అన్వేషించండి

Meghasandesam Serial Today February 18th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ ను ఓడిపోమ్మన్న భూమి – అపూర్వ ప్లాన్‌ సక్సెస్‌

Meghasandesam serial today episode February 18th: కర్రసాము పందెంలో శరత్‌ చంద్ర చేతిలో గగన్‌ను ఓడిపోమ్మని భూమి చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode: శరత్‌ చంద్రతో కర్రసాముకు రెడీ అయిన గగన్‌ దగ్గరకు భూమి వెళ్తుంది. ఎలాగైనా గగన్‌ను పందెం నుంచి విరమింపజేయాలని చూస్తుంది. గగన్‌ను కన్వీన్స్‌ చేయాలనుకుంటుంది. భూమి ఎంత చెప్పినా గగన్‌ కూడా వినడు.

గగన్‌: నేను ఆవేదనతో అడుగుతున్నాను భూమి.

భూమి: ఇదే ఆవేదన మా నాన్న కూడా పడుతున్నాడు బావ. ఈ సంవత్సరమే ఆయన ఈ పోటీలల్లో ఆఖరుగా పాల్గొంటాడట. విజయంతో తన ఈ పోటీ ప్రయాణాన్ని ముగించుకోవాలనుకున్నారట. కానీ నీకు ఎదురుపడి ఓడిపోతానని భయపడుతున్నారట. కన్నీరు కూడా పెట్టుకుని ఈ పోటీలో నీ మీద ఆయన గెలిస్తే.. నన్ను కూతురుగా అంగీకరిస్తానని కబురు పెట్టారు బావ. అంతే కాదు బావ. మన రెండు కుటుంబాలు ఒక్కటై పోవచ్చని చెప్పారు. కొన్ని క్షణాలు నీవి కాదనుకుంటే నీకు ఎదురు కాబోతున్న ఈ ఓటమి కాస్త కష్టమైన మర్చిపోగలిగితే మనం అందరం ఒక్కటైపోవచ్చు బావ. ఆ ఆశతోనే నేను నిన్ను ఓడిపోమ్మని అడుగుతున్నాను. ఇన్నాళ్లు శారద అత్తయ్యను అవమానికి గురి చేసిన వాళ్లు ఇప్పుడు అత్తయ్యకు వియ్యపురాలు హోదా ఇచ్చి గౌరవిస్తారు. ఆ కుటుంబం నుంచి ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడే మనకు ఇక నుంచి ప్రమోదమే తప్ప.. ఇక ప్రమాదం ఉండదని ఇప్పుడు నువ్వు ఓడిపోయే ఓటమి మనకు భరోసా ఇస్తుంది బావ. బావ ఫ్లీజ్‌ నాకోసం మన ఇంటి ఆనందం కోసం ఈ ఒక్కసారి మా నాన్న చేతిలో ఓడిపో బావ.

అంటూ భూమి గగన్‌ను కన్వీన్స్‌ చేస్తుంటే.. గగన్‌ మాత్రం ఏమీ పలకకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దూరం నుంచి అంతా చూస్తున్న అపూర్వ, సుజాత నవ్వుకుంటారు.

సుజాత: అమ్మాయి భూమి.. గగన్‌ను ఓడిపోమ్మని కోడిపుంజును దువ్వినట్టుగా బాగా దువ్వి దువ్వి గ్రౌండ్‌ లోకి పంపిస్తున్నట్టు ఉంది అమ్మాయి.

అపూర్వ: నాకు అలాగే అనిపిస్తుంది పిన్ని..

సుజాత: అవును అమ్మాయి. అల్లుడు గారి చేతిలో గగన్‌ గాడు ఓడిపోతాడు సరే మరి రెండు కుటుంబాలు కలుస్తాయి అని మాటిచ్చావు కదా మరి దాని సంగతి ఏంటి…? ఇప్పుడు మరి భూమి అడిగితే ఏం చెప్తావు అమ్మాయి.

అపూర్వ: నేను ఎక్కడ మాటిచ్చాను పిన్ని. అలా బావ మాట ఇచ్చాడని అబద్దం చెప్పా.. బావ మాట ఇవ్వలేదు కనక మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం బావకు లేదు. ఇక నేను అంటావా..? మాట ఇచ్చిన నిలబెట్టుకునే మనిషిని కాదు. ఇక చెప్పిన అబద్దాన్ని ఎలా నిలబెట్టుకుంటాను చెప్పు..

సుజాత: అబ్బాబ్బ అమ్మాయి నువ్వు మామూలు దానికి కాదు అమ్మాయి. కంచు కనకరత్నానివి. నిన్ను అంత తేలికగా ఎవ్వరూ అంచనా వేయలేరు.

అపూర్వ: ఇంకా ఇప్పుడేం చూశావు పిన్ని.. ఒకసారి ఈ గగన్‌ గాడిని బావ చేతిలో ఓడిపోతే గెలిచిన వారి మాట ఓడిన వాడు వినాలి కనక. బావతో చెప్పించి. వాణ్ని వాడి కుటుంబాన్ని ఈ ఊరు నుంచే వెలి వేయిస్తాను.

సుజాత: నువ్వు సూపర్‌ అమ్మాయి.

అనగానే ఇద్దరూ నవ్వుకుంటూ గుడిలోకి వెళ్తారు. అటూ కర్రసాము పోటీలు మొదలవుతాయి. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 13th: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
నువ్వులేక నేను లేను: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Embed widget