Meghasandesam Serial Today January 12th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ గురించి నిజం చెప్పిన భూమి – ఓదార్చిన శారద
Meghasandesam serial today episode January 12th: గగన్ మీద నీకెందుకు అంత ప్రేమ అని అడిగితే భూమి నిజం చెప్పి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: బయట ఓపెన్ ప్లేస్ లో భూమి, శారద వెళ్తుంటే అటుగా వెళ్తున్న కేపీ చూసి వాళ్ల దగ్గరకు వెళ్తాడు. శారదను చూసి కేపీ ఎమోషనల్ అవుతాడు. శారద చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంటాడు.
కేపీ: నిన్ను దేవతలతో పోల్చడం తక్కువే అవుతుంది శారద.
శారద: అలా అనకండి ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు.. పుట్టింటి నుంచి వచ్చాక మీరే నా లోకం అయ్యారు. పెళ్లయ్యాక వేరే లోకం నాకు తెలియదు. తెలిసొచ్చిన రోజున నా కొడుకు గగన్ నాకు నా పూరికి సైనికుడై మమ్మల్ని కాపలా కాశాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అదంతా వాడి గొప్పదనమే అండి.. అంతా చేసి నాదేం లేదు.. అంతా మా అమ్మదే అనడం కూడా వాడి గొప్పదనమే అండి..
కేపీ: అవును అదంతా వాడి గొప్పదనమే.. కానీ పూరికి శివకు పెళ్లి అన్నావు. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు అన్నావు.. కానీ ఈ విషయం గగన్‌కు చెప్పారా.? ఈ పెళ్లికి వాడు ఒప్పుకుంటాడా..?
భూమి: అయ్యో మామయ్య బావ ఒప్పుకోకుండానే మిమ్మల్ని పిలిచి పూరి, శివల పెళ్లి అని చెప్పేంత ధైర్యం మాకు ఉందా..? మీ అమ్మాయి మా తమ్ముణ్ని ప్రేమిస్తుంది అని తెలిసిన మరుక్షణమే బావ టక్కున ఒప్పేసుకున్నాడు. మా తమ్ముణ్ని ఇంట్లోనే పెట్టుకుని జీవితాంతం చెల్లిని కళ్ల ముందే ఉంచుకోవచ్చు అన్నది ఆయన గారి స్వార్థం.
కేపీ: నా కొడుకు ప్రేమిస్తే.. వాడి ప్రేమలో ఓ జీవిత కాలం కూడా చాలా చిన్నదై పోతుంది. ఈ ప్రపంచంలో వాడి ప్రేమ దొరకని దురదృష్టవంతుణ్ని నేను ఒక్కడినే నా కూతురు పెళ్లికి నా అల్లుడి కాళ్లు కడగలేను. చివరికి నా కూతురు పెళ్లిని కనీసం దూరం నుంచి చూడగలగటమే గొప్ప.
భూమి: బాధపడకండి మామయ్య ఆయన మిమ్మల్ని కూడా అర్థం చేసుకునే రోజు ఒకటి వస్తుంది. ఆ నమ్మకం నాకుంది.
కేపీ:అంతేలేమ్మా..? ఆ నమ్మకం కూడా లేకపోతే జీవితం శూన్యం అయిపోతుంది.
శారద: అందరి విషయంలో గగన్ మనసు ఒక తల్లిగా మార్చగలుగుతున్నాను కానీ ఒక్క మీ విషయంలో మాత్రం మార్చలేకపోతున్నానండి.. నన్ను క్షమించండి.
కేపీ: శారద బాదపడకు.. నా తలరాత విషయంలో నువ్వేం చేస్తావు.. మీ ఇద్దరూ జాగ్రత్తగా వెళ్లండి భూమి ఒక్క నిమిషం.
భూమి: ఏంటి మామయ్యా…?
కేపీ: నీ విషయంలో వాడిలో ఏదైనా మర్పు వచ్చిందా అమ్మా..?
భూమి: వచ్చిందన్న ఊహ ప్రపంచంలోనే నేను ఊగిసలాడాలి మామయ్య. వస్తుంది అన్న విషయం కూడా సన్నగిల్లిపోతుంది. నా ప్రేమ నిజం అని నమ్మించడానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. బహుశా నా ప్రాణాలు ఆయన కాళ్ల దగ్గర వదిలేస్తే అప్పుడు నన్ను నమ్ముతారేమో..
అంటూ చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది భూమి. తర్వాత గగన్ భోజనం చేస్తుంటే పొలమారుతుంది. దీంతో భూమి చాలా కంగారు పడుతుంది. అది చూసి గగన్, కేపీ చెప్పిన విషయం గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతాడు. తర్వాత శారద, భూమిని పిలిచి నా కొడుకు గగన్ అంటే నీకెందుకు అంత ఇష్టం అని అడగ్గానే.. తనను చిన్నప్పుడు గగన్ కాపాడిన విషయం చెప్పి ఎమోషనల్ అవుతుంది భూమి. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















