అన్వేషించండి

Krishna mukunda murari serial today january 4th: కృష్ణ, మురారీలను దూరంగా తీసుకెళ్లేందుకు సిద్ధమైన శకుంతల.. అడ్డంగా దొరికేసిన ముకుంద!

krishna mukunda murari serial today episode కృష్ణ, మురారీలను శకుంతల తనతోపాటు తన ఊరికి తీసుకెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna mukunda murari today episode: కృష్ణ, మురారి ఇద్దరూ ఓ చోట కారు ఆపి కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రాజనర్శి కొడుకును ఇందులో ఇన్వాల్వ్‌ చేశారు అంటే వాడెవడో మనకు బాగా తెలిసిన వాడే అని మురారి అంటాడు. ఆర్టిస్ శ్రీధర్‌ని కలిసి మరోసారి బొమ్మ వేయమని అడుగుతానని చెప్పగానే అతడిని చంపేశాడు అంటే బాగా తెలిసిన వాళ్లే ఇదంతా చేశారని అనుకుంటారు. ఇక ఇంట్లో వాళ్లలో ఎవరికి ఆ అవసరం ఉందని ఆలోచిస్తారు. దేవ్ కూడా తమకే సపోర్ట్ చేస్తున్నాడని మురారి అంటాడు.

కృష్ణ: దేవ్‌ ఓవర్‌ యాక్షన్ చేస్తున్నాడు అని మధు అన్నాడు కదా ఏసీపీ సార్ ఒకవేళ అతను ఏమైనా మనకు మంచిగా ఉంటూ..
మురారి: ఛాన్స్ లేదు కృష్ణ జనరల్‌గా దేవ్‌కి అయితే శ్రీధర్‌ని చంపాల్సిన అవసరం లేదు. శేఖర్‌ని గుర్తుపట్టగలిగే ఏకైక వ్యక్తి పరిమళ. పరిమళని చంపేస్తే ఇక అతనికి టెన్షనే ఉండదు కదా..
కృష్ణ: అవును ఏసీపీ సార్.. పైగా రాజనర్శి గురించి నాకే తెలీదు. ఇక నిన్నా మొన్న వచ్చిన దేవ్ అన్నయ్యకి ఎలా తెలుస్తుంది. కానీ ఆ రింగ్‌ ఉన్నవాడిని ఎలా అయినా పట్టుకోండి ఏసీపీ సార్..

ముకుంద: అత్తయ్య ఈ పెళ్లి ఆగిపోతే మీ పరువు..
భవాని: నోర్ముయ్ ముకుంద.. అసలు నీ పెళ్లి జరగదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు. ఈ నేరం ఆ పెద్దపల్లి ప్రభాకర్ చేయలేదు అని వాళ్ల లాగే నువ్వు భయపడుతున్నావా.. మరెందుకు పెళ్లి జరగదు అని భయపడుతున్నావ్. చూశావు కదా మర్డర్‌ కూడా జరిగింది. వాళ్లకి కాక ఇంకెవరికి ఆ అవసరం ఉంటుంది చెప్పు.
ముకుంద: మనసులో.. దేవ్ చేస్తున్నాడు అని తెలిస్తే అత్తయ్య కాదు మిగిలిన వాళ్లు కూడా క్షణం కూడా నన్ను ఇంట్లో ఉంచరు. ఏదో ఒక రకంగా కవర్ చేయాలి. ఎదురు దాడి చేసి ఎస్కేప్ అవుతా. 
భవాని: ఏం మాట్లాడవేంటి ముకుంద.. 
ముకుంద: ఏం మాట్లాడమంటారు అత్తయ్య. నేను జరిగిన దాని గురించో ఇంకో దాని గురించో ఆలోచించడం లేదు. నన్ను పెళ్లి చేసుకోవాల్సిన వాడు కనీసం నన్ను కన్నెత్తి అయినా చూడటం లేదు. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పెళ్లి రోజు ఒక వేళ పారిపోతే నా గతి ఏంటి.
రేవతి: మరి ఆ భయం ఉన్నప్పుడు ఈ ప్రయత్నాలు ఎందుకు ముకుంద. వాడికి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అర్థమైనప్పుడు బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఎందుకు.
భవాని: నీ కొడుకు మాత్రం కృష్ణని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా.. చెప్పు రేవతి.
రేవతి: అప్పుడు కాకపోయినా ఇప్పుడు బాగున్నారు కదా అక్క.
భవాని: కదా.. వీళ్లు కూడా ఇప్పుడు కాకపోయినా తర్వాత బాగుంటారు. నువ్వేం బాధ పడకు. రేవతి నీకు ఇంకా చెప్పలేదు కదూ.. రేపు ఇద్దరికీ నలుగు పెట్టిద్దామని ఊరి నుంచి స్పెషల్‌గా పసుపు తెప్పించాను. అందరూ ఆ ఏర్పాట్లు చూడండి. 

ఇక కృష్ణ పిన్ని బట్టలు సర్దుతూ ఉంటుంది. అక్కడికి నందిని వస్తుంది. ఎందుకు బట్టలు సర్దుతున్నావ్ అని అడిగితే మురారి, కృష్ణలను తన ఊరు తీసుకెళ్లిపోతానని అంటుంది. నందినీ కూడా సరైన ఆలోచనే అనుకుంటుంది. అయితే ఈ విషయం రేవతికి చెప్తానని అంటుంది నందూ. భవానికి తెలీకుండా రేవతిని తీసుకెళ్లడానికి నందూ వస్తుంది. ఇక నందూ ఈ విషయం రేవతికి చెప్తుండడంతో భవాని వినేస్తుంది. 

మరోవైపు శకుంతల బ్యాగ్ పట్టుకొని బయటకు వస్తుంది. అప్పుడే అక్కడికి మురారి వస్తాడు. మురారితో శకుంతల ఇక్కడి నుంచి వెళ్లిపోదాం. రెండు రోజులు తిడతారు తర్వాత వాళ్లే సెట్ అయిపోతారు అని అంటుంది. ఇక మురారిని తన ఇంటికి కూడా వెళ్లొద్దని వెళ్తే అడ్డుకుంటారు అని శకుంతల చెప్తుంది. మరోవైపు శకుంతల, మురారి మాట్లాడుకోవడం దూరం నుంచి భవాని చూస్తుంది. ఇక రేవతి, నందూ కూడా అక్కడికి వస్తారు. 

రేవతి: మీరు ఏమంటారు మురారి వెళ్లిపోతారా.. 
కృష్ణ: ఏంటి అత్తయ్య మీరు కూడా మా చిన్నమ్మ ఏదో ఆవేశంలో ఉంటుంది.
నందూ: ఆవేశం కాదు కృష్ణ.. ఆలోచిస్తే అత్తయ్య చెప్పింది కూడా మంచిదే అనిపిస్తుంది.  
రేవతి: వదినా ఆధారాలు దొరుకుతాయి కదా ఇంకా ఎందుకు ఆవేశపడటం.. 
మురారి: ఈ కేసు నేను తొందరలోనే క్లోజ్ చేస్తా..  నేను ఇక్కడే ఉండాలి.. నేను రాలేను.
శకుంతల: కిట్టమ్మ నీ బట్టలు సర్దేశాను. నువ్వు వచ్చేయ్ బాబు. నీకు దండం పెడతా పోదాం పదండి.
కృష్ణ: చిన్నమ్మ ఆగుతావా.. ఇలా చేయమని నీకు ఎవరు చెప్పారు. మేము రాము. నువ్వు పోతే పో. అవును చిన్నమ్మ. నువ్వు వెళ్లాలి అనుకుంటే నువ్వు వెళ్లు. తప్పు చేయలేదు అంటున్నావ్. మరి అలాంటప్పుడు మేము వెళ్లిపోతే తప్పు చేసి పారిపోయినట్లు చూడరా.. మేము పెద్దత్తయ్యకు మాటిచ్చాం. ఆ మాట తప్పి ఎక్కడికీ రాం. మా పెద్దత్తయ్య మాట మార్చరు. 
 
ముకుంద: రేయ్ దేవ్.. రేపు నలుగు ఎల్లుండి పెళ్లి ఈలోపు ఏం జరగదు కదా.. అత్తయ్యకి నువ్వు చేసే కుట్ర తెలీదు కదా.. 
దేవ్: ఏం జరగదు.. ఇంతలో మధు తల్లి వచ్చి ఏం జరగదు దేవ్ అని అడుగుతుంది. దేవ్ మనసులో అందుకే నేను వందల సార్లు చెప్తా డోర్ వేసి మాట్లాడు అని..
ముకుంద: మనసులో.. ఏం జరుగదు దేవ్ అని అన్నారు అంటే అంతకు ముందు మాట కూడా వినేవింటుందా..
దేవ్: అదే ఆంటీ ఈ పెళ్లి జరగదు అంటున్నా.. 

ఇక దేవ్ పెళ్లి జరగదు అంటే నువ్వు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావని ఆవిడ ముకుందను అడుగుతుంది. దీంతో తన వెనక పెద్దత్తయ్య ఉంది అనే ధైర్యం అని ముకుంద అంటుంది. అయితే మధు తల్లి ముకుంద మాటల్ని అనుమానిస్తుంది. ఏదో ఉంది అని అనుకుంటుంది. ఇక కృష్ణ, మురారిలు ఇంటికి వస్తారు. ఇక ప్రసాద్ టెన్షన్ లేకుండా అంత కూల్‌గా ఎలా ఉన్నారని కృష్ణ వాళ్లని అడుగుతారు. దానికి కృష్ణ టెన్షన్ ఉంది మామయ్య కానీ ఈ కేసుకి మా చిన్నాన్నకి ఏ సంబంధం లేదు కాబట్టి కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నామని అంటారు. ఇక నలుగు పెట్టడానికి కావాల్సిన లిస్ట్‌ రాస్తున్నా అని ప్రసాద్ చెప్తే కృష్ణ అక్కడి నుంచి లేస్తుంది. ప్రసాద్ కృష్ణని వెళ్లొద్దని తప్పదు కదా అని అంటాడు. దీంతో కృష్ణ అయితే కొంచెం ఎక్కువ గంధం లిస్ట్‌లో రాయండి అని జోక్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Tirumala Tickets Online: భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
AP New Liquor Policy: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
CTET 2024: సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
Embed widget