Lakshimi Raave Maa Intiki Serial Today February 12th: మ్యాడీ, శ్రీలక్ష్మీ రిసెప్షన్ జరిగిందా లేదా..? శ్రీలక్ష్మీపై ప్రియంవద ఎందుకు చేయి చేసుకుంది..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 12 th: మ్యాడీ, శ్రీలక్ష్మీ రిసెప్షన్ జరిగిందా లేదా..? శ్రీలక్ష్మీపై ప్రియంవద ఎందుకు చేయి చేసుకుంది..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: పబ్‌లోతాగి గొడవచేస్తున్న మ్యాడీని కొట్టి బుద్ధిచెబుతాడు సూర్యనారాయణ.నీకు ఈ చెడు అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చాయని మండిపడతాడు. ఇంతలో శ్రీలక్ష్మీ వచ్చి వారించి మ్యాడీని ఇంటికి తీసుకెళ్దామని అంటుంది. వీడు ఇంతలా తాగేసి ఉన్నాడని....వీడిని తీసుకుని మనం ఎలా రిసెప్షన్‌కు వెళ్లగలమని అంటాడు. అంతలో శ్రీలక్ష్మీ వెళ్లి నిమ్మకాయలు తీసుకుని వచ్చి మ్యాడీ నోట్లో పిండి మత్తు వదిలేలా చేస్తుంది. అక్కడి నుంచి అతన్ని తీసుకుని ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. అప్పుడే ప్రియంవద నూకాలు మెడపట్టి బయటకు నెట్టడానికి వస్తుంది.వాళ్ల నాన్న కారుచూసి ఆగిపోతుంది.ఇందిర నూకాలను బ్రతిమిలాడి ఇక్కడ జరిగింది పెద్దాయనకు చెప్పొద్దని వేడుకుంటుంది. దీంతో ఆమె సరేనని అంటుంది. సూర్యానారాయణ, శ్రీలక్ష్మీ ముందుగా ఇంట్లోకి రావడంతో మ్యాడీ వీళ్లకు దొరికి ఉండడు లే అనుకుని ప్రియంవద హ్యాపీగా ఫీలవుతుంది. కానీ సూర్యనారాయణ పిలవగానే మ్యాడీ కారులో నుంచి కిందకు దిగి వస్తాడు. మ్యాడీని చూసి ప్రియంవదతోపాటు మ్యాడీ తమ్ముడు, చెల్లి కూడా ఆశ్చర్యపోతారు.
సూర్యనారాయణ ఆదేశించడంతో మ్యాడీ రిసెప్షన్ మండపంలోకి వస్తాడు. శ్రీలక్ష్మీ కూడా అక్కడికి వెళ్తుంది. వాళ్లిద్దరికీ పూలదండాలు ఇచ్చి మార్చుకోమని చెబుతాడు. శ్రీలక్ష్మీ మా మనవుడు భార్య అని...ఈ ఇంటికి కోడలని వచ్చిన బంధువులందరికీ సూర్యనారాయ పరిచయం చేస్తాడు. అలాగే వాళ్లతల్లిదండ్రులను కూడా పరిచయడం చేస్తాడు. శ్రీలక్ష్మీ గుణగణాలు, కోటేశ్వరరావు పెంపకం గురించి గొప్పగా చెబుతాడు. కోటిమందిలో ఇలాంటి అమ్మాయి ఒక్కరే ఉంటారని...అలాంటి మహాలక్ష్మీ మా ఇంటికి కోడలుగా వచ్చిందని సూర్యనారాయణ చాలా గొప్పగా చెబుతాడు.అలాగే అందరూ వెళ్లి ఆశీర్వదించమని చెప్పడంతో...అందరూ వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. ఇక వెళ్లొస్తామని కోటేశ్వరరావు, నూకాలు చెప్పగా...నాలుగురోజులు ఉండి వెళ్లమంటే,ఊర్లో పనులు ఉన్నాయని చెప్పి వాళ‌్లు వెళ్లిపోతారు.
మ్యాడీని పక్కకు తీసుకెళ్లి అసలు నాన్నకు నువ్వు ఎలా దొరికిపోయావని ప్రియవద మండిపడుతుంది.మనం వేసుకున్న ప్రతి ప్లాన్ ఆ లక్ష్మీకి ముందే తెలిసిపోతుందని చెబుతాడు.నన్ను గదిలో బంధించి ఫోన్ లాక్కుని వెళ్లిపోయిందని చెబుతాడు. తాను కిటికిలో నుంచి దూకి పారిపోయాయని అంటాడు. కానీ అక్కడికి కూడా తాతయ్యను తీసుకుని వచ్చిందని అంటాడు. ఈ రిసెప్షన్ జరగుకుండా ఆగిపోతుందని మేం ఎన్నో కలలు కన్నామని...వాళ్ల పుట్టింటి వాళ్ల దగ్గర ఆ లక్ష్మీ ఏడుస్తు ఉంటుందని అనుకుంటే ఈ రిసెప్షన్ చేసి అదిఎంతో సంతోషంగా ఉందని అంటుంది.ఇంతలో శ్రీలక్ష్మీ అక్కడికి వచ్చి మ్యాడీతో మాట్లాడాలని అంటుంది. నువ్వు పార్టీ చేసుకుంటుంటే మేం వచ్చి తీసుకుని వచ్చామని అందుకు క్షమించమని అంటుంంది.అంతలో ప్రియంవద కల్పించుకుని నువ్వు మా మ్యాడీకి శనిలా దాపురించావని తిడుతుంది. దీనికి శ్రీలక్ష్మీ కూడా గట్టిగానే బదులిస్తుంది. మేనల్లుడి బాగు కోరే మేనత్తలను చూశాను కానీ...ఇలా చెడిపోయే సలహాలు ఇచ్చే వాళ్లను నిన్నే చూస్తున్నానని అంటుంది. అంత తెలివి నీకు ఉండి ఉంటే నీ జీవితాన్నే బాగుచేసుకుని ఉండేదానివని....మొగుడితో కాపురం చేసి పిల్లలన్ని కని ఉండేదానివని అంటుంది.ఆ మాటలకు ప్రియంవదకు కోపం వచ్చి శ్రీలక్ష్మిపై చేయిచేసుకుంటంది.మీరు ఏం చేసినా...చెడుమార్గంలో వెళ్తున్న నా భర్తను బాగుచేసుకుంటానని శ్రీలక్ష్మీ చెబుతుంంది.
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
ట్రెండింగ్ వార్తలు






















