Lakshimi Raave Maa Intiki Serial Today January 5th:ప్రాణాలకు తెగించి శ్రీలక్ష్మీ మ్యాడీని ఎలా కాపాడింది..? గోపికి లక్ష్మీ నిజం చెప్పిందా లేదా..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 5th: పాముకాటుకు పసర మందు ఇచ్చి శ్రీలక్ష్మీ మ్యాడీని కాపాడుతుంది. అదే సమయంలో విషప్రభావంతో ఆమె కళ్లు తిరిగి కిందపడిపోతుంది.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: మ్యాడీని ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలుసుకుని సూర్యనారాయ కుటుంబం మొత్తం అక్కడికి వస్తుంది. మ్యాడీకి ఎలా ఉందని అడగ్గా...చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెబుతారు. పాము కాటుకు కావాల్సిన మందులు ఇక్కడ లేకపోవడంతో శ్రీకాకుళం నుంచి తెప్పిస్తున్నామని చెబుతారు. వెంటనే మ్యాడీని తీసుకుని శ్రీకాకుళం వెళ్తామని ప్రియంవద అంటుంది. ఆల్రెడీ అక్కడి నుంచి మెడిసిన్ తీసుకుని బయలుదేరారని...ఒక అరగంటలో వచ్చేస్తారని డాక్టర్లు చెబుతారు. శుభమా అని పెళ్లిపెట్టుకుంటే ఇలా జరిగిందని మ్యాడీ వాళ్ల బాధపడుతుంటే...ఇది అశుభమని ప్రియం వద అంటుంది. ఆమాటలకు సూర్యనారాయణకు కోపం వస్తుంది. రేపు పెళ్లి పెట్టుకుని మ్యాడీకి ఇలా జరిగితే అశుభం గాక ఇంకేంటని అంటుంది. నేను మొదటి నుంచి ఈ పెళ్లి వద్దని చెబుతున్నా ఎవరూ నా మాట వినలేదని ప్రియంవద అంటుంది. హైమావతి కూడా ఆమెకు వత్తాసు పలుకుతుంది. పెళ్లికి ముందే ఇలా జరిగిందంటే...మున్ముందు ఇంకా ఏం జరుగుతుందోనని భయం వేస్తోందని అంటుంది. ఈ పెళ్లి ఆపేయమని ఆ దేవుడే మనకు ఇచ్చిన సంకేతమని ప్రియంవద అంటుంది.ఈ పెళ్లి లేకపోయి ఉంటే మనం అసలు ఈ ఊరు వచ్చేవాళ్లమే కాదని అంటుంది.ఆ మాటలకు సూర్యనారాయణ కోప్పడతాడు. నోటికి ఎంతమాట వస్తే అంత మాట అంటారా అని మండిపడతాడు. చీకటిలో ఆ అమ్మాయికి తోడుగా పంపించడం వల్లేకదా ఇలా జరిగిందని అంటారు. అసలు ఆ అమ్మాయి లేకుంటే ఈ పాటికి మ్యాడీ చనిపోయేవాడని సూర్యనారాయణ అంటాడు.ఆ అమ్మాయి ప్రాణాలకు తెగించి పాము కరిచిన చోటనుంచి విషం నోటితో బయటకు లాగిందని చెబుతాడు.
ఇంతలో శ్రీలక్ష్మీ వెళ్లి పాముకాటుకు అవసరమై పసర మందు తీసుకొస్తుంది. అది మ్యాడీకి ఇవ్వడానికి వెళ్తుండగా...ప్రియంవద అడ్డుకుటుంది. పిచ్చిపిచ్చి ఆకుల మందులు తీసుకొచ్చి వాడిని చంపాలని చూస్తున్నావా అని మండిపడుతుంది. ఈ ఆకులవల్ల విషప్రభావం తగ్గుతుందని అంటుంది. డాక్టర్లు కూడా వద్దని చెబుతారు. అయినా గానీ లక్ష్మీ మా ఊరిలో ఎంతోమందిని ఈ పసర వల్ల కాపాడామని చెబుతుంది. ఇంతలో సూర్యనారాయణ కల్పించుకుని ఈ పసర వల్ల ప్రయోజనం కలగకోపయినా...ప్రమాదం అయితే లేదు కాబట్టి ఇది కూడా ట్రై చేద్దామని అంటాడు.శ్రీకాకుళం నుంచి మెడిసిన్ వచ్చే వరకు చూద్దామని చెబుతాడు. దీంతో డాక్టర్ ఆమెను తీసుకుని మ్యాడీ వద్దకు తీసుకెళ్తాడు. అప్పుడు లక్ష్మీ ఆ పసర మందును పాము కాటువేసిన చోట పెడుతుంది. కాసేపటికి మ్యాడీకి మెలుకువ వస్తుంది.కళ్లు తెరిచి అందరినీ చూస్తాడు. దీంతో సూర్యనారాయణ అందరిపైనా కోప్పడతాడు. శ్రీలక్ష్మీ తెచ్చిన ఆకులు పిచ్చి ఆకులని ఎగతాళి చేశారు కదా...ఇప్పుడు అవే ఆకులు మ్యాడీ ప్రాణాలు కాపాడాయని అంటాడు. సూర్యనారాయణ శ్రీలక్ష్మీని మెచ్చుకుంటాడు.ఇంతలో అక్కడికి గోపి రాగానే...సింధూ విషయం గోపికి చెప్పాలని లక్ష్మీ అతన్ని పక్కుకు తీసుకెళ్తుంది. వదినకు ఈ పెళ్లి ఇష్టంలేదని చెప్పబోతూ కళ్లుతిరిగి కిందపడిపోతుంది.
మ్యాడీ కాలి నుంచి విషం నోటిద్వారా పీల్చడం ద్వారా ఆ ప్రభావం ఆమెపైపడుతుంది. నోటి నుంచి నురగ కూడా వస్తుండటంతో అందరూ కంగారుపడతారు.వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పిస్తారు. మ్యాడీ తనను కాపాడినట్లే శ్రీలక్ష్మీని కాపాడండని అంటాడు. ఆమె ఏ మొక్కల నుంచి మందు తీసుకొచ్చిందో ఎవరికీ తెలియదని సూర్యనారాయణ అంటాడు. ఇంతలో శ్రీకాకుళం నుంచి మెడిసిన్ రావడంతో డాక్టర్ ఆమెకు ఇంజెక్షన్ ఇస్తాడు. పొద్దునకల్లా అంతా నార్మల్‌గా ఉంటుందని...ఎలాంటి భయం వద్దని చెబుతాడు. దీంతో లక్ష్మీని ఇంటికి తీసుకెళ్తారు. తెల్లారి నూకాలు లక్ష్మీని అరుస్తుంది. అర్థరాత్రులు వరకు ఊరిమీదపడి తిరగొద్దంటే ఎందుకు వెళ్లావని అంటుంది. ఇంతలో సూర్యనారాయణ మ్యాడీతో కలిసి లక్ష్మీని పరామర్శించేందుకు వాళ్ల ఇంటికి వస్తాడు. మ్యాడీని కాపాడినందుకు కృతజ్ఞతలు చెబుతాడు. ఇంతలో అక్కడికి లక్ష్మీని పెళ్లిచేసుకోబే పెళ్లికొడుకు రావడం చూసి మ్యాడీకి నవ్వు ఆగదు..




















