Krishna Mukunda Murari Serial Today May 11th Episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్: కళ్లు తిరిగి పడిపోయిన ముకుందకు టెస్ట్ చేసి కంగుతిన్న కృష్ణ.. నిజం బయట పెడుతుందా!
Krishna Mukunda Murari Serial Today Episode పూజలో ముకుందని పక్కనే కూర్చొమని మురారి మాట్లాడిన మాటలకు కృష్ణతో పాటు అందరూ షాక్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode ముకుంద, ఆదర్శ్‌ల గురించి కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మురారి కృష్ణ దగ్గరకి వస్తాడు. ఇక కృష్ణ మురారిని ఒక విషయం అడుగుతాను నిజం చెప్పండి అని అడుతుంది. తన మీద ఇష్టం తగ్గిందా అని మురారిని అడుగుతుంది. బుంగ మూతి పెట్టుకుంటుంది. ఇక తనకు పిల్లలు పుట్టడం లేదని ప్రేమ తగ్గిందా అని అడుగుతుంది. దీంతో మురారి కృష్ణని తిడతాడు.
మురారి: ఆల్రెడీ మన బిడ్డ ఒకరి గర్భంలో పెరుగుతుంది. అది స్థిరంగా ఉండాలి అని ఈ పూజ చేస్తున్నాం. దేవుడికి బలంగా మొక్కకో బిడ్డ మన చేతికి రావాలి అని. అప్పుడు ఈ ఇంట్లో శుభకార్యం జరగాలి.
కృష్ణ: దాంతో పాటు ఇంకో శుభకార్యం జరగాలి.
మురారి: ఏంటది.
కృష్ణ: ఆదర్శ్ మీరాని ప్రేమిస్తున్నాడు కదా. వాళ్లిద్దరికీ పెళ్లి జరిగితే పెద్దత్తయ్య ఇంకా హ్యాపీగా ఫీలవుతుంది.
మురారి: షాక్ అయి.. వాళ్లిద్దరికీ పెళ్లి ఏంటి. అసలు అలాంటి ఆలోచనలే పెట్టుకోకు. తన బుద్ధి ఏం మంచిది కాదు ఎవరైనా తనకు దూరంగా ఉంటే మంచిది అన్నావు కదా.
కృష్ణ: అన్నాను కానీ పెళ్లి అయితే మీరా మారిపోతుంది.
మురారి: మనసులో.. ఇప్పుడు నో అంటే సరోగసి మదర్ తనే అని తెలిస్తే ప్రాసెస్ ఆపి మరీ వాళ్లకు పెళ్లి చేస్తుంది. ఇప్పుడు ఏం అనకుండా ఓకే అనేస్తే మంచిది. నీకు ఇష్టం లేదు అని వద్దు అన్నాను నీకు ఇష్టం అయితే నాకు ఓకే.
మరోవైపు ముకుంద అందంగా రెడీ అవుతుంది. ముకుందని చూసి ఆదర్శ్ చాలా బాగున్నావ్ అని పొగుడుతాడు. ముకుంద తిట్టుకుంటుంది. ఇక ఆదర్శ్ ఊరు వెళ్తున్నాను అని రెండు రోజుల వరకు రాను అని వచ్చాక నీకు ఓ సర్‌ఫ్రైజ్ ఇస్తానని చెప్తాడు. దీంతో ముకుంద ఈ జన్మలో తన జోలికి రాకుండే ఉండేంట సర్‌ఫ్రైజ్ ఇస్తానని అనుకుంటుంది.
మరోవైపు పూజలకు ఏర్పాట్లు జరుగుతాయి. డాక్టర్ అమృత వస్తుంది. కృష్ణ, మురారిలు కిందకి వస్తారు. అమృత కూడా కృష్ణని పొగిడేస్తుంది.
ముకుంద: కడుపులో బిడ్డ లేదని తెలిస్తే అప్పుడు తెలుస్తుంది. బంగారమో ఇత్తడో అని..
అందరూ పూజకు కూర్చొంటారు. ముకుంద నిల్చొని ఉంటుంది. ముకుందని చూసిన మురారి మీరా నువ్వు కూర్చో అని అంటాడు.
మురారి: నిన్నే ఈ పూజ జరగడానికి కారణమే నువ్వు నువ్వు లేకపోతే అసలు ఈ పూజే లేదు. అందరూ
షాక్ అవుతారు.
ముకుంద: ఇదేంటి ఇంత డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాడు. బిడ్డ నా కుడుపులోనే పెరుగుతుందని చెప్పేస్తాడా.
రజిని: ఈ పూజ చేస్తుంది నీ బిడ్డ కోసం చేస్తున్నామ్ కదా మురారి ఏదో ఆ పిల్ల కోసం చేస్తున్నట్లు చెప్తున్నావ్ ఏంటి.
మురారి: నేను నా బిడ్డ కోసమే చేస్తున్నా అని చెప్తున్నా అత్త. కానీ నా బిడ్డ ఉంది అంటే నా వల్లే కదా. నేను ఉన్నాను అంటే మీరా వల్లే కదా. ఇప్పుడు తను ఈ ఇంట్లో మనిషి కదా పరాయిదానిలా దూరం కూర్చొవడం ఎందుకని వచ్చి పక్కన కూర్చొమన్నా.
రజిని: దీనిలో ఇంత అర్థం ఉందా నాకు వేరేలా అర్థమైంది. కూర్చొమంటున్నాడు కదా కూర్చొ.
ముకుంద పూజ దగ్గర కూర్చొంటుంది. ఇక పంతులు పూజ ప్రారంభిస్తారు. కృష్ణ, మురారిలు కంకణాలు కట్టుకుంటారు. మురారి ముకుంద వైపు చూస్తూ ఉంటాడు. ఇక ముకుందకు అక్షింతలు ఇస్తాడు. కృష్ణ సీరియస్‌గా చూస్తుంది.
ముకుంద: మనసులో.. బిడ్డ కోసం చేస్తున్న పూజ కాబట్టి లెక్క ప్రకారం ఈ పూజలు అన్నీ నేను చేయాలి కదా. సర్లే ప్రస్తుతానికి బిడ్డ వచ్చింది కదా. తర్వాత మురారి పక్కన కూర్చొనే అవకాశం హక్కు కూడా మెల్లమెల్లగా వచ్చేస్తుంది.
మురారి: మనసులో.. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు మీరా. బిడ్డ నీ కడుపులో ఉంటే క్రతువు కృష్ణ చేస్తుంది. భగవంతుడా ఈ క్రతువు అంతా మీరానే చేస్తుంది అనుకొని తన కడుపులో మా బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు.
ఇక అందరూ మురారి, కృష్ణల మీద అక్షింతలు వేసి దీవిస్తారు. ఇంతలో ముకుంద కళ్లు తిరిగిపడిపోతుంది. అందరూ కంగారు పడిపోతారు. ఇక కృష్ణ ముకుందని టెస్ట్ చేస్తుంది. కృష్ణ షాక్ అయిపోతుంది.
మురారి: మనసులో.. మీరా ప్రెగ్నెంట్ అని తెలిసిపోయినట్లుంది. మా బిడ్డనే మోస్తున్న సంగతి నేను చెప్పలేదు కాబట్టి ఎవరి వలనో తల్లి అయిందని చెప్తుందేమో.. అప్పుడు ముకుంద నింద మోయలేక నిజం చెప్పాల్సి వస్తుంది.
భవాని: ఎంత సేపు టెస్ట్ చేస్తావ్. ప్రమాదం ఏం లేదు కదా.
కృష్ణ: ఏం లేదు అత్తయ్య నీరసంతో కళ్లు తరిగిపడిపోయింది. అంతే..
మురారి: ఏం లేదు అంటుంది ఏంటి. ఓ అందరి ముందు పెళ్లి కాకుండానే తల్లి అవుతుందని చెప్తే బాగోదు అని ఆగినట్లుంది.
భవాని: ఏ తల్లి కన్న బిడ్డో మా ఇంటికి వచ్చి చేరింది. తనకు ఎవరూ లేరు అమృత. మా కుంటుంబానికి చాలా సాయం చేసింది. అందుకే సొంత మనిషిలా చూసుకుంటున్నాం. ఒకసారి నువ్వే టెస్ట్ చేయవా.
కృష్ణ: ఆంటీ నేను చూశాను కదా..
భవాని: ఏయ్ తింగరి ఎందుకు ప్రతీ దానికి అడ్డు వస్తావ్. నిన్ను నీకు చూస్తా అంటే వద్దు అన్నావ్ ఇప్పుడు ముకుందని కూడా చూడనివ్వవా.
డాక్టర్ అమృత ముకుందకు టెస్ట్ చేస్తుంది. తాను కూడా ముకుంద ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటుంది. కానీ కృష్ణ కంగారు చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: బంగారు కొబ్బరి కాయతో త్రీ ఇడియట్స్ పిచ్చి పని.. ఇచ్చిపడేసిన తేనె టీగలు!