Krishna Mukunda Murari Serial Today May 9th : కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆట మొదలైందిగా.. ప్రియురాలి కడుపులో కృష్ణ, మురారిల బిడ్డ.. ఆదర్శ్‌కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద!
Krishna Mukunda Murari Serial Today Episode : కృష్ణ, మురారిల బిడ్డను ముకుంద కడుపులో పెరిగేలా ప్రాసెస్‌ను స్టార్ట్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode : సరోగసి మదర్ ఎవరో తెలీదని మురారితో చెప్పుకుంటూ కృష్ణ బాధ పడుతుంది. మీరానే ఆ సరోగసీ మదర్ అని తెలిసిన మురారి ఆ విషయం చెప్తే కృష్ణ కాదంటుందని అలా అయితే అంత మంచి అమ్మాయి మన దగ్గరుండే అమ్మాయి దొరకడం కష్టం అని మురారి తనలో తాను అనుకుంటాడు. మురారి కృష్ణకు ధైర్యం చెప్తాడు. అనుకున్న వెంటనే ఓ అమ్మాయి దేవతలా వచ్చి సరోగసీకి ఒప్పుకోవడం మన అదృష్టమని అంటాడు.
కృష్ణ: దేవతలా వచ్చిందా.. పైగా మంచి అమ్మాయి అని సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంటే తను ఎవరో మీకు తెలుసుకదా. నా దగ్గర దాస్తున్నారు కదా.
మురారి: అదేం లేదు. పరాయివాళ్ల బిడ్డని పది నిమిషాలు భుజం మీద మోయలేం. అలాంటిది మన బిడ్డను తొమ్మిది నెలలు మోయడానికి సిద్ధమైన అమ్మాయి మనకు దేవతే కదా. (మనసులో.. నిజంగా మీరా దేవతే కృష్ణ. త్వరలోనే నువ్వు అర్థం చేసుకుంటావు.)
కృష్ణ: అవును ఏసీపీ సార్.. కానీ..
మురారి: కానీ లేదు ఏం లేదు. రేపు మనం హాస్పిటల్‌కి వెళ్లాలి. వెళ్లి పడుకో.
కృష్ణ: (కృష్ణ, మురారిలు హాస్పిటల్‌కి వస్తారు) అవును ఆ సరోగసీ మదర్ కూడా ఇప్పుడే హాస్పిటల్‌కి వస్తారు కదా.
మురారి: మనసులో.. అవును అంటే ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. తను మీరా అని తెలిస్తే అదొక టెన్షన్.
కృష్ణ: చెప్పండి ఏసీపీ సార్.
మురారి: ఏమో నాకు ఎలా తెలుస్తుంది.
కృష్ణ: ఏం లేదు ఏసీపీ సార్ ఒకవేళ వస్తే. డాక్టర్‌ని బతిమాలకుండానే చూసేయొచ్చు కదా.
కృష్ణ అలా అనగానే మురారి అది ఎవరైనా కావొచ్చు. అంటూ అక్కడ ఉండే కొంతమందికి చూపిస్తారు. ఇంతలో ఆమె కూడా కావొచ్చు అని ముకుంద వైపు చూపించి షాక్ అయిపోతాడు. కృష్ణ మీరాను చూడకుండా అడ్డుగా నిల్చొంటాడు. కృష్ణ చూడకుండా డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లిపోతాడు. ఇక డాక్టర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని అంటుంది.
మురారి, ముకుందని కలుస్తాడు. ప్రాసెస్ స్టార్ చేశారని చెప్తాడు. ముకుంద సంతోషమని అంటుంది. రాత్రి అంతా తనకు నిద్ర పట్టలేదు అని అంటుంది.
మురారి: నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరా. మా ఇంటితో ఏ సంబంధం లేకపోయినా మాకోసం ఇంత ఆరాటపడుతున్నావ్.
ముకుంద: మనసులో.. మన మధ్య సంబంధం లేకపోవడం ఏంటి మురారి మనది జన్మజన్మల సంబంధం. నేను పునర్జన్మనెత్తిన ఓ బిడ్డనకు జన్మనివ్వడానికి సిద్ధపడినా అంతా మన బంధం కాపాడుకోవడానికే.
మురారి: నీలాంటి మంచి అమ్మాయి మాకు దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీరా. చాలా థ్యాంక్స్.
ముకుంద: మీరు ఏమీ అనుకోను అంటే ఓ మాట అడగనా.
మురారి: అడుగు మీరా.
ముకుంద: అనాథనని అద్దె గర్భం మోస్తున్నానని నాకు వెలకట్టరు కదా.
మురారి: ఏం మాట్లాడుతున్నావ్ మీరా. నీకు వెల కట్టడమా.. వెల కట్టలేని అపురూపాలు కొన్ని ఉంటాయి. వాటిలో నువ్వు ఒకదానివి. అయినా వెల కట్టడానికి నువ్వు పరాయి దానివా. మా ఇంటి మనిషివి. ఇప్పుడు మా బిడ్డని మోయబోతున్నావ్ అంటే మా మనిషిని. నీకు వెల కట్టడం అంటే మాకు మేం వెలకట్టుకోవడమే. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్లు.
భవాని పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేయమని అంటుంది. కృష్ణ గురించి అడుగుతుంది. దాంతో వాళ్లు హాస్పిటల్‌కి వెళ్లారని రేవతి చెప్తుంది. ఇంతలో ఆదర్శ్ జాగింగ్‌కు వెళ్లడానికి వస్తాడు. ముకుంద ఎక్కడికి వెళ్లిందని భవానిని అడుగుతాడు. తనకు చెప్పకుండా వెళ్లిందని వెళ్లేటప్పుడు ఒక మాట చెప్పాలి కదా అంటాడు. దాంతో భవాని రేవతితో చూశావా తను వెళ్లేటప్పుడు సార్‌కి చెప్పి వెళ్లాలట అని నవ్వుకుంటారు.
భవాని: సమయం చూసి ముకుందతో మాట్లాడాలి. అయినా కృష్ణ, మురారిలు హాస్పిటల్‌కి వెళ్లారు. మరి ఈ పిల్ల ఎక్కడికి వెళ్లినట్లు. ఏంటో ఈ పిల్ల ఒక పట్టాన అర్థం కాదు.
కృష్ణ ప్రాసెస్ పూర్తి అవుతుంది. డాక్టర్ ముకుంద దగ్గరకు వెళ్తుంది. కృష్ణ వాష్ రూమ్‌కి వెళ్తాను అని మురారితో చెప్పి డాక్టర్ వెనకాలే వెళ్తుంది. ఎవరూ చెప్పకపోయినా తాను తెలుసుకుంటానని అంటుంది.
మరోవైపు ముకుందకు సరోగసీ ప్రాసెస్ పూర్తవుతుంది. దీంతో ముకుంద చాలా సంతోష పడుతుంది. ఇక కృష్ణ సరోగసీ మదర్ ముకుందని చూడబోయే టైంకి డాక్టర్ వచ్చి సీరియస్ అవుతుంది. కృష్ణని తీసుకెళ్లమని మురారిని చెప్తుంది. మురారి కృష్ణ మీద కోప్పడతాడు.
కృష్ణ ఇంటికి వస్తే రజిని పిలుస్తుంది. ముకుందని ఆదర్శ్ ఇష్టపడుతున్నాడు అని చెప్పడానికి ఆమెకు చీరలు కొనడం వల్లే తెలుస్తుందని అంటుంది. కృష్ణ కవర్ చేయాలని చూసినా రజిని ఒప్పుకోదు. ఆదర్శ్ మీరా ఏం చీర కడుతుంది. ఎన్ని చీరలు ఉన్నాయి ఇలా అన్నీ గమనిస్తున్నాడని ఇష్టం ఉండటం వల్లే ఇదంతా చేస్తున్నాడు అని అంటుంది.
రజిని: పరాయి మగాడు చీరలు కొంటాను అంటే ఎలా వెళ్లిపోతుంది. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు.
కృష్ణ: మరి నీ కూతురితో పెళ్లి చేస్తానంది కదా నువ్వు నిలదీయాల్సింది.
రజిని: ఇప్పటికే చాలా సార్లు నిలదీశా.. నా మనసులో ఏం లేదు అంది. ఇప్పుడు అదే అంటుంది. రేపు పెళ్లి అయిన తర్వాత నిలదీసినా అదే చెప్తుంది. ముకుంద కావాలనే చెప్తుంది కృష్ణ. డబుల్ గేమ్ ఆడేసింది. నేను అలాగే చేయగలను కానీ వాళ్ల ప్రేమను చెడగొట్టిన పాపం ఎందుకని ఆలోచిస్తున్నా. ఇప్పుడు నా కూతురి జీవితం ఏమైపోతుందో ఏంటో.
ఇంట్లో అందరూ పూజ ఏర్పాట్లలో ఉంటారు. కృష్ణ, మురారిలను వేగంగా రెడీ అయి రమ్మని భవాని చెప్తుంది. ఇక ముకుంద రావడంతో ఎక్కడికి వెళ్లావని భవాని అడుగుతుంది. ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లానని ముకుంద చెప్తుంది. చెప్పి వెళ్లొచ్చు కదా అని భవాని అంటుంది. ఈ సారి ఎక్కడికి వెళ్లినా చెప్పి వెళ్లమని అంటుంది.
ఆదర్శ్: ముకుంద హాస్పిటల్‌కి వెళ్లిన పని అయిపోయిందా..
ముకుంద: అయిపోయింది. అని తర్వాత షాక్ అవుతుంది. హాస్పిటల్ ఏంటి..
ఆదర్శ్: నువ్వు ఒప్పుకున్నావ్ ముకుంద ఇప్పుడు మాట మార్చుతున్నావ్.
ముకుంద: మనసులో.. పొరపాటున దొరికిపోయానే.
ఆదర్శ్: కృష్ణ, మురారిలతోనే వెళ్లావు కదా. పొద్దున్న వాళ్ల వెనక వెళ్లావు. ఇప్పుడు వాళ్ల వెనకే వచ్చావ్. ముకుంద మా అమ్మకి చెప్పినట్లు ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్లానని చెప్పకు. నువ్వు హాస్పిటల్‌కే వెళ్లావు.
ముకుంద: అవును హాస్పిటల్‌కి వెళ్లాను. కానీ మీరు అనుకున్నట్లు కృష్ణ వెనకాలే కాదు. నేను ఇంతకు ముందు అద్దెకు ఇంటి ఆయనకు సీరియస్ అంటే వెళ్లాను. కానీ నేను వెళ్లే సరికి ఆయన చనిపోయారు. ఇంట్లో వాళ్లకి ఈ విషయం చెప్తే పూజ అవుతుంది కదా సెంటిమెంట్‌గా ఫీలవుతారని చెప్పలేదని ఆదర్శ్‌ని కవర్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.