Meghasandesam Serial Today January 15th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి ఐలవ్యూ చెప్పిన గగన్ - చేయి కోసుకున్న శివ
Meghasandesam serial today episode January 15th: భూమి గురించి కేపీ చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న గగన్ వెంటనే భూమిని పిలిచి ఐలవ్యూ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: శివ మరొక్కసారి దొంగచాటుగా బిందు కోసం శరత్ చంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ బిందు రూంలోకి వెళ్తాడు. అర్థరాత్రి ఇంటికి వచ్చిన శివను చూసిన బిందు భయపడుతుంది.
బిందు: శివ ఇంత అర్ధరాత్రి ఎందుకు వచ్చావు శివ. పగలు వచ్చినప్పుడే ఏం జరిగిందో చూశావు కదా..? ఇప్పుడు మనిద్దరిని ఎవరైనా చూస్తే మా అత్తయ్యా చంపేస్తుంది శివ.
శివ: చంపేస్తే చంపేయని బిందు. నీతో కలిసి బతకనప్పుడు నీకోసం చచ్చిపోయానన్న సంతృప్తి అయినా మిగులుతుంది.
బిందు: అయినా ఇప్పుడు ఈ మాటలు ఎందుకు..? నేను భయస్తురాలిని కదా..? భయపడేవారికి ప్రేమించే అర్హత ఉండదు. మరి నువ్వు మహా ధైర్యవంతుడివి కదా..? అందుకే నన్ను మాత్రమే కాకుండా ఆ పూర్ణిని కూడా ప్రేమిస్తున్నావు..?
శివ: ఏం మాట్లాడుతున్నావు బిందు.. నేను పూరిని ప్రేమించడం ఏంటి..? ఈ మాట నీకెవరు చెప్పారు..?
బిందు: ఎవరో చెబితే నేనెందుకు నమ్ముతాను. ఆ పూరియే చెప్పింది.
శివ: అంటే మనం కాలేజీలో మాట్లాడుకోవడం పూరి చూసిందా..?
బిందు: చూసింది..
శివ: అది అలా చెప్పు..పూరి కావాలనే అలా చెప్పింది. పూరికి ఉక్రోషం ఎక్కువ కదా..? వాళ్లింట్లో ఉంటున్న నేను నీతో మాట్లాడటం ఏంటి అన్న ఉక్రోషంతో చెప్పి ఉంటుంది. ప్రేమంటే ఇది కాకపోతే అది. అది కాకపోతే ఇది అని ఎంచుకునే ఆప్షన్ కాదు బిందు. ఒకేసారి తీసుకునే డిసీజన్. నేను కాలేజీలో అన్న మాటలకు నా మనసు చాలా విలవిలలాడిపోయింది. నీకు సారీ చెప్పుకుందామని వచ్చాను. ఐయామ్ సో సారీ బిందు ఇంకెప్పుడు నిన్న నిందచను.
బిందు: నిందించే అవకాశం కూడా రాదులే శివ. ఎందుకంటే ఈ ఇంటికి నువ్వు ఉంటున్న ఇంటికి ఎంత దూరం ఉందో నీకు తెలుసు. బద్ద శత్రుత్వానికి మా కుటుంబాలు ఉదాహరణ. అదీకాక నువ్వు భూమి తమ్ముడివి.. మన పెళ్లి జరగదు శివ.
శివ: ఏయ్ బిందు ఏం మాట్లాడుతున్నావు..?
బిందు: మనం కలిసి బతకడం అనేది ఒక కలగానో.. కాగితం మీద రాసుకున్న అక్షరం గానో మిగిలిపోవాల్సిందే..? చూడు శివ. మేము మా అపూర్వ అత్తయ్యా దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్న వాళ్లం. తను చెప్పిందే మేము వినాలి. తను గీసిన గీతలోనే బతకాలి. మా అత్తయ్య నాకు ఏదో ఒక సంబంధం తీసుకొస్తుంది. తల వంచుకుని తాళి కట్టించుకోక తప్పదు. నా మీద ఆశలు పెట్టుకోకు శివ. వెళ్లిపో.. ఇంకెప్పుడు రాకు..
శివ: అంతేనా బిందు..?
బిందు: అంతే శివ..
శివ: సరే బిందు వెళ్తాను. మన ఇద్దరికీ పెళ్లైయ్యే అవకాశం లేదని నువ్వు అంటున్నావు కదా..? అలాగే నేను మళ్లీ తిరిగి వచ్చే అవకాశం లేకుండా వెళ్లిపోతాను.
అంటూ పక్కనే ఉన్న కత్తి తీసుకుని తన చేతిని కోసుకుంటాడు. వెంటనే బిందు వెళ్లి కత్తి లాక్కుని పక్కకు పడేస్తుంది. ఏంటి పిచ్చి పని అంటూ తిడుతుంది. మరేం పర్వాలేదు బిందు అంటూ శివ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు బెడ్ రూంలో పడుకున్న గగన్ వెంటనే భూమిని పిలిచి ఐలవ్యూ చెప్తాడు. గగన్ చేష్టలకు భూమి ఆశ్చర్యపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















