అన్వేషించండి

Trinayani Serial Today April 11th: 'త్రినయని' సీరియల్: గాయత్రీ దేవి ఆచూకి చెప్పేసిన గురువుగారు.. తల పట్టుకున్న విశాల్!

Trinayani Serial Today Episode గాయత్రీ దేవి చీరలు ఉన్న చోటే పునర్జన్మ ఎత్తిన గాయత్రీ దేవి ఉంటుంది అని గురువుగారు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode  నయని తిలోత్తమకు ఉగాది పచ్చడి ఇస్తుంది. తిలోత్తమ పచ్చడి తిని చేదు అని అంటుంది. దీంతో నయని మీ మనస్తత్వంలా అని అంటుంది. ఇక చెప్పాపెట్టకుండా వెళ్లిన మీరు ఈసారి ఎలాంటి కుట్రలు చేయడానికి ప్లాన్ చేశారో అని ముందుగానే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అని నయని అంటుంది. ఇక తిలోత్తమ కొడుకు వల్లభను అడిగి ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకుంటుంది. లలిత దేవి కంటే ముందే నయని తొలి బిడ్డను తానే ఇంటికి తీసుకొస్తాను అని తిలోత్తమ అంటుంది. 

మరోవైపు సుమన పంచాంగంలో రాజపూజ్యం, అవమానం అంటూ లెక్కలు వేసుకుంటుంది. విక్రాంత్ వచ్చి ఏ కొత్త సంవత్సరంతో అయినా నీ బుద్ధి మార్చుకుంటావా లెక్కలేసుకుంటున్నావ్ అంటాడు. దానికి సుమన నేను నా రాశి ఫలాలు కాదు మా అక్క రాశి ఫలాలు చూస్తున్నాను అంటుంది. ఇద్దరూ డబ్బు గురించి వాదించుకుంటారు. విక్రాంత్ కష్ట పడి సంపాదించిన రూపాయికే ఎక్కువ విలువ అంటే సుమన మాత్రం ఆస్తి కొట్టేసి మీరు నేను ఉలూచి పాప హ్యాపీగా ఉందామని అంటుంది. దానికి విక్రాంత్ సుమనకు క్లాస్ పీకుతాడు. బుద్ధి మారదని తిడతాడు.  

ఇక పావనా, దురంధర గాయత్రీ పాపని ఆడిపిస్తారు. పాపని పావనా గుర్రం ఎక్కించుకుంటాడు. ఇక గురువుగారు అక్కడికి వస్తారు. ఇక సుమన వెటకారంగా రండి స్వామి మేం మీకు సంబంధం లేని ప్రేమ అనే టాపిక్‌ గురించి మాట్లాడుకుంటున్నాం అని అంటుంది. 

గురువుగారు: చాలా రోజులు అయింది మిమల్ని చూసి పోదామని వచ్చాను.
సుమన: మమల్నేనా మా అక్క బావలను కూడానా..
పావనా: వాళ్లని చూడకుండా గురువుగారు గడప దాటరు.
సుమన: మాట దాటేస్తారు.
నయని: సుమన గురువుగారు మాట దాటేస్తారు అని ఏ విషయం గురించి అన్నావు.
సుమన: నీ మొదటి కూతురు గురించి అడిగితే మాట దాటేస్తారు కదా..
వల్లభ: మన శ్రేయాభిలాషి అయిండి పెద్దమ్మ జాడ చెప్పడమే లేదు గురువుగారు.
హాసిని: గురువుగారు వీళ్లు మిమల్ని రెచ్చ గొడుతున్నారు ఆవేశ పడి చెప్పేయకండి.
తిలోత్తమ: అంటే గురువుగారికి గాయత్రీ అక్కయ్య ఎక్కడుందో తెలుసన్నమాట.
దురంధర: అది కాదే హాస్.. గురువుగారికి తెలుసు అన్న విషయం మీకు ఎలా తెలుసు.
విశాల్: అత్తయ్య వదిన గెస్ చేసి మాట్లాడొచ్చు.
తిలోత్తమ: గురువుగారు మౌనంగా ఉన్నారు ఏంటో..
విక్రాంత్: చూడ్డానికి వచ్చాను అన్నవారిని ఇబ్బంది పెడితే ఆయన అయినా ఏం చేస్తారు. 
నయని: స్వామి మీరు మాట్లాడకపోతే నిందించేలా ఉన్నారు.
గురువుగారు: ఏం చెప్పమంటావు నయని.
తిలోత్తమ: తనేం చెప్తుంది స్వామి. భర్తకు ఎన్ని సార్లు చెప్పుకుంది. తొలి బిడ్డను వెతికి తీసుకురండి అని. కానీ విశాల్ ధైర్యంగా నమ్మకంగా ఉండమని ఏదో ఒక రోజు కన్నతల్లి వస్తుంది అని సర్దిచెప్తున్నాడే కానీ కన్న తల్లి వస్తుంది అని నాకు అయితే నమ్మకం లేదు.
విక్రాంత్: నేను సుమన ఎలాగూ కలిసి లేం. సంతోషంగా ఉన్న బ్రో, వదినల సంసారం కూడా పాడు చేస్తావా అమ్మ.
సుమన: కన్న బిడ్డను వదిలేసి అనాథని ప్రేమగా చూసుకుంటున్న వీళ్లని మీరు సపోర్ట్ చేయకండి.
విక్రాంత్: సుమన.. నోరు మూసుకోకపోతే పళ్లు రాలుతాయ్..
నయని: ఊరుకోండి విక్రాంత్ బాబు స్వామి వారు ఉన్నారు ఆయన ముందు మర్యాదగా నడుచుకోండి. బాబు గారు గాయత్రీ అమ్మగారి గురించి తెలుసుకోవడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది. 
తిలోత్తమ: నయని ఇంకా కొంచెం బలవంతం చేస్తే గురువుగారు దివ్య దృష్టితో ఎక్కడుందో చెప్తారేమో.
సుమన: మాకు అయితే గాయత్రీ దేవి ఎక్కడుందో చెప్పాలి స్వామి.
విశాల్: సుమన ఎందుకు అలా మొండిగా మాట్లాడుతావ్.
సుమన: మీరు, గురువుగారు పక్కకు వెళ్లి ఒకటి రెండు సార్లు పునర్జన్మ గురించి మాట్లాడుకోవడం చూశాను బావగారు.
తిలోత్తమ: అయితే నయని తెలివైనది అయినా బిడ్డ విషయంలో అమాయకంగా ఉంది అన్నమాట.
నయని: నాకు తెలియకుండా దాయాల్సిన రహస్యం అయితే కాదు కదా.
వల్లభ: పెద్దమ్మ ఎక్కడుందో తెలియదు కానీ ఆమె కట్టిన చీరలు ఇంట్లోనే ఉన్నాయి. వాటి జోలికి వెళ్తుంటే మా అమ్మకి, సుమనకు ఇబ్బందులు వస్తున్నాయి. అందులో దాగిన మతలబు ఏంటి. 
నయని: స్వామి బాబుగారిని ఇబ్బంది పెట్టకూడదు అంటే మీరు నా పెద్ద కూతురు గురించి చెప్పాలి.
గురువుగారు: తన చీరలు ఉన్న చోటే గాయత్రీదేవి ఉంటుంది. 
విశాల్: స్వామి చీరలు ఇంట్లోనే ఉన్నాయి.
హాసిని: అంటే ఇంట్లో ఉన్నట్లు కాదు కదా..
గురువుగారు: హాసిని గాయత్రీ చీరలు ఎక్కడుంటే  గాయత్రీదేవి అక్కడే అంటుంది.
విశాల్: మనసులో.. స్వామి చెప్పనూ అంటేనే చెప్పేశారే..
నయని: స్వామి ఇక్కడ నలుగురు పిల్లలే ఉన్నారు. పసిబిడ్డలా ఉన్న గాయత్రీ అమ్మగారు ఇక్కడ లేరు కదా..
తిలోత్తమ: గాయత్రీ చీరలు ఉన్న చోటే అక్క ఉంది అంటే వివరంగా తెలుసుకోవాలి కదా.
సుమన: ఇంకొంచెం వివరంగా చెప్పండి స్వామి.
గురువుగారు: గాయత్రీ దేవి చీరలు ఈ ఇంట్లో మాత్రమే లేవు నయని. మీరు ఇంట్లో ఉన్న వాటి గురించే ఆలోచిస్తున్నారు. ఇవి కాకుండా తాను గుడిలకు ఇచ్చినవి పంచినవి ఇలా చాలా ఉన్నాయి కదా..
విశాల్: నాకు అర్థమైంది. మా అమ్మ చీరలు ఈ చుట్టు పక్కల ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికితే అక్కడ అమ్మ దొరుకుతుంది.
గురువుగారు: ఆ చీరలు నయని ఓకే చోట ఎదురు పడనున్నారు మీరు అప్పుడు గుర్తిస్తే చాలు. అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘రామయణం’ సినిమాకు యష్ నిర్మాత? రావణుడిగా నటించడం లేదా? ఇదేం ట్విస్ట్ సామీ.. నిజం ఏమిటీ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget