Krishna Mukunda Murari Serial Today April 16th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: నిన్నే ఫస్ట్‌నైట్ ఈరోజు చేతిలో బిడ్డ.. ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్.. మరి ముకుంద, మురారి రొమాన్స్ ఏంటి..!
Krishna Mukunda Murari Serial Today Episode ఆదర్శ్ తనకు ముకుంద మీద ఫీలింగ్స్ ఉన్నాయని ముకుందతోనే చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Krishna Mukunda Murari Serial Today April 16th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: నిన్నే ఫస్ట్‌నైట్ ఈరోజు చేతిలో బిడ్డ.. ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్.. మరి ముకుంద, మురారి రొమాన్స్ ఏంటి..! krishna mukunda murari serial today april 16th episode written update in telugu Krishna Mukunda Murari Serial Today April 16th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: నిన్నే ఫస్ట్‌నైట్ ఈరోజు చేతిలో బిడ్డ.. ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్.. మరి ముకుంద, మురారి రొమాన్స్ ఏంటి..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/5635b4f7955869ea9e6776807ac31d0c1713241654716882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna Mukunda Murari Today Episode కృష్ణకు ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తారని.. కృష్ణకి అందరి సపోర్ట్ ఉన్నంత వరకు తాను తన లక్ష్యం చేరుకోలేను అని ముకుంద తన తండ్రితో చెప్పి బాధపడుతుంది. ముకుందగా చనిపోయిన తాను మరొకరిని బలి ఇవ్వడానికి వెనకాడనని చెప్తుంది. తన తండ్రి నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ముకుంద మాట వినదు.
ముకుంద: తనలో తాను.. ఛా ఎంత పని చేశావ్ నాన్న నా అకౌంట్‌లో డబ్బులు వేసే ముందు ఒక్కమాట అయినా నాకు చెప్పాల్సింది కదా. నేనే ముకుంద అని చెప్తే కానీ డబ్బులు రావు. చెప్తే అడ్డంగా దొరికిపోతాను. పోనీ డబ్బులు లేకపోతే లేవు అనుకుంటే డాక్టర్‌తో అస్సలు పని అవ్వదు. అయ్యో ప్లాన్ బీ వర్కౌట్ అవ్వదే. నా లాప్‌టాప్ ఉంటే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్లే. కానీ అది ఇప్పుడు ఆదర్శ్ దగ్గర ఉంది. అక్కడ నుంచి ఎలా తీసుకోవాలి. ఆదర్శ్ దగ్గరకు వెళ్లాలి అంటేనే కంపరంగా ఉందే.
ఆదర్శ్: గుడ్ మార్నింగ్ ముకుంద..
ముకుంద: అనుకోగానే వచ్చాడు వందేళ్లు.
ఆదర్శ్: ముకుంద ఈ రోజు నువ్వు కూడా సరదాగా జాగింగ్‌కు వస్తావా..
ముకుంద: (మనసులో.. నా బొంద జాగింగ్‌రా..) సారీ ఆదర్శ్‌గారు ఇప్పుడు నేను బయటకు రాలేను ఎందుకో కొంచెం డల్‌గా ఉంది.
ఆదర్శ్: ఏమైంది ఒంట్లో బాగోలేదు అంటే డాక్టర్ దగ్గరకు వెళ్దామా..
ముకుంద: అంత అవసరం లేదు. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.
ఆదర్శ్: నువ్వు కూడా వస్తావేమో అలా సరదాగా జాగింగ్ చేస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు అనుకున్నా. నా బాధ అయినా సంతోషం అయినా ఈ ఇంట్లో నీతోనే పంచుకోవాలి అనిపిస్తుంది ముకుంద. నీకు ముకుంద అని పేరు పెట్టాక ఫీలింగ్ ఇంకా ఎక్కువ అయింది ముకుంద.
ముకుంద: ఫీలింగ్ అదీ అంటున్నాడు కొంపతీసి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటా అనడు కద.
ఆదర్శ్: ఒక్క మాటలో చెప్పాలి అనుకుంటే ఈ ఇంట్లో ఫ్రీగా మాట్లాడటానికి నా మనసులో మాట షేర్ చేసుకోవడానికి నాకు ఎవరూ లేరు ముకుంద నువ్వు తప్ప. అలాగే నీ మనసులో మాట షేర్ చేసుకోవడానికి నీకు ఎవరు లేరు నేను తప్ప.
ముకుంద: లేదండి.. నాకు ఉన్నారు. నా ఫ్రెండ్ ముకుంద ఉంది కదా. బాధ అయినా సంతోషం అయినా ఏదైనా తనతో పంచుకోవడం నాకు అలవాటు. ఈ విషయంలో నాకు సాయం చేయనక్కర్లేదు కానీ వేరే సాయం చేస్తారా..
ఆదర్శ్: అడగండి ఏమైనా.
ముకుంద: ఆదర్శ్ గారు నాకు ముకుంద లాప్‌టాప్ కావాలి ఇస్తారా.. అందులో మా మెమొరీస్ చాలా ఉన్నాయి. ప్లీజ్..
ఆదర్శ్: అయ్యో మొన్నటి వరకు నా దగ్గరే ఉండేది. కానీ మొన్న శాంతి పూజ రోజు కృష్ణ ముకుంద వస్తువులన్నీ పూజలో పెట్టింది. తర్వాత తనే తీసుకెళ్లినట్లు ఉంది. నేను జాగింగ్‌కు వెళ్తాను. ముకుంద నీకు ఓ విషయం చెప్పనా మనతో లేని వాళ్లతో సంతోషం పంచుకున్నా బాధగా మారిపోతుంది. అదే మనతో ఉన్న వాళ్లతో బాధ పంచుకున్నా అది సంతోషంగా మారిపోతుంది. ఇకపై లేని ముకుందతో కాకుండా ఉన్న ఆదర్శ్‌తో పంచుకో. నీకు అర్థమైంది అనుకుంటా..
ముకుంద: తొందరగా ఈ టార్చర్ నుంచి బయట పడాలి. అంత కంటే ముందు కృష్ణ దగ్గర నుంచి లాప్‌టాప్ తీసుకోవాలి.
రేవతి కిచెన్‌లో వంట చేస్తుంటే కృష్ణ వచ్చి తాను చేస్తా రెస్ట్ తీసుకో అంటుంది. రేవతి షాకులు చెప్పకుండా తనకు మనవడిని ఇవ్వాలి అని చెప్తుంది. దీంతో కృష్ణ సిగ్గు పడుతుంది. రేవతి కృష్ణను ప్రేమగా హగ్ చేసుకుంటుంది. ఇక దూరం నుంచి ముకుంద చూసి కోపంతో రగిలిపోతుంది.
మరోవైపు మురారి నిద్ర లేచి లేట్ అయిందని స్నానానికి వెళ్తాడు. ఇక ముకుంద ఆ గదికి వస్తుంది. కృష్ణ కింద ఉంది, మురారి వాష్ రూంలో ఉన్నాడని తొందరగా ల్యాప్‌టాప్ తీసుకొని వెళ్లాలి అనుకుంటుంది. ల్యాప్‌టాప్ కోసం వెతుకుతూ బొమ్మ పడేస్తుంది ముకుంద. ఆ సౌండ్‌కి వాష్‌రూంలో ఉన్న మురారి కృష్ణ అనుకొని టవల్ అడుగుతాడు. ముకుంద టవల్‌ని మురారి చేతికి ఇవ్వగానే మురారి కృష్ణ అనుకొని ముకుంద చేయి పట్టుకొని మాట్లాడుతాడు. ముకుంద మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. ఇక మురారి కృష్ణ లోపలికి రా అంటే ముకుంద కంగారు పడుతుంది. మురారిని వదిలించుకొని వెళ్లిపోతుంది.
ముకుంద: మురారి ఎప్పుడు నా చేయి పట్టుకుంటాడా అని ఎదురు చూసిన నేను ఇప్పుడు ఆ చేయి వదిలించుకొని రావాల్సి వచ్చింది. అయినా కృష్ణ అనుకొని నా చేయి పట్టుకోవడం కాదు. నేను ముకుంద అని తెలుసుకొని నా చేయి పట్టుకోవాలి. ఇదంతా జరగాలి అంటే ముందు నా ల్యాప్‌టాప్ నా చేతికిరావాలి. ఆదర్శ్ రూంలో చూడాలి. అయినా ఇప్పుడు ఆదర్శ్ దగ్గరకు వెళ్తే తిప్పలు తప్పవు. అయినా ల్యాప్‌టాప్ కోసం ఏదో ఒకటి చేయాలి తప్పదు.
మురారి: స్నానం తర్వాత కృష్ణ బెడ్ సర్దుతుంటే.. ఏంటి లోపలికి రమ్మంటే రావేంటి. కలిసి స్నానం చేద్దామని పిలిస్తే రాకుండా వెళ్లిపోయావ్.
కృష్ణ: నన్ను ఎప్పుడు పిలిచారు. మీరు చాపల కూర తినాలి అన్నారు కదా నేను అత్తయ్య సందు చివరకు వెళ్లి చేపలు తెచ్చాను.
మురారి: ఆటలు వద్దు కృష్ణ పొద్దున్న ఇలాగే చేశావ్. ఇప్పుడు వచ్చి రాలేదు అంటున్నావ్.
కృష్ణ: నేను పొద్దున్నా రాలేదు ఇప్పుడు రాలేదు..
మురారి: నేను స్నానానికి వెళ్లానా ఏదో సౌండ్ వచ్చింది. (మరి నేను ఎవరి చేయి పట్టుకున్నట్లు. పోనీ భ్రమ పడ్డాను అంటే ఈ టవల్ ఎవరు ఇచ్చినట్లు)
ముకుంద ల్యాప్‌టాప్ కోసం ఆదర్శ్ రూమ్‌కి వస్తుంది. రూమ్ అంతా వెతికి బీరువాలో ల్యాప్‌టాప్ చూస్తుంది. తీసుకొని తన గదికి వెళ్లిపోతుంది. ఇక భవాని, రేవతిలు ఆదర్శ్ గురించి ఆలోచించి బాధపడుతుంటారు. ఆదర్శ్‌కి మళ్లీ పెళ్లి చేద్దామని రేవతి భవానితో చెప్తుంది. ఇక కృష్ణ, మురారిలు రావడం చూసిన భవాని ప్రస్తుతానికి తన ఆశలు అన్నీ వీళ్ల మీదే అని చెప్తుంది. కృష్ణ బిడ్డని ఎత్తుకొని వచ్చినట్లు కలలు కంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)