Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మీ నివాసం' సీరియల్: తులసి పెళ్లిలో విషాదం - శ్రీ కారుకు ప్రమాదం.. అసలు వారికి ఏమైంది..?
Lakshmi Nivasam Today Episode: తులసి పెళ్లి హడావుడి సాగుతుండగా.. శ్రీ కారులో పెళ్లి వేదిక వద్దకు బయలుదేరుతారు. ఇదే సమయంలో సిద్ధు సైతం నామినేషన్ కోసం వెళ్తుంటాడు. అసలు ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Lakshmi Nivasam Serial Today Episode Review: 'లక్ష్మీ నివాసం'లో తులసి పెళ్లి హడావుడి కొనసాగుతుండగా.. శ్రీని వసుంధర వరుడిగా రెడీ చేస్తుంది. అక్కడ తులసిని జానూ పెళ్లికూతురిలా ముస్తాబు చేస్తుంది. శ్రీ ఫ్యామిలీ అంతా కలిసి పెళ్లి వేదిక వద్దకు వెళ్లేందుకు రెడీ అవుతుండగా భారీ వర్షం కురుస్తుంది. శ్రీని చంపేందుకు ప్లాన్ చేసిన భార్గవ్.. 'ప్రకృతి కూడా నీ చావుకు సహకరిస్తుంది' అంటూ మనసులో అనుకుంటాడు. తాను, సుపర్ణిక గిఫ్ట్ కొనాలంటూ వేరే కారులో వస్తామని భార్గవ్ చెప్తాడు. దీంతో శ్రీ, వసు, ఖుషి ఒక కారులో వెళ్తుండగా.. వెనుక కారులో వెళ్లేందుకు సుపర్ణిక, భార్గవ్ సిద్ధమవుతారు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
తులసికి.. శ్రీ సర్‌ప్రైజ్ ఏంటో..?
పెళ్లి వేదిక వద్ద శ్రీనివాస్ అందరినీ సంతోషంగా రిసీవ్ చేసుకుంటాడు. పెళ్లి ఆర్భాటంగా చేయాల్సిందని శ్రీనివాస్ కొలీగ్స్ అంటారు. ఇంతలో తులసిని పెళ్లికూతురిలా శ్రీకి చూపిస్తానని.. వీడియో కాల్ చేస్తానంటూ జాను అంటుంది. అందుకు తులసి మొహమాట పడుతుండగా.. ఎక్కడకు వచ్చారో తెలుసుకోమని జాను అంటుంది. దీంతో తులసి.. శ్రీకి కాల్ చేస్తుంది. తాను కూడా కాల్ చేయాలని అనుకున్నట్లు తులసికి చెప్తాడు శ్రీ. ఎందుకు అని అడగ్గా.. అది సర్‌ప్రైజ్ అని ఫోన్‌లో చెప్పేది కాదంటూ శ్రీ చెప్తాడు. దీంతో తులసి సిగ్గుతో ఫోన్ పెట్టేస్తుంది. ఇది విన్న జాను తులసిని ఆట పట్టిస్తుంది.
సడన్‌గా సిద్ధు, బసవ ఎంట్రీ
మరోవైపు.. తన తండ్రి బసవతో సిద్ధు కారులో కార్పోరేటర్ ఎన్నికల కోసం నామినేషన్ వేసేందుకు వెళ్తుంటాడు. ఎమ్మెల్యే మునుస్వామి మోసం చేస్తున్నాడని.. కమీషన్ల ఆశ చూపి అభ్యర్థులను కొనేయాలని చూస్తున్నాడని.. అదే జరిగితే మేయర్ పదవి వాళ్లకే పోతుందని బసవ పీఏ చెప్తాడు. అదే జరిగితే వాడి చావును వాడే కొని తెచ్చుకుంటున్నాడని సిద్ధు కోపంగా అంటాడు. త్వరగా వెళ్లాలని కారు స్పీడుగా డ్రైవ్ చేయాలని బసవ సిద్ధుకి చెప్తాడు.
అటు, పెళ్లి పనుల్లో హెల్ప్ చేస్తున్న విశ్వను చూసి శ్రీనివాస్ ఆనందిస్తాడు. కాబోయే మామ దగ్గర మంచి మార్క్స్ కొట్టేస్తున్నావంటూ విశ్వను అతని ఫ్రెండ్స్ ఆట పట్టిస్తుంటారు. ఈ మ్యారేజ్ అయ్యే లోపు జానుకు ప్రపోజ్ చేస్తానని విశ్వ అంటాడు. వసుంధర.. తులసి కోసం పంపిన నగలను ఆమెకు అలంకరిస్తారు. ఈ సందర్భంగా లక్ష్మీ కన్నీళ్లు పెట్టుకోగా.. తులసి సద్దిచెబుతుంది. ఇంతలో జాను తులసిని ఆట పట్టిస్తుంది.
భార్గవ్ ప్లాన్ ఏంటో..?
శ్రీని చంపేందుకు ప్లాన్ వేసిన భార్గవ్.. సుపర్ణికతో కలిసి వేరే కారులో పెళ్లి వేదిక వద్దకు వస్తుంటాడు. కోపంతో సుపర్ణిక రగిలిపోతుంటుంది. అంత కోపం అవసరం లేదని.. ఈలోపే పెళ్లి ఆగిపోవచ్చని అంటాడు భార్గవ్.
శ్రీ కారుకు ప్రమాదం..
మరోవైపు.. సిద్ధును త్వరగా కారు నడపాలని బసవ చెప్తాడు. ఇదే సమయంలో భార్గవ్ ప్లాన్ ప్రకారం ఓ లారీ శ్రీ కారును ఢీకొడుతుంది. ఇదే టైంలో నామినేషన్ వేసేందుకు వెళ్తోన్న సిద్ధు కారు సైతం వీరు కారును ఢీకొట్టి శ్రీ ప్రమాదానికి గురవుతుంది. శ్రీ, వసుంధర, ఖుషీ అందరికీ గాయాలవుతాయి. ఇది చూసి వెనుకనే మరో కారులో వస్తోన్న సుపర్ణిక షాకై ఏడుస్తూ.. భార్గవ్‌ను అంబులెన్సుకు కాల్ చేయమని చెప్తుంది. వెంటనే అంబులెన్సులో వారిని ఆస్పత్రికి తీసుకెళ్తారు.
మరోవైపు, వారిని మనం కారుతో గుద్దేశామని.. ఏమైందో చూద్దామని సిద్ధు ఆందోళనగా బసవతో చెప్తాడు. అప్పుడు బసవ వారికి ఏం కాలేదని.. నామినేషన్ వేసేందుకు టైం అవుతుందని అతన్ని అడ్డుకుంటాడు.
శ్రీ వాళ్లు సేఫేనా..
ఓ వైపు తులసి పెళ్లిలో గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలో వరుడు శ్రీకి ప్రమాదం జరుగుతుంది. అసలు, శ్రీ, వసుంధర, ఖుషీ సేఫ్‌గానే ఉన్నారా..?, సిద్ధు ఆ తర్వాత ఏం చేశాడు..? తులసి పరిస్థితి ఏంటి.? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.






















