By: ABP Desam | Updated at : 04 Sep 2023 11:47 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
శ్రావణ శుక్రవారం సందర్భంగా దివ్యతో పూజ చేయిస్తానని తులసి రాజ్యలక్ష్మిని అడుగుతుంది. దానికి సరేనని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత అవమానించాలని తల్లీకూతుళ్లని దూరం చేయాలని లాస్య ప్లాన్ చెప్తుంది. ఇక తులసి కుటుంబం మొత్తం రాజ్యలక్ష్మి ఇంటికి వస్తుంది. తులసి పట్టుచీర కట్టుకుని రావడం చూసి లాస్య సెటైర్ వేస్తుంది. ఆ మాటకి నందు ఆవేశం వస్తుంటే వద్దని సైగ చేస్తుంది. అనసూయ ఆ మాటకి లాస్యకి బాగా కౌంటర్ వేసి నోరు మూయిస్తుంది. పూజ చేసుకునేది దివ్య కదా నువ్వు పట్టుచీర కట్టుకుని వచ్చావ్ ఎవరితో జంటగా పూజ చేసుకుందామని అంటుంది. మనం ఇక్కడ గొడవ పడటం కరెక్ట్ కాదని తులసి నోరు మూయిస్తుంది. నందు పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఏదో కవర్ ఇవ్వబోతుంటే దివ్య వచ్చి ఆపుతుంది. ఏంటి ఈ కవర్ అని అంటుంది. తులసికి చెప్పాలని అనుకున్నది లెటర్ లో రాశాను. అది పూజలో పెట్టి తర్వాత తులసికి ఇవ్వాలని అనుకున్నట్టు చెప్తాడు. విషయం నేరుగా చెప్దామని అంటే ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుందని చెప్తాడు.
Also Read: ముకుంద ప్లాన్ సక్సెస్- ప్రేమించిన అమ్మాయి పేరు చెప్పమని మురారీని అడిగిన కృష్ణ
ఇది ముఖాముఖిగా తేల్చుకోవాలని దివ్య తల్లిని పిలుస్తుంది. ఏమైనా చెప్పాలా అంటే అవును చెప్పాలి కానీ అది నేను కాదు నాన్న అంటుంది. పొద్దుటి నుంచి ఇదే గోల అని కాసేపు తులసి తిట్టేసి వెళ్ళిపోతుంది. దివ్య ఆ లెటర్ తులసి చేతికి ఇచ్చి చూడమని అంటుంది. నందు కంగారుగా ఆ లెటర్ ఓపెన్ చేయవద్దని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేయాలని అడ్డుపడతాడు. అసలు లెటర్ లో ఏముందని తులసి అడుగుతుంది. కేఫ్ కి కొత్త ఆర్డర్ వచ్చిందని అది పూజ చేయిద్దామని అబద్దం చెప్తాడు. ఈ కాస్త దానికి ఇంత హంగామా ఎందుకని అంటుంది. వచ్చిన మంచి అవకాశం వదిలేసినందుకు దివ్య డిస్పాయింట్ అవుతుంది. ఆ తర్వాత దివ్య పూజ పూర్తి చేస్తుంది. విక్రమ్, రాజ్యలక్ష్మి దివ్యని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. తులసి చీరకి నిప్పు అంటుకునేలా లాస్య ప్లాన్ వేస్తుంది. అందరూ అక్షింతలు వేసే టైమ్ లో చీర కొంగుకి లిక్విడ్ రాశానని చెప్తుంది.
హారతి ఇచ్చే టైమ్ లో తులసి చీర కొంగు కాలిపోయేలా చేయాలని ప్లాన్ వేస్తారు. దివ్య, లాస్య హారతి ఇస్తూ కావాలని తులసి చీర కొంగు అంటించడానికి ట్రై చేస్తుంటే దివ్య అడ్డుపడుతుంది.
రాజ్యలక్ష్మి: అదేంటి దివ్య ఆంటీని కూడా హారతి ఇవ్వనివ్వు
దివ్య: హారతి ఇవ్వడం కాదు ఆమె మా అమ్మ చీర కొంగు అంటించాలని చూస్తుందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
గతంలో ఏం జరిగిందో చూపిస్తారు. లాస్య ఒక బాటిల్ బసవయ్య వాళ్ళకి చూపించి అదేంటో కనుక్కోమని అంటుంది. అసలు ఆ బాటిల్ లో ఏముందో చెప్పమని రాజ్యలక్ష్మి అడుగుతుంది.
Also Read: ఇగో మాస్టర్ దగ్గర అడ్డంగా బుక్కైన వసు- రిషి మనసులో ఉన్నది ఎవరో ఏంజెల్ కి తెలిసిపోతుందా?
లాస్య: ఇదొక కెమికల్. దీన్ని ఏదైన వస్త్రం మీద రాస్తే మంట తగలగానే అది అంటుకుంటుంది
బసవయ్య: ఇది అంతా అబద్దం. ఇలాంటివి చాలా చూశాను నమ్మకు
లాస్య: అయితే నీ చొక్కా మీద రాసి చూపిస్తా రా అని బెదిరిస్తుంది. తర్వాత వేరే క్లాత్ కి ఆ కెమికల్ రాసి నిప్పు సెగ చూపించగానే అది తగలబడుతుంది
అది చూసి రాజ్యలక్ష్మి లాస్యని మెచ్చుకుంటుంది.
తరువాయి భాగంలో..
నా మీద నిందలు వేయడానికి మనసు ఎలా వచ్చిందని లాస్య నటిస్తుంది. వెంటనే విక్రమ్ లాస్యకి సోరి చెప్పమని దివ్య మీద అరుస్తాడు. లాస్య అక్కడ నుంచి వెళ్లబోతుంటే కెమికల్ బాటిల్ కింద పడుతుంది. ఈ లిక్విడ్ మా అమ్మ చీర కొంగుకి రాసిందని దివ్య నిరూపిస్తుంది. అది చూసి ఇలాంటి పని చేయడానికి సిగ్గు లేదా గెటవుట్ అని విక్రమ్ లాస్యని తిడతాడు.
Guppedanta Manasu September 26th: హాస్పిటల్లో జగతి - తల్లడిల్లిన రిషి, విడిపోతున్న చిక్కుముడులు - త్వరలోనే శుభం!
Bigg Boss Season 7 Day 21 Updates: బిగ్ బాస్‌లో నామినేషన్స్ గోల - యావర్‌కు ఫైనల్‌గా సూపర్ ట్విస్ట్!
Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ - ఆ ముగ్గురు జడ్జిల చేతిలో నిర్ణయం
యాంకర్ సౌమ్య చెప్పుపై చంటీ పంచ్‌లు - అలా చేస్తే నా జడ్జి పోస్ట్ ఎప్పుడో పోయేదన్న కృష్ణ భగవాన్
Bigg Boss Tamil 7: పృథ్విరాజ్ to అబ్బాస్ - ‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ వీళ్లేనట!
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
/body>