Meghasandesam Serial Today August 16th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ పనిమనిషిని కొనేసిన అపూర్వ – వీడియో కోసం అపూర్వ ప్లాన్
Meghasandesam serial today episode August 16th: గగన్ ఇంట్లోని బొమ్మలో ఉన్న వీడియో కెమెరాను ఎలాగైనా కొట్టేయాలని గగన్ ఇంట్లో పనిమనిషకి అపూర్వ చెప్తుంది.

Meghasandesam Serial Today Episode: గగన్ ను చంపాలని చూసిన అపూర్వను పక్కకు తీసుకెళ్లి నక్షత్ర తిడుతుంది. మమ్మీ.. మమ్మీ నువ్వు చేసిన పనేంటని నిలదీస్తుంది. దీంతో అపూర్వ అయోమయంగా చూస్తుంటుంది.
నక్షత్ర: ఒకప్పుడు యుద్ద ఖైదీలను పట్టుకుని వాళ్ల సమాధులు వాళ్లతోనే తవ్వించేవారట. ఇప్పుడు నువ్వు చేసిన పని కూడా అలాగే ఉంది. గగన్ బావ నాకు ప్రాణం అని నీకు తెలుసు. ఆ ప్రాణాన్ని తీయడానికి నన్నే పావుగా వాడుకుంటావా మమ్మీ.
అపూర్వ: ఫ్యాన్ మీద పడగానే ప్రాణాలు పోతాయా నక్షత్ర.
నక్షత్ర: నువ్వు కూర్చో మమ్మీ నేను ఆ ఫ్యాన్‌ను నీ తల మీద వేస్తాను. ప్రాణం పోతుదో లేదో చూద్దాం.
అపూర్వ: సరే నేను రెడీనే నువ్వు ట్రై చేద్దువు కానీ రా..?
నక్షత్ర: మమ్మీ పిచ్చిపిచ్చిగా మాట్లాడకు..
అపూర్వ: పిచ్చిపిచ్చిగా కాదే..? నేన ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నాను. నువ్వు ఫ్యాన్ నా మీద వేసిన తర్వాత నా ప్రాణం పోయినంత పనవుతుంది. అప్పుడు ఏం చేస్తావు. నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తావు. అప్పుడ నువ్వేం చేస్తావు.. అయ్యోయ్యో నా వల్లే మా మమ్మీకి ఈ పరిస్థితి వచ్చింది కదా అని ఏడుస్తావు. నన్ను క్షమించు మమ్మీ అంటూ పశ్చాతాపంతో బాధపడతాడవు. అవునా కాదా..?
నక్షత్ర: అవును మమ్మీ అయితే ఏంటి..?
అపూర్వ: అదేనే పిచ్చిదానా..? గగన్‌ను హాస్పిటల్ లో పడేయడమే నా ఉద్దేశం. అప్పుడు నువ్వు అయ్యో బావ నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని గగన్ చుట్టూ ఏడుస్తూ తిరుగుతావు. మనలో ఉన్న ప్రేమ ఆనందంలో ఉన్నప్పటి కంటే బాధలో ఉన్నప్పుడు మనం బాధపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడే బాగా అర్తం అవుతుందే..? అలా నీ ప్రేమ కూడా గగన్‌కు అర్థం అయ్యేలా చెప్పించడం కోసమే.. నేను ఇలా ప్లాన్ చేశానే..ముందే నీతో చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా..? అందుకే చెప్పలేదు.
అనగానే అంటే ఇదంతా నువ్వు నాకోసమే చేశావా మమ్మీ అని నక్షత్ర అడుగుతుంది. అవున నక్షత్ర నువ్వు గగన్ మనసు గెలుచుకోవడానికే చేశాను అని చెప్తుంది అపూర్వ. దీంతో నక్షత్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత గగన్ వాళ్ల ఇంట్లో పని చేసే మనిషిని రహస్యంగా కలుస్తుంది అపూర్వ. పని మనిషి అపూర్వ దగ్గరకు వస్తుంది.
పనిమనిషి: చెప్పండమ్మా ఎందుకు పిలిపించారు.
అపూర్వ: నేను శోభాచంద్రను చంపేస్తున్నప్పుడు అనుకోకుండా వీడియో ఒక కెమెరాలో రికార్డు అయింది.
పని మనిషి: ముందు ఆ వీడియో ఉన్న కెమెరా ఎక్కడ ఉందమ్మా..?
అపూర్వ: ఆ కెమెరా ఒక బొమ్మలో ఉంది. నా అదృష్టం కొద్ది ఆ వీడియో ఉన్న కెమెరా బొమ్మలో ఉందని ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఇదిగో బొమ్మ
అంటూ తన ఫోన్‌లో ఉన్న బొమ్మ ఫోటో చూపిస్తుంది అపూర్వ. ఎలాగైనా గగన్ ఇంట్లో ఉన్న ఈ బొమ్మలోని కెమెరా తీసుకొచ్చి నాకివ్వాలి అని చెప్తుంది అపూర్వ. పని మనిషి భయపడుతుంది. దీంతో డబ్బు ఆశ చూపిస్తుంది అపూర్వ. సరే అంటుంది పని మనిషి. మరోవైపు ఇంట్లో శుభ్రం చేస్తున్న పూర్ని బొమ్మను చూస్తుంది. అది ఓపెన్ చేయబోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















