అన్వేషించండి

Maavaaru Mastaru July 15th: పోలీస్ స్టేషన్ లో గణపతి- ప్రాణాపాయ స్థితిలో పార్వతమ్మ, విద్య ఏం చేయబోతోంది?

గణపతి, విద్య పెళ్లి చెడగొట్టేందుకు పద్మ ట్రై చేస్తుండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

గణపతితో పెళ్లి కుదిరిన ఆనందంలో ఉంటుంది విద్య. గణపతి, విద్య ఫోన్​లో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. గణపతి స్కూల్లో పాఠాలు చెబుతుంటే చాటుగా చూడటం, పిల్లల్ని అతని గురించి అడిగి తెలుసుకోవడం తన కోరికని చెబుతుంది విద్య. అది విని షాకవుతాడు గణపతి. అలాంటి పనులు మాత్రం చేయకని కోరతాడు. విద్య ఆనందంగా ఉండటం చూసి కోపంతో రగిలిపోతుంది శ్రీనిధి. విద్య వల్లే తన జీవితం నాశనమవుతుందని, ఎలాగైన విద్య పెళ్లి ఆపాలని అనుకుంటుంది. అదే విషయాన్ని వదిన పద్మతో చెబుతుంది. పద్మ వెంటనే విద్య దగ్గరకు వెళ్లి పెళ్లి ఇంకా ఖాయం కాలేదని, అప్పుడే అలా ఫోన్లలో మాట్లాడటం అంత మంచిది కాదని హెచ్చరిస్తుంది. ఇంతలో మురళి పిలవడంతో విద్య కిందకు వెళుతుంది.

Also Read: దొంగని పట్టుకొచ్చిన లాస్య, పిచ్చోడిలా నమ్మేసిన విక్రమ్ - నందు, తులసికి మళ్ళీ పెళ్ళా?

గణపతి ఇంట్లో జరిగిన అవమానానికి బాధపడుతూ ఇంటికి చేరుకుంటాడు ఆదినారాయణ. గణపతి ఇంట్లో విద్య సంతోషంగా ఉంటుందనే నమ్మకం కలగడం లేదని వాపోతాడు. పార్వతమ్మ, గణపతి వ్యక్తిగతంగా మంచివారే అయినా మిగతా కుటుంబ సభ్యులు మాత్రం అంత మంచివారిగా కనపడట్లేదని, వాళ్ల మధ్యన తన కూతురు సంతోషంగా ఉంటుందని అనిపించట్లేదని బాధపడతాడు ఆదినారాయణ. ఆ ఇంట్లో మనుషులంతా చాలా దారుణంగా మాట్లాడుతున్నారని కోపంతో ఊగిపోతాడు మురళి. పదే పదే తనకోసం తండ్రి అవమానాల పాలు కావడంతో బాధపడుతుంది విద్య.  కానీ ఆ ఇంట్లో మనుషులను సరైన దార్లో పెట్టే బాధ్యత ఆ ఇంటి కోడలిగా తనదేనని తండ్రికి నచ్చజెబుతుంది. ఇంతలో పద్మ కలగజేసుకుని, మావయ్య అంతలా చెబుతున్నా మొండిగా ఆ గణపతినే పెళ్లి చేసుకుంటాననడం అంత మంచిది కాదని, వేరే సంబంధం చూసుకోవచ్చు కదా అని అంటుంది. తన పెళ్లి విద్య నిర్ణయం ప్రకారమే జరుగుతుందని తేల్చి చెబుతాడు ఆదినారాయణ.

విద్య గుడికి వెళ్తుంది. గణపతి, పార్వతి కూడా అనుకోకుండా అదే సమయానికి గుడికి చేరుకుంటారు. తమ కోరిక నెరవేరబోతున్నందుకు దేవుడికి దండం పెట్టుకుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటారు. అయితే గణపతి తనకి స్కూల్లో పనుందని వెళ్లిపోదామని అంటాడు. పార్వతిని తాను ఆటోలో దింపుతానని చెబుతుంది విద్య. సరేనని వెళ్లిపోతాడు గణపతి.

Also Read: స్వప్నకి యాడ్ షూట్ ఆఫర్- డిజైన్స్ వేస్తుంది కళావతేనని తెలుసుకున్న రాజ్, కావ్యకి కొత్త కష్టాలు?

హాల్లోకి వచ్చిన పద్మకు వార్తల్లో గణపతి మాస్టారును అరెస్ట్​ చేశారని చెప్పడం గమనిస్తుంది. వెంటనే శ్రీనిధిని పిలిచి ఆ సంతోషాన్ని పంచుకుంటుంది. గణపతి పనిచేసే స్కూల్​ పేరు చెప్పడంతో ఆ గణపతి మాస్టారంటే కచ్చితంగా విద్య ఇష్టపడుతున్న వ్యక్తే అని సంబరపడిపోతారు ఇద్దరు. విద్య పెళ్లి ఆగిపోతే తాను విఘ్నేష్​ని పెళ్లి చేసుకునే అవసరం ఉండదని, అక్కకోసం త్యాగం చేసినట్లు విఘ్నేష్ను విద్యను పెళ్లి చేసుకోమని చెప్పి, తాను తప్పించుకుంటానని అంటుంది నిధి. అంతలోనే పద్మ విద్యకు ఫోన్​ చేసి గణపతిని పోలీసులు అరెస్ట్​ చేశారని చెబుతుంది. అది విన్న పార్వతి, విద్య షాకవుతారు. పార్వతి కళ్లు తిరిగి పడిపోతుంది. విద్య వెంటనే పార్వతిని హాస్పిటల్​లో జాయిన్​ చేసి చికిత్సకోసం తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తన గాజుల్ని ఇస్తుంది. కాగా, గణపతి పనిచేస్తున్న స్కూల్లో అదే పేరుతో ఉన్న మాస్టారు అరెస్టవుతాడు. ఆ మాస్టారు ఆడపిల్లలతో దురుసుగా ప్రవర్తించినట్లు స్వయంగా గణపతి ఆధారాలు పోలీసులకు ఇస్తాడు. 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Embed widget