Meghasandesam Serial Today June 4th: ‘మేఘసందేశం’ సీరియల్: హల్దీ ఫంక్షన్ మొదలు పెట్టిన శరత్ చంద్ర – ఇంట్లోనే భూమితో రొమాన్స్ మొదలుపెట్టిన గగన్
Meghasandesam Today Episode: భూమిని తనతో బయటకు రావొద్దన్నారని గగన్ ఏకంగా శరత్ చంద్ర ఇంటికొచ్చి ఇంట్లోనే రొమాన్స్ మొదలు పెడతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: విడాకుల పేపర్స్ చూసుకుంటూ కూర్చున్న శారద దగ్గరకు భోజనం తీసుకుని వస్తాడు గగన్. పేపర్స్ పక్కన పెడుతుంది. గగన్ భోజనం కలిపి తనిపించబోతుంటే.. శారద భయంగా పేపర్స్‌ను చూస్తూ..నువ్వు భోజనం చేశావా నాన్నా అని అడుగుతుంది.
గగన్: ఈరోజు భూమితో కలిసి డిన్నర్‌కు వెళ్లాను అమ్మా.. ఈరోజు నాకు ఎంత హ్యపీగా అనిపించిందో తెలుసా..? అమ్మా భూమి వాళ్ల అమ్మా శోభా చంద్ర గారు చనిపోవడానికి పరోక్షంగా కారణం అయిన ఆవిడ శిష్యురాలు ఆ రెస్టారెంట్ కే డాన్స్ ప్రోగ్రాం ఇవ్వడానికి వచ్చింది అమ్మ.
అంటూ అక్కడ జరిగిన విషయాలు మొత్తం చెప్తూ.. శారదకు భోజనం తినిపిస్తాడు. భూమి చేసిన డాన్స్ మెచ్చుకంటూ భూమి నాకు దొరకడం చాలా హ్యాపీగా ఉంది అంటాడు.
గగన్: కాకపోతే ఒక్కటే అర్థం కాలేదమ్మా..? భూమి కన్నీళ్లు చూడలేకే ఆ శరత్ చంద్ర మా పెళ్లికి ఒప్పుకున్నాడా అని డౌటుగా ఉంది
అనగానే శారద డైవర్స్ పేపర్స్ మీద సాంబార్ పోస్తుంది. దీంతో పేపర్స్ గగన్ చూస్తాడు. ఏంటమ్మా ఆ పేపర్స్ అని అడుగుతాడు. అవి నీ పెళ్లిని రిజిష్టర్ చేయిద్దామని ఆఫీసు నుంచి తీసుకొచ్చిన పేపర్స్ అని చెప్తుంది. తర్వాత కేపీతో మీరా గొడవ పడుతుంది. నిశ్చితార్థం రోజు ఆవిడ పక్కన నిలబడ్డట్టు పెళ్లిలో కూడా నిలబడతావా..? అని అడుగుతుంది. దీంతో కేపీ నిలబడతానని చెప్తాడు. దీంతో మీరా ఏడుస్తూ అపూర్వ దగ్గరకు వెళ్తుంది.
అపూర్వ: పచ్చని పెళ్లింట్లో ఆ ఏడుపు ముఖం ఏంటి మీరా..? మీ అన్నయ్యే అడ్జస్ట్ అయి పెళ్లికి ఒప్పుకున్నారు కదా..? ఇష్టం ఉన్నా లేకున్నా నవ్వుతూ ఉండాలి మీరా.
మీరా: నా ఏడుపు పెళ్లి జరుగుతుంన్నందుకు కాదు వదిన. నాకు జరగబోయే అవమానాన్ని తలుచుకుని ఏడుస్తున్నాను.
అపూర్వ: విసిగించకుండా విషయం చెప్పు మీరా..? నీకు అవమానం జరుగుతుందని ఎందుకు అనుకున్నావు.
మీరా: అనుకోవడం కాదు వదిన మా ఆయనే అంటున్నారు. పెళ్లిలో కూడా ఆయన శారద పక్కనే నిలబడతారట. పెళ్లి పత్రికల్లో ఆ గగన్ గాడి తండ్రిగా ఈయన పేరు కొట్టిస్తారట. నేను ఎంత చెప్పినా నా మాట వినడం లేదు.
అపూర్వ: నువ్వు చెప్తే ఎందుకు వింటాడు మీరా. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. నేను మీ అన్నయ్య కేపీని అడ్డుకుంటాము.
మీరా: ఆ పని చేసి పుణ్యం కట్టుకో వదిన చచ్చి నీ కడుపున పుడతాను.
అంటూ మీరా ఏడుస్తూ వెళ్లిపోతుంది. తర్వాత శరత్ చంద్ర ఇంట్లో హల్దీ ఫంక్షన్‌కు మొదలవుతుంది. కొబ్బరికాయ కొట్టి ఫంక్షన్ స్టార్ట్ చేస్తాడు శరత్‌చంద్ర. అందరూ హడావిడిగా ఉంటారు. ఇంతలో గగన్ వస్తాడు. అపూర్వ, శరత్ చంద్ర షాకింగ్ గా చూస్తుంటారు. వాళ్లిద్దరూ భూమిని గగన్ పెళ్లి అయ్యే వరకు బయట తిరగొద్దు అన్న విషయం గగన్ గుర్తు చేసుకుంటూ శరత్ చంద్ర దగ్గరకు వెల్తాడు.
గగన్: మామయ్యా ఐలవ్యూ మామయ్యా.. ఐ లైక్ యూ మామయ్యా..
సుజాత: ఎందుకు బాబు అంత లవ్వులు.. లైకులు..
గగన్: భూమిని, నన్ను బయటకు వెళ్లొద్దని చెప్పారంట తెలుసా..?
సుజాత: ఆ తెలుసు బాబు..
గగన్: అంటే దాని అర్తం ఏంటి గోరింటాకు. కాబోయే కొత్త దంపతులు బయట తిరిగితే దిష్టి తగులుతుంది. లంకంత కొంప ఇంట్లోనే కలుసుకోండి అని దాని అర్తం
అని గగన్ చెప్తూ భూమిని తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోతాడు గగన్. శరత్, అపూర్వ ఇరిటేటింగ్ గా ఫీలవుతారు. నక్షత్ర కోపంగా చూస్తుంది. చెర్రి హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















