By: ABP Desam | Updated at : 05 Sep 2023 10:32 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
ముకుంద తన ప్లాన్ ప్రకారం కృష్ణ, మురారీతో కలిసి బయటకి వెళ్తుంది. మధుకర్ ని అలేఖ్య సైడ్ చేసేస్తుంది. ఇక భవానీ రేవతి దగ్గర ముకుంద ఏదో నిజం చెప్పాలని చెప్పడం కంటే మీ కళ్లతోనే చూడండి అని కృష్ణ వాళ్ళ గదికి తీసుకెళ్లిందని చెప్తుంది. రేవతి టెన్షన్ గా ఏంటా ఆ నిజమని అంటుంది. మధు... కృష్ణ వచ్చిందని కేకలు వేసేసరికి కిందకి వచ్చేశాను తను వచ్చాక మళ్ళీ అడిగి తెలుసుకుంటానని చెప్తుంది. ముకుంద తన ప్రేమ విషయం చెప్పాలని ట్రై చేస్తుందని ఎలా ఆపాలని రేవతి ఆలోచిస్తుంది. అప్పుడు మధుకర్ ముకుంద ప్రయత్నాన్ని తానే అడ్డుకున్నానని చెప్తాడు. కృష్ణ, మురారీలని ఎవరూ విడదీయలేరని ధైర్యం చెప్తాడు.
కృష్ణ వాళ్ళు ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్ కి వెళతారు. అక్కడ వీళ్ళని కొంతమంది గమనిస్తూనే ఉంటారు. సర్వర్ వచ్చి మీ ముగ్గురిలో ఎవరు ఎవరికి ఏం అవుతారని అడుగుతాడు. ట్రూత్ అండ్ డేర్ ఆడి చిక్కు ప్రశ్నలు వేసి మురారీతో నిజం చెప్పించాలని ముకుంద ప్లాన్ వేస్తుంది. ఖచ్చితంగా నువ్వు నన్ను ఇరకాటంలో పడేయాలని చూస్తున్నావ్ కానీ నీ ముందే నేను కృష్ణకి ప్రపోజ్ చేసి షాకిస్తానని మురారీ మనసులో అనుకుంటాడు. ముకుంద గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ టర్న్ ముకుందకి వస్తుంది.
Also Read: కావ్య మనసులో కొత్త ఆశలు- రాజ్ నమ్మకద్రోహం, కొడుకు ప్రవర్తనతో షాక్లో అపర్ణ
కృష్ణ: నీ ప్రేమికుడిని నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావా?
ముకుంద: ఇప్పటికీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా
కృష్ణ: పెళ్ళైన కూడ ఎప్పుడో ప్రేమించిన వాడిని ఇంకా ప్రేమించడం తప్పు కదా
ముకుంద: ఒక ప్రశ్న మాత్రమే వేయాలి కృష్ణ. గేమ్ రూల్స్ పాటించాలి అనేసి మళ్ళీ బాటిల్ తిప్పుతుంది. ఈసారి మురారీ వైపు ఆగుతుంది. కృష్ణ ప్రశ్న వేస్తానని చెప్తుంది
కృష్ణ: మన పెళ్లికి ముందు మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటే ఆ అమ్మాయి పేరు ఏంటి? ఏం చెప్తాడోనని టెన్షన్ పడతాడు. ఒకప్పటి ప్రియురాలి పేరు చెప్పడానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు
మురారీ: తన పేరు రాధ.. మళ్ళీ బాటిల్ తిప్పితే ముకుంద వైపు వస్తుంది
కృష్ణ: నువ్వు ప్రేమించిన అబ్బాయి పేరు ఏంటి? ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు
ముకుంద: నేను ప్రేమించిన వ్యక్తికి రెండు పేర్లు ఉన్నాయి. నేను తనని శ్రీకృష్ణ అని పిలుచుకునే వాడిని కానీ అతని అసలు పేరు అని చెప్పబోతుండగా పక్కన టేబుల్ దగ్గర ఉన్న ఇద్దరు అబ్బాయిలు వచ్చి మీ మీద బెట్ వేశామని చెప్తాడు. మీ ముగ్గురిలో సార్ భార్య ఎవరని బెట్ వేసుకున్నాం. ఆ మాటకి మురారీ కోపంగా కృష్ణ తన భార్య అని చెప్తాడు.
Also Read: లాస్య ప్లాన్ మిస్ ఫైర్- గెటవుట్ అన్న విక్రమ్, తులసికి మాజీ మొగుడు ప్రేమలేఖ
కృష్ణ: బ్రదర్ అందరికీ ఆ మేడమ్ భార్య అని అనిపిస్తే మీకు నేనే సార్ భార్య అని ఎందుకు అనిపించింది
అబ్బాయి: ఆ మేడమ్ కాస్త స్టైల్ గా ఉన్నారు. మీరు మాత్రం చాలా పద్ధతిగా ఉన్నారు
కృష్ణ: అందంగా ఉండే అమ్మాయిలని పద్ధతిగా ఉండే అమ్మాయికి తేడా ఏంటి?
అబ్బాయి: పాష్ గా ఉండే అమ్మాయిని చాలా మంది ఇష్టపడతారు. కానీ తన భార్య మాత్రం నలుగురిలో ఒద్దికగా ఉండాలని అనుకుంటారు. ఇందాక ఆ మేడమ్ బాటిల్ అందుకో అన్నారు. కానీ మీరు మాత్రం భర్తని నలుగురిలో గౌరవంగా చూసుకోవాలని మీరు వెళ్లారు అని చెప్తాడు.
కృష్ణ: ఏసీపీ సర్ నిజంగా నేను ముకుంద ముందు తీసేసినట్టుగా ఉంటానా అని బాధపడుతుంది
మధుకర్ అలేఖ్యని బతిమలాడుకునే పనిలో ఉంటాడు. ముకుంద కృష్ణ వాళ్ళ గదిలో చేసిన పని గురించి చెప్తాడు. కారులో వెళ్తూ కృష్ణ డల్ గా ఉందని మురారీ ఫీల్అవుతాడు. కావాలని ముకుంద గిల్లుతూ మాట్లాడుతుంది. రెస్టారెంట్ లో అందరూ నన్ను నీ భార్య అనుకోవడానికి కారణం ఏంటని ముకుంద కావాలని ముకుంద అడుగుతుంది.
కృష్ణ: నువ్వు స్టైల్ గా ఉంటావ్ కదా ముకుంద అందుకే ఆయన నీకు పడిపోయి ఉంటారని అందరూ అనుకున్నారు. నేను మీ పక్కన సెట్ అవాలంటే కాస్త స్లిమ్ అవాలి
మురారీ: నువ్వు నేచురల్ బ్యూటీ కృష్ణ వాళ్ళ మాటలు పట్టించుకోకు
రేవతి, మధుకర్ ముకుంద ప్రవర్తన గురించి మాట్లాడుకుంటారు. ఆదర్శ్ లోపు ముకుంద మనసు మారదేమోనని భయపడతారు. అప్పుడే కృష్ణ వాళ్ళు ఇంటికి వస్తారు. ఏంటి కృష్ణ డల్ గా ఉన్నావని ప్రసాద్ అడుగుతాడు.
తరువాయి భాగంలో..
రెస్టారెంట్ కి వెళ్లామని చెప్పాను కదా పక్కనఉన్న కొందరు మురారీ భార్య ఎవరని బెట్ కట్టారంట. అందరూ నేనే మురారీ భార్య అనుకున్నారని ముకుంద చెప్తుంటే భవానీ గట్టిగా అరుస్తుంది. తెలియక వాళ్ళు చేసిన పొరపాటుని ననువ్వు అందరిలో చెప్పుకోవడం ఏంటి? ఇలా సరదాకి కూడా వావి వరసలు మార్చకూడదు. నీ భర్త ఎవరని నిలదీస్తుంది.
Bigg Boss Telugu 7: దొంగలుగా మారిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు - శోభాశెట్టి, యావర్ ఫైట్, చివాట్లు పెట్టిన పెద్దాయన!
Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!
Bigg Boss Captaincy Task: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?
Gruhalakshmi October 4th: రత్నప్రభ నిజస్వరూపం తెలుసుకున్న తులసి- దివ్యని బుజ్జగించే పనిలో విక్రమ్!
Krishna Mukunda Murari October 4th: శకుంతలని అవమానించిన ముకుంద- కృష్ణ ఉగ్రరూపం!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!
Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !
Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు
/body>