అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today December 22nd Episode - ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: భవాని మీద ఫైర్ అయిన రేవతి, మురారి ఇంటికి వచ్చేసిన దేవ్!

Krishna Mukunda Murari Today Episode మురారి ఇంటికి ముకుంద అన్నయ్య దేవ్ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Serial Today Episode :

ముకుంద: అత్తయ్య ఈ కేసులు అసలైన వారిని పట్టుకోవడాలు నాకు అవేవి అవసరం లేదు అత్తయ్య. నాకు కావాల్సింది మురారితో జీవితం పంచుకోవడం అంతే. నాకు ఈ ఒక్క సాయం చేయండి అత్తయ్య. జీవితాంతం మీ కాళ్ల దగ్గర పడి ఉంటా. 
భవాని: ఏంటి ఇది ముకుంద నేనున్నాను కదా..
ముకుంద: మీరున్నారు అన్న ధైర్యంతోనే బతుకుతున్నాను అత్తయ్య. ఆ ధైర్యమే లేకపోయింటే ఏ నాడో చచ్చిపోయేదాన్ని.
భవాని: అలాంటి మాటలు మాట్లాడకు. వెళ్లు. 

కృష్ణ ఇంట్లో గౌతమ్, నందూ, మధు, రేవతిలు టిఫెన్‌లు చేయడానికి కూర్చొంటారు. కృష్ణ వడ్డిస్తుంటుంది. ఇక అందరూ జోకులు వేసుకుంటూ సరదాగా గడుపుతారు. ఇంతలో భవాని అక్కడికి వస్తుంది. అందరూ నవ్వుతుంటే ఆపండి అని అరుస్తుంది. దెబ్బకు అందరూ టిఫెన్ ముందు నుంచి లేచి నిల్చొంటారు. రేవతి అందర్ని తిడుతుంది.

భవాని: మనతో పాటు మన ఇంట్లో తన ప్రాణాలు కూడా తీసుకోవడానికి సిద్ధపడిన మనిషి ఉందని తెలుస్తుందా మీకు. లేకపోతే మీరందరూ తనని చంపేయాలి అనుకుంటున్నారా..
మురారి: పెద్దమ్మ ఎందుకు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 
భవాని: ఇలా చెప్తే అయినా అర్థమవుతుంది అని. అయినా మనకు ఏదో గతి లేదు అన్నట్లు ఈ ఇంట్లో పడి తినడం ఏంటి. 
కృష్ణ: పెద్దత్తయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్.
మురారి: కృష్ణ ఆగు.. పెద్దమ్మ నేను ఈ కేసు గాలికి వదిలేయడమే జరిగింది అంటే ముకుందతో నా పెళ్లి కదా.. అయితే నేను ఈ కేసు వదిలేస్తే మీరు రిలాక్స్‌గా ఉండాల్సింది పోయి ఇలా ఇరిటేట్ అయిపోతున్నారు ఏంటి. 
భవాని: నువ్వు అర్థం చేసుకున్నది నీకు అర్థమైంది ఇదేనా.. నువ్వు ఈ కేసులో ఓడిపోతే బాగున్ను అని నేను అనుకోలేదు. ఈ కేసు ఫైనల్ హియరింగ్‌కు వచ్చే సరికి వీళ్లే ఈ నేరం చేశారని మీ అందరికి తెలిస్తే అంతా మంచిదని నేను తొందర పడుతున్నాను. అంతే తప్ప లేట్ అయితే పెళ్లి అవుతుంది అని చీప్‌గా నేను ఆలోచించడం లేదు. 
కృష్ణ: ముకుంద గురించి ఎందుకు ఆలోచించడం లేదు అనుకుంటున్నారు. పెద్దత్తయ్య వినండి.. ఏసీపీ సార్ రమ్మన్నా కూడా నేను ఆ ఇంట్లోకి రాలేదు ఎందుకో తెలుసా.. నన్ను చూసినప్పుడల్లా ముకుంద మనసు పాడై మళ్లీ ఏ అగాయిత్యానికైనా పాల్పడుతుంది అని. లేకపోతే గతం గుర్తొచ్చి మనందరిని గుర్తుపట్టిన భర్త ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు ఏమైనా పిచ్చా.
భవాని: పిచ్చి కాదు భయం. రేపటి రోజున మీరే దోషులు అని తెలిస్తే ఏం చేస్తానా అనే భయం.

భవాని వెళ్లి పోయిన తర్వాత అందరూ టిఫెన్ చేస్తారు. మరోవైపు ముకుంద మాటలు తలచుకొని భవాని బాధపడుతుంది. ఇక రేవతి అప్పుడే వస్తుంది. దాంతో భవాని ఏంటి అప్పుడే వచ్చేశావేంటి అని అడుగుతుంది. దీంతో రేవతి ఫైర్ అవుతుంది. 

రేవతి: ముకుంద ముకుంద ముకుంద ఏంటి అక్కయ్య ముకుంద. ఇప్పటికే తను రెండు సార్లు చావు డ్రామా ఆడింది.
భవాని: రేవతి ఏంటి ముకుంద బాధ నీకు డ్రామా అనిపిస్తుందా. కృష్ణతో ఉండి ఉండి నీకు వాళ్లలాంటి మనస్తత్వమే వచ్చింది. పాపం ఆ పిల్ల ఎంత బాధపడుతుందో తెలుసా.
రేవతి: మనసులో.. పాపం అది నిన్ను ఎంత దారుణంగా మోసం చేస్తుందో తెలుసా.. ఎప్పుడు తెలుసుకుంటావో అక్క. ముకుంద మీద జాలి చూపిస్తే నువ్వు నాతో చక్కగా మాట్లాడుతావు అక్క. కానీ నాకు నా కొడుకు జీవితం ముఖ్యం. వాడు కోరుకునేది ఇవ్వడమే నాకు ఇష్టం. అలా అని ఇంకెవరో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని ఇంకో అమ్మాయి జీవితం దారుణంగా మోసం చేయడం నాకు ఇష్టం లేదు.
భవాని: ఎవరూ ఆ అమ్మాయి జీవితం దారుణంగా మోసం చేయలేదు. తనే చేసుకుంది. నా బిడ్డ జీవితం అని తెగ బాధపడుతున్నావు కదా. ఆ బిడ్డ బతికుండగానే అనాథ శవం పంపిన వాళ్లు నీకు మంచివాళ్లా.. నీ బిడ్డ బతికే ఉన్నాడని.. చనిపోలేదు అని పిండం పెట్టడానికి వెళ్తున్న మనల్ని తీసుకెళ్లి నీ బిడ్డని చూపించిన వాళ్లు అంటే నీకు ఇష్టం లేదా.. లెక్కలేదా.. ముకుంద గనుక ఆరోజు హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్పకపోయింటే ఇప్పటికీ మనం నీ బిడ్డ చనిపోయాడనే అనుకునేవాళ్లం.
రేవతి: మీరంతా ఇప్పటి వరకు అనుకున్నది జరిగింది మాత్రమే. అది చేసింది ఎవరో నిర్థారించకముందే ఒక నిర్ణయానికి రావడం తప్పు. ఇప్పటికి చేసింది వాళ్లు చేయలేదు అని నేను నమ్ముతున్నాను. వాళ్లు అని తెలిశాక కూడా నేను వాళ్లతో మాట్లాడుతున్నాను అని మీరు అనుకోవడం నాకు చాలా బాధగా ఉంది అక్క. నిజంగా కృష్ణ వాళ్లు చేసుంటే మీదాకా ఎందుకు అక్క విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టించి నేనే మెడ పట్టి బయటకు గెంటేసేదాన్ని. 
భవాని: అంటే నువ్వు ఇదే మాట మీద ఉంటావా.
రేవతి: ఉంటాను. మీరు కూడా దీని వెనక కృష్ణ వాళ్లు లేరు అని రుజువు అయితే వాళ్ల బంధాన్ని శాశ్వతం చేస్తారా.. 
భవాని: నిజం తెలిశాక మాట్లాడుదాం రేవతి. నేను ఒకసారి మాటిచ్చాను అంతే దాన్ని నెరవేర్చడానికి తొందర పడతాను. 
రేవతి: ఆగండి అక్క. మీకు మన మురారికి గతం గుర్తొచ్చింది అన్న సంతోషం తప్ప ముకుంద పెళ్లి ఎలా చేయాలి.. జరుగుతుందో జరగదో అన్న విచారమే ఎక్కువగా కనిపిస్తుంది అక్క. సారీ అక్క. 

మరోవైపు శకుంతల ఏడుస్తుంటుంది. తన బిడ్డ జీవితం ఏం అవుతుందో అని చెప్పుకొని ఏడుస్తుంది. తనని గౌతమ్, నందూ, మధులు ఓదార్చుతారు. ఇక రేవతి కిచెన్‌లో తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇక సుమలత, తన భర్త, మధు, గౌతమ్, నందూ అక్కడికి వస్తారు. అందరూ మాట్లాడుకుంటారు. ఇక ముకుంద అక్కడికి రావడంతో అందరూ మాట్లాడటం మానేస్తారు. ఇక తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. ఇక ముకుంద అక్కడి నుంచి వెళ్లి పోయే సరికి దేవ్ ఎదురుగా వస్తాడు. ముకుంద షాక్ అయిపోతుంది. అందరూ హాల్‌ లోకి వస్తారు. ఇక ముకుంద రేవతికి తన అన్నని పరిచయం చేస్తుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read - సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget