అపూర్వ: ఏడ్వకు మీరా.. ఏడ్వకు.. నీకు ఓ విషయం తెలుసా..? నీకు కనబడలే.. ఆ శారద కంటే నువ్వంటేనే కేపీకి ఎక్కువ ఇష్టం అని ఫ్రూవ్ అయింది.
మీరా: నిజంగానా వదిన. అది నువ్వెలా చెప్పగలుగుతున్నావు..
అపూర్వ: అంటే నీ మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టే.. నీ కలలోకి వచ్చాడు. అదే ఆ శారద మీద ఉండి ఉంటే.. ఆ శారద కలలోకే వెళ్లే వాడు కదా..? గగన్‌తోనే పిండం పెట్టించు అని చెప్పేవాడు కదా..?
మీరా: నిజమా వదిన ఇన్నాళ్లకు నా ప్రేమ ఆయనకు అర్థం అయిందా..?
అపూర్వ: అవక తప్పుతుందా చెప్పు.. చనిపోయాకే నిజమైన ప్రేమేంటో ఆ ఆత్మకు తెలుస్తుందట. నీ నిజమైన ప్రేమను కేపీ తెలుసుకోగలిగాడు అమ్మ. అంతేగా పిన్ని..
సుజాత: ఆ అంతేగా అమ్మాయి. మొగుడు చస్తే గాని బండకు బుద్ది రాలేదు అన్నట్టు.. చచ్చాక కానీ మీరా ప్రేమను కేపీ తెలుసుకోలేకపోయాడు.
మీరా: మీరు ఇలా మాట్లాడుతుంటే నా మనసు కొంచెం తేలిక పడ్డట్టు ఉంది పిన్ని గారు.
అపూర్వ: అది సరే కానీ మీరా..? ఈ గదిలోనే కదా కేపీ నీ కలలలోకి వచ్చాడు.
మీరా: అవును వదిన
అపూర్వ: ఏది ఎలా వచ్చాడు..? ఏం మాట్లాడు మాకు వివరించి చెప్పవా..?
మీరా: నేను ఈ మంచం మీద నిద్రపోతున్నాను వదిన..
అంటూ మీరా తనకు వచ్చిన కల గురించి మళ్లీ చెప్తుంది. చెప్తూ మీరా ఏడుస్తుంది.
అపూర్వ: ఊరుకో మీరా ఊరుకో.. కలలోకి పావురాలు వచ్చాయి అని
మీరా: అవును వదిన వచ్చాయి..
అపూర్వ: ఆ తర్వాత ఏం జరిగింది.
మీరా: తర్వాత ఆయన మాయం అవ్వడం కనక నేను చూస్తే మళ్లీ మేము కలవలేము అని చెప్పి వెళ్లిపోయారు
అని మీరా చెప్పగానే.. అపూర్వ మీరాన ఓదార్చినట్టు నటిస్తూ.. బయటకు వెళ్లిపోతంది. తర్వాత నక్షత్ర కింద పడటంతో నక్షత్రను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తుంది అపూర్వ. అక్కడ హాస్పిటల్ లోంచి శారద, కేపీ వస్తుంటారు. వాళ్లను అపూర్వ చూస్తుంది. అపూర్వ నుంచి తప్పించుకుని వెళ్లబోతున్న కేపీ.. గగన్ కంట్లో పడతాడు. దీంతో వెనక నుంచి అపూర్వ ముందు నుంచి గగన్, కేపీ వైపు వస్తుంటారు. కేపీ ఎటుపోవాలో అర్థం కాక సతమతమవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















