అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today February 2nd: అత్తింటిలో ఇబ్బందులు పడుతున్న సింధూ..కొత్త ఇంట్లో చకచకా పనులు చేస్తూ అందరి మన్ననలు పొందిన శ్రీలక్ష్మీ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 2nd: అత్తింటిలో ఇబ్బందులు పడుతున్న సింధూ..కొత్త ఇంట్లో చకచకా పనులు చేస్తూ అందరి మన్ననలు పొందిన శ్రీలక్ష్మీ

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: మ్యాడీ చాలా మొండివాడని...వాడిని మార్చుకోవాల్సింది నువ్వేనంటూ సూర్యానారాయణ దంపతులు శ్రీలక్ష్మీకి చెబుతారు. మేం ఇప్పుడు  ఏం చెప్పినా వాడికి చాధస్తంగా ఉంటుందని...నువ్వు ఈ కాలం అమ్మాయివే కాబట్టి వాడికి అర్థమయ్యేలా నీవాడిగా మార్చుకోమని చెబుతారు. మ్యాడీ గురించి మీరు మర్చిపోండని....అతన్ని మీఅందురూ మెచ్చుకునేలా తీర్చిదిద్దుతానని శ్రీవల్లివారికి హామీ ఇస్తుంది. అటు గోపీ వాళ్లఇంట్లో వంటలు తినలేక సింధూ అవస్థలుపడుతుంది. దీంతో గోపి ఆమెకు ఏదైనా తినడానికి తీసుకురానా అని అంటాడు. అవసరం లేదని...6 నెలల్లు ఎదోవిధంగా అడ్జెస్ట్‌ అవుతానని అంటుంది.

మీరు ఇలా రోజూ ఏం తినకుండా ఉంటే ఎలా అని గోపి బాధపడతాడు.మీరు ఇలాంటి నాటకాలు కట్టిపెట్టి 6నెలల్లో నన్ను పంపించాలని సింధూ హెచ్చరిస్తుంది.చాప, దిండు తీసుకుని బయట పడుకునేందుకు వెళ్తున్న గోపినివాళ్ల అమ్మ అడ్డుకుని ఇవి ఎందుకురా అని నిలదీస్తుంది. నేనే అక్కడ అడ్డుగా ఉన్నాయని అంటే పక్కన పెడుతున్నాడని సింధూ చెబుతుంది.మీ ఆవిడకు మనం చేసినవి ఏం నచ్చడం లేదని...అందుకే తనకు నచ్చినవి చేసుకోమని చెబుతుంది. నాకు వంట రాదని...మా ఇంట్లో అసలు ఎప్పుడూ వంట చేయలేదని సింధూ చెబుతుంది. మీ ఇంట్లో ఉన్నట్లు ఇక్కడ  ఉంటానంటే కుదరదని..నీకు రాకపోతే ఫోన్‌లో చూసి నేర్చుకోమని వాళ్ల అత్తయ్య సలహా ఇస్తుంది.  ఇవన్నీ నువ్వు దగ్గర ఉండి మీ  ఆవిడకు నేర్పించమని కొడుక్కిచెబుతుంది. నువ్వు ఏం చేసినా చేయకపోయినా....పొద్దున్నే నేను లేచసరికి ఇళ్లంత ఊడ్చి తూడవాలని,ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేయాలని లేకుంటే చాలా గొడవలు అయిపోతాయని చెప్పి వెళ్లిపోతుంది. గోపీ ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదని...రేపు మా వాళ్లకు అర్థమయ్యాలే నేను చెబుతానని మీరు ప్రశాంతంగా పడుకోండని చెప్పి తాను మాత్రం నేలపై పడుకుంటాడు.
                    అటు శ్రీలక్ష్మీ ఇంట్లో  అందిరి కన్నా ముందే నిద్రలేచి ఇంటిపనులన్నీ చక్కబెడుతుంది. తెల్లవారుజామునే స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసి తులసిచెట్టుకు పూజచేస్తుండగా...సూర్యనారాయణ వచ్చి ఇంత త్వరగా ఎందుకు లేచావమ్మా అని అడుగుతాడు. మా ఇంట్లో కూడా నేను రోజూ ఇదే టైంకు లేచి అన్ని పనులు చేస్తానని చెప్పడంతో ఆయన సంతోషపడతాడు. ఇంట్లో ఉన్న అందరికి  ఏంఏం కావాలో అవన్నీ చేసి పెడుతుంది శ్రీలక్ష్మీ..ఇంట్లో వంటపని కూడా తానే చేస్తానని ఎవరూ రావొద్దని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతుంది.

అటు తెల్లవారుజామునే గోపి నిద్రలేచి వాళ్ల ఆవిడ చీర తలపై వేసుకుని ఇంటి ముందు కళ్లాపి చల్లుతుంటే వాళ్ల అమ్మ, చెల్లి వచ్చి చూస్తారు. తమ కోడలే పనులన్నీ చేస్తుందని లోపలికి వెళ్లిపోతారు. కొంగు కప్పుకుని ముగ్గులు వేస్తున్న గోపి దగ్గరకు వచ్చి సింధూ నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తున్నావని నిలదీస్తుంది.మీకోసమే ఇలా చేశానని....మా అమ్మ రాత్రి వార్నింగ్  ఇచ్చింది కదా అందుకే మిమ్మల్ని నిద్రలేపకుండా ఈ పనులన్నీ చేశానని చెబుతాడు. స్నానానికి వేడినీళ్లు పెట్టానని వెళ్లి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టమని చెబుతాడు.
                         శ్రీలక్ష్మీ ఇంట్లో పనులన్నీ చేసి సూర్యనారాయణకు టీ పెట్టిద్దామని వంటగదిలోకి వెళ్తుంది. పాలు ఎక్కడని ఇందిరను అడగ్గా...సెక్యూరిటీ బాయ్‌ను అడగమని చెబుతారు. అతని వద్దకు వెళ్లి అడగ్గా....ఇవాళ పాలు రాలేదని,పెద్దయ్యగారు  ఊరి నుంచి ఎప్పుడు వస్తారో తెలియక నేను పాలవాడికి రమ్మని చెప్పలేదని అంటాడు. అయ్యగారు పాలప్యాకెట్లు పాలు తాగరని...స్వచ్చమైన ఆవుపాలు మాత్రమే వాడతారని చెబుతాడు. దీంతో పక్కింటిలో వాళ్లను పాలు అడుగుదామని శ్రీలక్ష్మీ వాళ్ల ఇంటికి వెళ్తుంది. వాళ్లను  పాలు అడుగుతుంది.

నీవు ఎవరమ్మా అంటే పక్కింటికి వచ్చామని చెబుతుంది. వాళ్లు ఆమె వాలకం చూసి పని అమ్మాయి అనుకుంటారు. మా ఇంట్లోపని అమ్మాయి రాలేదని...కొంచెం గిన్నెలు కడిగి పెట్టమని అంటే సరేనని గిన్నెలన్నీ కడిగేస్తుంది. వాళ్లు ఇచ్చిన పాలు తీసుకుని వెళ్తుంది. పని అమ్మాయి డబ్బులు తీసుకోకుండా వెళ్లిందని డబ్బులు తీసుకుని పక్కింటి ఆవిడ సూర్యనారాయణ ఇంటికి బయలుదేరుతుంది.అటు శ్రీలక్ష్మీ ఇంట్లో అందరికీ కమ్మని టీ పెట్టి ఇస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget