అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today May 14th : కృష్ణ ముకుంద మురారి సీరియల్: వాట్ ఏ సీన్.. ఆదర్శ్‌ని చూసి ముకుంద ఇచ్చిన ఒక్క ఎక్స్‌ప్రెషన్‌కు కథంతా తారుమారు..!

Krishna Mukunda Murari Serial Today Episode : ఆదర్శ్‌ తనకు ముకుంద అంటే ఇష్టమని ముకుందకు కూడా తాను అంటే ఇష్టమని మురారితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode : ముకుందనే సరోగసి మదర్ అని మురారి కృష్ణతో చెప్తాడు. దీంతో కృష్ణ రచ్చ రచ్చ చేస్తుంది. మీరా తమ బిడ్డను మోయడం వల్ల ఆదర్శ్‌ని బలిచేస్తున్నామని, ఆదర్శ్‌ మీరాని ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది. ఆ విషయం తెలియగానే మురారి షాక్ అయిపోతాడు. 

కృష్ణ: అత్తయ్య కూడా వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయం అత్తయ్య నాతో చెప్పారు. నా నిర్ణయం ఏంటిని నన్ను అడిగింది. మీలాగే నేను ఈ పెళ్లి వద్దు అంటే కారణం అడిగితే ఏం చెప్పాలి. తీగ లాగితే మన డొంక మొత్తం కదులుతుంది. ఇవన్నీ ఆలోచించకుండా ఆవిడ ఏ ఉద్దేశంతో మీ బిడ్డను మోస్తాను అనగానే నాతో ఒక్క మాట చెప్పకుండా ఏం ఆలోచించకుండా ఎలా ఒప్పుకున్నారు ఏసీపీ సార్. జరగబోయేది తలచుకుంటే నా చేతులు వణికిపోతున్నాయి. ఇప్పటికే ఆదర్శ్‌ నా ముఖం చూడటం లేదు. ముకుంద నా వల్లే చనిపోయిందని నమ్ముతున్నాడు. ఇప్పుడు మీరా కూడా నా వల్లే తనకి దూరం అవుతుందని తెలిస్తే ఇక జన్మలో నన్ను క్షమించడు. మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూస్తున్నారా. 

మురారి: మిగతా వాటిని ఎలా ఆలోచించాలో మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన బిడ్డ కోసం కృష్ణ. తను మీరా కడుపులో పెరుగుతుంది. అన్నీ మర్చిపోయి మీరాని జాగ్రత్తగా చూసుకుందాం అర్థమైందా..

అందరూ భోజనం చేస్తూ ఉంటారు. కృష్ణ, మురారిలు కూడా వస్తారు. కృష్ణ వడ్డిస్తాను అంటే వద్దని భవాని వారిస్తుంది. కృష్ణ కోసం స్పెషల్‌గా వంటలు చేసి వాటిని వడ్డించమని చెప్తుంది. 

కృష్ణ: మనసులో.. మీరా ఎదురుగా లేకపోయి ఉంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి మ్యానేజ్ చేసేదాన్ని కానీ బిడ్డను మోస్తున్న తనని ఎదురుగా పెట్టుకొని ఆ బిడ్డను నేనే మోస్తున్నట్లుగా ప్రతీ క్షణం అబద్ధం చెప్తూ నటించడం నరకంగా ఉంది. 

భవాని: తింగరి ఏం ఆలోచిస్తున్నావ్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం మేం పెట్టేవన్నీ నువ్వు తినాలి. 

ముకుంద: మనసులో.. బిడ్డను మోస్తున్నది నేను అయితే మర్యాదలు సపర్యలు నీకు ఏంటే. ఈ సంతోషం కూడా నీకు మిగలనివ్వను ఏం చేస్తానో చూడు. మేడం మీరు ఏమీ అనుకోకపోతే కృష్ణకు చేసిన స్పెషల్‌ వంటల్లో కొంచెం నాకు కూడా పెడతారా..

రజిని: ఏంటి నీకు పెట్టాలా.. అంటే నువ్వు కడుపుతో ఉన్నావా. ఉంటే చెప్పు మా వదిన నీకు కూడా స్పెషల్‌గా చేసి పెడుతుంది. లేకపోతే కడుపుతో ఉన్న కృష్ణ తినమంటే దిక్కులు చూడటం ఏంటి నార్మల్‌గా ఉన్న మీ ముకుంద తనకు కావాలి అని అడగడం ఏంటి. అసలు మీ వాలకం చూస్తుంటే నీ కడుపులో బిడ్డ లేనట్లు ముకుంద కడుపుతో ఉన్నట్లు అనిపిస్తుంది. 

భవాని: ఆపుతావా రజిని ఇంత వయసు వచ్చింది ఏం మాట్లాడాలో తెలీదా పెళ్లి కాని ఆడపిల్లని పట్టుకొని కడుపు అది ఇదీ అంటావా. 

రజిని: ఆ పిల్ల కోరికలు అలా ఉన్నాయి వదినా. కడుపు దాని కోరికలాగా.

ముకుంద: నిజంగా నేను కడుపుతో ఉన్నాను అని తెలిస్తే ఇక్కడ ఎన్ని గుండెలు ఆగిపోతాయో.

రేవతి: స్పెషల్ ఫుడ్ అడిగితే కడుపుతో ఉన్నట్లేనా టేస్ట్ చేయడానికి అడిగుంటుంది. ఇప్పుడు నువ్వు టేస్ట్ చేయడానికి అయితే వడ్డిస్తాను. నువ్వు టేస్ట్ చేసే అసలు టైం ముందు ముందు ఉందిలే.

ముకుంద: ఇప్పుడిస్తాను చూడు అసలు ట్విస్ట్. అని ముకుంద ముసి ముసిగా నవ్వుకుంటుంది. ముకుందని చూసి ఆదర్శ్‌ కూడా సరదాగా నవ్వుకుంటాడు. ఇద్దర్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. 

కృష్ణ: ఇప్పుడెందుకు సిగ్గు పడుతుంది. పిచ్చిగానీ పట్టిందా ఏంటి.

ఆదర్శ్‌: రేవతి మాటలు, ముకుంద సిగ్గు పడి తన వైపు చూసి నవ్వుకోవడం గుర్తు చేసుకొని తనలో తాను.. నాకు తెలుసు ముకుంద నీకు నేనంటే ఇష్టమని. కానీ ఇప్పుడు నువ్వు సిగ్గు పడ్డావ్ చూడు ఫుల్ కన్ఫ్మర్మేషన్ వచ్చేసింది. నీ గురించి ఓ గిఫ్ట్ తీసుకొచ్చా. రెండు రోజుల్లో నీ బర్త్‌ డే రాబోతుంది. నీకు గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తా. అసలు ప్రపోజ్ చేయడం వేస్ట్ కానీ ఫార్మాలిటీ కోసం ప్రపోజ్ చేస్తా. నాకు తెలుసు ముకుంద నువ్వు కూడా ఆ టైం కోసం ఎదురు చూస్తున్నావ్ అని.

మురారి: తనలో తాను.. మీరా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అసలు కడుపులో మా బిడ్డను మోస్తున్నా అని మర్చిపోయిందా ఏంటి అసలు ఆ సిగ్గు పడటం ఏంటి. ఇంకా ఆదర్శ్‌కి ఆశలు పెరుగుతాయి కదా. 

మురారిని చూసి ఆదర్శ్‌ వచ్చి సంతోషంతో హగ్ చేసుకుంటాడు. తనకు చాలా సంతోషంగా ఉందని ఆదర్శ్‌ చెప్తాడు. ముకుంద అంటే తనకు ఇష్టమని తనకి కూడా ఆదర్శ్‌ అంటే ఇష్టమని చెప్తాడు. 

ఆదర్శ్‌: కానీ ఎక్కడో చిన్న డౌట్ ఉండేది. కానీ ఇందాక పిన్ని అనే మాటలకు ముకుంద నా వైపు చూసి సిగ్గు పడింది చూడు ఫుల్ హ్యాపీరా ఇక మా పెళ్లి కావడమే ఆలస్యం. నేను అమ్మకి కూడా చెప్పాను. అవును నువ్వేంటి అలా ఉన్నావ్. నిన్ను చూస్తుంటే ఎందుకో బాగున్నావ్ అనిపించడం లేదు. అంతా ఓకేనా.. రేయ్ ఒక విషయం గుర్తు పెట్టుకో పెళ్లి కావాల్సిన నేనే ఇంత సంతోషంగా ఉంటే తండ్రి కావాల్సిన నువ్వు ఇంకెంత సంతోషంగా ఉండాలి. గతాన్ని మర్చిపోయి నేను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నా మనందరం సంతోషంగా ఉంటాం. 

మురారి: మనసులో.. పెళ్లి అని ఏదేదో ఊహించుకుంటున్నాడు ఏంటి. దీనంతటికి మీరానే కారణం ముందు తనకి చెప్పాలి. 

ముకుంద: మనసులో.. ఒక వైపు తమ బిడ్డను మోస్తే పెళ్లి అంటే సిగ్గు పడుతుంది ఏంటా అని జుట్టు పీక్కుంటుంటారు. నిన్ను ఇలా పిచ్చి దాన్ని చేయడమే నా జీవిత లక్ష్యం కృష్ణ ఈ సారి నేను సక్సెస్ అవుతా. ఈ పాటికి మొగుడు పెళ్లాల్లో ఎవరో ఒకరు రావాలి కదా. హా వచ్చేసింది.

కృష్ణ: నీకు కొంచెం అయినా బుద్ధి ఉందా. మనం ఉన్న పరిస్థితి ఏంటో అర్థమవుతుందా. నీ అంతట నువ్వే సరోగసీకి ఒప్పుకొని ప్రాసెస్ మొత్తం పూర్తి అయింది కదా ఇప్పుడు ఈ వేషాలు ఏంటి. కడుపులో బిడ్డను పెట్టుకొని ఆదర్శ్‌లో ఎందుకు ఆశలు రేకెత్తిస్తున్నావ్. 

ముకుంద: ఏంటి కృష్ణ నువ్వు మాట్లాడేది.

కృష్ణ: ఏం తెలీనట్లు మాట్లాడకు మీరా. నీ మనసులో అలాంటి ఆశలు ఉన్నప్పుడు ఎందుకు సరోగసీకి ఒప్పుకున్నావ్. మేం ఏమైనా నీకు అడిగామా. మీ కుటుంబం అంటే ఇష్టం బాధ్యత అని ఏసీపీ సార్‌ని నమ్మించావ్. ఇప్పుడు ఆదర్శ్‌ని చూసి ఆ సిగ్గు పడటం ఏంటి. ఆ నవ్వు ఏంటి. ఆటలుగా ఉందా నీకు.

ముకుంద: అయిపోయిందా. ఇప్పుడు నన్నేం చేయమంటావ్. ఎవర్నీ చూసి నవ్వకుండా సిగ్గు పడకుండా నాకు ఆదర్శ్‌ అంటే ఇష్టం లేదు. నేను కృష్ణ గర్భాన్ని మోస్తున్నాను. కృష్ణకు జీవితంలో పిల్లులు పుట్టరు అని చెప్పాలా. నువ్వు గర్భవతివి కాకుండా ఎవరికి  ఏ అనుమానం రాకుండా నటిస్తున్నావ్ కదా. నేను అంతే. అయినా ఆదర్శ్‌ ఎప్పటి నుంచో నా వెంట పడుతున్నాడు. నేను అంటి ముట్టనట్లు ఉన్నా తను నా వెనకే పడుతున్నాడు. 

కృష్ణ: నీకు ఆదర్శ్‌ అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత క్లోజ్‌గా ఎందుకు ఉన్నావు. షాపింగ్‌లకు ఎందుకు తిరుగుతున్నావ్. ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్లే ఉండాలి కదా. ఆదర్శ్‌తోనే చెప్పొచ్చు కదా. ఆదర్శ్‌, సంగీతలకు పెళ్లి చేస్తానని మాటిచ్చావు కదా. ఆదర్శ్‌తో క్లోజ్‌గా ఉంటూ మా దగ్గర సరోగసీ తీసుకొని ఏంటి ఈ నాటకాలు మీరా. 

ముకుంద: ముకుందని కోల్పోయిన ఆదర్శ్‌కి నేను నో చెప్తే ఇంకా డిప్రషన్‌లోకి వెళ్లిపోతాడని ఇలా చేశాను. అసలు నేను ఆదర్శ్‌ని కావాలి అనుకుంటే నీ బిడ్డని ఎందుకు నా కడుపులో మోసుకుంటాను. ఆదర్శ్‌ని పెళ్లి చేసుకుంటే నాకు బిడ్డ పుట్టదా. అసలు నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలుసా. ఒకవైపు ఆదర్శ్‌, మరోవైపు మీ బిడ్డ, ఇంకోవైపు ఆశ్రయం ఇచ్చిన భవాని మేడమ్ మాట మధ్య  నేను ఎంత నలిగిపోతున్నానో నీకు తెలుసా. 

ఇంతలో ఆదర్శ్‌ అక్కడికి వస్తాడు. ఆదర్శ్‌తో మాట్లాడాలి అని ముకుంద వెళ్లిపోతే కృష్ణ ఇబ్బంది పడుతుంది. మరోవైపు భవాని ముకుంద, ఆదర్శ్‌ల గురించి ఆలోచిస్తుంది. రేవతి, కృష్ణలతో ముకుంద, ఆదర్శ్‌లకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అంటుంది. పంతుల్ని పిలుద్దామని అంటుంది. ఇంతలో కంగారుగా కృష్ణ వద్దు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అనామిక ఎవరో తనకు తెలియదన్న కళ్యాణ్ – రాజ్​ను ముద్దులతో ముంచెత్తిన కావ్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget