అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today April 11th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆదర్శ్‌ - సంగీతల పెళ్లి గురించి భవానితో మాట్లాడిన ముకుంద.. గిఫ్ట్ ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేసిన కృష్ణ!

Krishna Mukunda Murari Serial Today Episode మీరాని ముకుంద అని పిలవను అని అందరి ముందు కృష్ణ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode మీరా ప్రవర్తన బాలేదు అని కృష్ణ మురారితో అంటుంది. హోళీ రంగులు పట్టుకొని మీ వెంట తిరుగుతుంది అని.. మీ వెంట రాసుకొని పూసుకొని తిరుగుతుంది అని అంటుంది. మీరా మనసులో ఏముందో తెలీడం లేదు అంటుంది. దీంతో మురారి మీరా మనసులో ఏముందో తెలీదు కానీ నీ మనసులో మాత్రం పొసెసివ్‌నెస్‌ ఉందని అంటాడు.

కృష్ణ: ఏమో ఏసీపీ సార్ ఆదర్శ్ మీతో మాట్లాడినప్పటికీ ఏదీ తెలియన భయం, బాధ వెంటాడుతున్నాయి. 
మురారి: అదంతా ఎందుకో నేను చెప్పనా ఆదర్శ్‌ నాతో మాట్లాడి నీతో మాట్లాడటం లేదు అని ఇలా అంటున్నావ్.
కృష్ణ: పొద్దున్న మాట్లాడలేదు అంటే ఓకే. హోళీలో కూడా నాతో మాట్లాడలేదు. ఉంటే మన ఇద్దరి మీద కోపం ఉండాలి. పోతే ఇద్దరి మీదా పోవాలి. మీ మీద పోయి నా మీద ఉండటం ఏంటి.
మురారి: ప్రతీ దానికి సమయం సందర్భం ఉండాలి కృష్ణ. రౌడీతో గొడవ పడి నాతో మాట్లాడాడు. ఇంకో పరిస్థితిలో నీతో మాట్లాడుతాడు. ఇంకా కోపం లేదా నా దగ్గర దీనికో మందు ఉందని కృష్ణని ముద్దు పెడతాడు. ఇద్దరూ నవ్వుకుంటారు. 

మరోవైపు ముకుంద అద్దంలో చూసుకుంటూ హోళీలో తాను మురారికి రంగు పూసిన సంఘటన తలచుకొని మురిసిపోతుంది. ఈరోజు బాగా దొరికావ్ మురారి. ఇలాంటి పండగ రోజూ ఉంటే బాగున్ను తనివి తీరా నిన్ను తాకొచ్చు అనుకుంటుంది. ఇంతలో రజిని వస్తుంది. తన కూతురికి ఆదర్శ్‌తో పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వు మధ్యలో దూరుతున్నావని అంటుంది. ఆదర్శ్‌ నీ వెంట పడుతున్నాడు అని రజిని ముకుందతో అంటుంది.

ముకుంద: నాకు అయితే ఏం లేదు కానీ నీ అనుమానం కరెక్టే. ఇలా ఉంటే ఎవరికైనా అదే అనుమానం వస్తుంద. పోనీ ఒక పని చేద్దామా.. ఇప్పుడే భవాని మేడం దగ్గరకు వెళ్లి ఆదర్శ్‌తో నీ కూతురి పెళ్లి చేయమని అడుగుదాం.
రజిని: అమ్మో ఇప్పుడా వద్దు. వదిని ఏమైనా అంటుదేమో.. అయినా ముందు ఆదర్శ్‌ని ఒప్పిస్తే వదిని ఒప్పుకుంటుంది కదా..
ముకుంద: అక్కడే మీరు పప్పులో కాలు వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఏం చేసినా ఆదర్శ్ పెళ్లికి ఒప్పుకోడు. కానీ భవాని మేడం చెప్తే ఒప్పుకుంటాడు. అందుకే మనం భవాని మేడంని ఒప్పిద్దాం. ఇప్పుడు మీరు తొందర పడకపోతే మీకే నష్టం మీరు మాట్లాడండి నేను అందుకుంటా.

రేవతి భోజనాలకు ఏర్పాట్లు చేస్తుంది. ఒక్కొక్కరిగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. ఇక రజినీని అడగమని ముకుంద సైగ చేస్తుంది. రజిని భవానితో వదిన నువ్వు ఇప్పుడు హ్యీపీనే కదా.. నీ కొడుకుతో సంగీత విషయం మాట్లాడితే ఒక పని అయిపోతుంది కదా అని అంటుంది. 

భవాని: సంగీత విషయం అంటే..
రజిని: ఏంటి వదినా నువ్వు ఏమీ తెలీనట్లు. ముకుంద పోయింది కదా నీ కొడుకుతో నా కూతురికి పెళ్లి చేయమని అడిగాను కదా..
ముకుంద: మనసులో.. ఒప్పుకోండి అత్తయ్య నా పేరు ముకుంద అని మార్చినప్పటి నుంచి ఆదర్శ్‌ నా వెంట పడుతున్నాడు. వాళ్ల పెళ్లి జరిగితే ఆదర్శ్ నా వెనక పడటం మానేస్తాడు. నేను ఫుల్ ఫోకస్ మురారి మీద పెట్టొచ్చు. 
రజిని: మాట్లాడలేదు ఏంటి వదిన. నా కూతురు పెద్దగా చదువుకోలేదు అని ఆలోచిస్తున్నావ్. కానీ నీ కొడుకు అంటే ఇష్టం ఉంది అది చాలదా.
ముకుంద: అవును మేడం. సంగీతకు ఆదర్శ్‌ గారు అంటే చాలా ఇష్టం. నేను కూడా చాలా సార్లు గమనించాను. అంటే ఆదర్శ్ గారు ముకుందని మర్చిపోవాలి అంటే ఆయన జీవితంలోకి మరొకరు రావాలి. అది కూడా ఆయన్ని ఇష్టపడే వాళ్లు వస్తే బెటర్ అని.. (ఇదేంటి ఇంకా నన్ను అలాగే చూస్తుంది. కొంపతీసి నీకు ఎందుకు నువ్వు నోరుమూసుకో అనదు కదా) మేడం ఇది మీ కుటుంబానికి సంబంధించిన విషయం ఆదర్శ్ గారి సంతోషం కోసం ఇలా మాట్లాడాను తప్పు అయితే క్షమించండి.
రేవతి: తప్పేం లేదమ్మ నువ్వు ఏం మాట్లాడినా ఈ ఇంటి మంచి కోసమే మాట్లాడుతావు. 
భవాని: చూడు రజిని అనుకున్న వెంటనే అన్నీ అయిపోవాలి అంటే కుదరదు. కొంచెం ఓపిక పట్టాలి. నా దృష్టికి తీసుకొచ్చావు కదా నేను చూసుకుంటా. ఆదర్శ్‌కి మంచి జరుగుతుంది అంటే అది ఏమైనా తప్పకుండా చేస్తా.
రజిని: నువ్వు నో చెప్పలేదు అంటే ఓకే అయినట్లే వదిన థ్యాంక్యూ ఇక నేను హ్యాపీగా ఉంటాను. రావే సంగీత నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అవును నువ్వు ఒక్కదానివే వచ్చావ్ బావని పిలు.
ఆదర్శ్‌: అవసరం లేదు నేను వచ్చేశా. 
రజిని: రా అల్లుడు కూర్చో అల్లుడు. 
ఆదర్శ్‌: మురారి రాలేదా అమ్మ. 
భవాని: వస్తున్నాడు.. ఇప్పుడు చాలా బాగుందిరా నువ్వు మురారి కోసం అడగడం చాలా బాగుంది.
ముకుంద: ఇక అంతా బాగుంటుంది మేడం. అదిగో మాటల్లోనే మురారి, కృష్ణ వచ్చేశారు. ముకుంద మురారిని తీసుకెళ్లి ఆదర్శ్‌ పక్కన కూర్చోపెడుతుంది. 

అందరూ సంతోషంగా ఉంటారు. ఆదర్శ్ కృష్ణని సీరియస్‌గా చూస్తాడు. ఇక మధు వచ్చి హోళీ పండగ ఫోటోలను అందరికీ చూపిస్తాడు. 

మధు: ఆ ముకుంద ఉన్నా ఆదర్శ్‌ ముకుందకు ఇంతలా రంగులు పూసేవాడు కాదేమో. నువ్వు బాగా కలిసిపోయావు ముకుంద. ఇక కృష్ణ మురారికి రంగులు పూసిన ఫొటో అని ముకుంద మురారికి రంగులు పూసిన ఫొటోలు చూపిస్తాడు. అందరూ తిక్కలోడా అని తిడతారు. ఇక అన్నీ ఫొటోలు ముకుంద, మురారివే ఉంటాయి. కృష్ణ ఉడికిపోతుంది. ఇక ఎక్కువ ఫొటోలు చూస్తే ఆదర్శ్‌ తన వెనక పడతాడు అని ముకుంద మధుని ఫొటోలు చూపడం ఆపి తిందాం అంటుంది.

భవాని: ఏది ఏమైనా నువ్వు చాలా తెలివైనదానివి ముకుంద. ఎవర్ని ఎలా కలుపుకుకోవాలో .. ఎలా బుద్ధి చెప్పాలో నీకు బాగా తెలుసు. నా కోడలు ముకుందలా కాదు నువ్వు వేరు. ఈ రోజు ఈ ఫ్యామిలీ ఇలా ఉంది అంటే దానికి కారణం నువ్వే. నీకో మంచి ఉద్యోగం చూస్తా ఎలాంటిది కావాలో నువ్వే చెప్తు.
ముకుంద: అలాగే మేడం థ్యాంక్యూ.. 
కృష్ణ: తనకు ఉద్యోగం వేస్తా అని మంచి పని చేశారు అత్తయ్య. పాపం తనకు ఇంట్లో బోర్‌కొడుతుంది పాపం . అంతే కదా మీరా..  
మధు: ఏంటి కృష్ణ ముకుంద అని పేరు మార్చారు కదా ఇంకా మీరా అని పిలుస్తావేంటి. మర్చిపోయావా..
కృష్ణ: అదేం లేదు కావాలి అనే పిలిచా.. నాకు ఒరిజినాలటీ అంటే ఇష్టం. మీరా లాంటి చక్కటి పేరు ఉంచుకొని దాన్ని మార్చుకోవడం ఏంటి. అయినా ఎవరి పేరు వాళ్లకి ఉండగా మార్చితే ఫీలవుతారు కదా.. 
ముకుంద: పర్వాలేదు కృష్ణ నాకు ఏం బాధ లేదు.
కృష్ణ: లేదు మీరా ముకుంద మీద ప్రేమతో ఆదర్శ్‌ మీద అభిమానంతో నువ్వు ఒప్పుకున్నావు.
మురారి: కృష్ణ మార్చేశావ్ కదా అయిపోయింది కదా ఇంకా దాని గురించి ఎందుకు.
ఆదర్శ్‌: మీరాని అడిగే పేరు మార్చాను. అమ్మ కూడా ఒప్పుకుంది కదా తనకేంటి ప్రాబ్లమ్ మురారి. మీరా ఇష్టమని చెప్పింది కదా.
భవాని: అంటే ఆ పేరు వల్ల సమస్యలు వచ్చాయి కదా మళ్లీ అదే ఎందుకు అని భయపడింది. కృష్ణ ఏం కాదు ఆ ముకుంద వేరు మీ ముకుంద వేరు. 
కృష్ణ:  నేను మీరా అనే పిలుస్తాను. కనీసం అలవాటు పడే వరకు. నీకు ప్రాబ్లమ్ లేదు కదా మీరా. నీకో గిఫ్ట్ తెచ్చా మీరా.. అని ఫోన్ ఇస్తుంది. భవాని కనీసం మీరా దగ్గర ఫోన్ లేదా.. లేదు అత్తయ్య అది ఫోన్ లాంటిదే కానీ కాదు అని అంటుంది. ఇక అందరూ భోజనాలు చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీ దేవి ఆచూకి చెప్పేసిన గురువుగారు.. తల పట్టుకున్న విశాల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget