Meghasandesam Serial Today January 21st: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ ఇంట్లో డ్రగ్స్ - భూమిని అరెస్ట్ చేసిన పోలీసులు
Meghasandesam serial today episode January 21st: గగన్ ఇంట్లో డ్రగ్స్ దొరకగానే ఆ నేరం తన మీద వేసుకుని జైలుకు వెళ్తుంది భూమి. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: పూరి, శివల ఎంగేజ్‌మెంట్‌కు శరత్‌చంద్ర, అపూర్వ వాళ్లు వస్తారు. వాళ్లను చూసిన శారద కంగారుపడుతుంది. వెంటనే భూమి, గగన్ లను పిలుస్తుంది. భూమి లోపలి నుంచి వస్తుంది.
శారద: మీ నాన్న వాళ్లు వచ్చారమ్మా..?
భూమి: అత్తయ్యా ఆయన కూడా
ఇంతలో గగన్ వస్తాడు.
గగన్: అమ్మా చెప్పు..?
భూమి: ఏవండి మా నాన్న వాళ్లు వచ్చారు. రండి రిసీవ్ చేసుకుందాం.
గగన్: ఒక్క నిమిషం ఆగు నేను రానని అప్పుడే చెప్పాను. నువ్వు వెళ్లి రిసీవ్ చేసుకో.
భూమి: ఫ్లీజ్ అండి మనల్ని వాళ్ల ఇంటికి పిలిచినప్పుడు మనల్ని వాళ్లు రిసీవ్ చేసుకున్నారు కదండి. మనం వాళ్లని రిసీవ్ చేసుకోకపోతే బాగుండదు.
శారద: అది నిజమేరా.. వెళ్దాం రారా పద భూమి. రారా..?
భూమి: రండి ముందు..
బయట అందరూ కారు దిగి వస్తుంటారు.
భూమి: రండి నాన్న.. రండి..
శరత్చంద్ర: ఏం నువ్వే కానీ మీ ఆయన రమ్మనరా..?
గగన్: అదేం లేదు.. రండి..
శరత్‌చంద్ర: సరే వెళ్దాం పదండి..
అంటూ అందరూ లోపలికి వెళ్లిపోతారు.
శారద: కూర్చోండి కాఫీ తీసుకొస్తాను.
శరత్‌చంద్ర: అయ్యో అవన్నీ ఏమీ వద్దండి. ఆ తాంబూలాలు ఏవో ఇచ్చిపుచ్చుకుంటే మేము బయలుదేరుతాం..
పంతులు: ఇంకా దానికి టైం ఉందండి..
శారద: అతిథులుగా వచ్చినాక ఆతిథ్యం ఇవ్వకపోతే మీ గౌరవానికే బంగం. కాపీయే కదా రెండు నిమిషాల్లో తెస్తాను.
చెర్రి: అన్నయ్యా నా మహంకాళి సిస్టర్ ఎక్కుడుంది. అంటే నేను పూరి సిస్టర్‌కు పెట్టుకున్న నిక్‌నేమ్ అది
సుజాత: నిక్ నేమో పిక్ నేమో మొత్తానికి నువ్వు బంధాలు ఇక్కడ బలంగా కలిపినట్టు ఉన్నావు.
అపూర్వ: పిన్ని ఎక్కడేం మాట్లాడాలో తెలియదా నీకు. మనం ఇక్కడికి అతిథులుగా వచ్చాం. అలా కాకిలా పొడుస్తున్నట్టు మాటలేంటి..? అల్లుడు గారు ఏమీ అనుకోకండి..
గగన్: ఇట్స్ ఓకే అండి గోరింటాకు నోటి దురద గురించి నాక్కూడా తెలుసు.
సుజాత: అవును బాబు గోక్కోవడానికి రెండు బ్లేడులు కూడా కొనుక్కున్నాను. అయినా నా దురద తీరడం లేదు.
అపూర్వ: పిన్ని కాస్త ఆపుతావా..? చెప్పినా సరే నోటికి తాళం వేయవా..? అనవసరంగా తీసుకొచ్చాను నిన్ను..
గగన్: ఇట్స్ ఓకే లేండి.. అసలే పెద్దావిడ. ఈ మధ్యే పళ్లు కూడాకట్టించుకున్నట్టు ఉన్నారు. అవి ఉంటాయో ఊడిపోతాయో అన్న అనుమానంతో మాట్లాడుతున్నట్టు ఉన్నారు. మీరు మాట్లాడండి.
అపూర్వ: అల్లుడు గారికి సెన్సాఫ్ ఊమర్ ఎక్కువే..?
చెర్రి: అన్నయ్య ఇంతకీ మహంకాళి ఎక్కడుందో చెప్పనేలేదు..
గగన్: ఎక్కడ ఉంటుందిరా..? తన రూంలోనే ఉంది.
చెర్రి: సరే అయితే మీరు కాఫీ తాగుతూ ఉండండి. నేను మహంకాళితో మాట్లాడి వస్తాను.
అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత అందరూ కాఫీ తాగాక శరత్ చంద్ర తాంబూలాలు మార్చుకుందామా అని అడగ్గానే.. పంతులు ఇంకా అరగంట టైం ఉంది అని చెప్పగానే.. ఈలోపు ఇల్లు చూద్దురు రండి నాన్న అని భూమి తనతో తీసుకెళ్లి ఇల్లు చూపిస్తుంది. ఇంతలో అపూర్వ తనతో తీసుకొచ్చిన డ్రగ్స్ ప్యాకెట్స్ గగన్ రూంలో ఉన్న నెక్లెస్ బాక్స్‌లో పెట్టేస్తుంది. తర్వాత తాంబూలాలు మార్చుకుంటుంటే పోలీసులు వస్తారు. ఎందుకొచ్చారని గగన్ అడగ్గానే.. ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయని సమాచారం వచ్చింది అని చెప్పి ఇల్లంతా సర్చ్ చేస్తారు. డ్రగ్స్ దొరకగానే.. పోలీసులు గగన్‌ను అరెస్ట్ చేస్తుంటే.. భూమి ఆ నేరం తన మీద వేసుకుని పోలీసులతో పాటు స్టేషన్ కు వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















