Krishna Mukunda Murari May 4th: పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న కృష్ణ- మురారీ మీద ప్రేమ చిగురిస్తుందా?
తన తండ్రి చావుకి మురారీ కారణం కాదని కృష్ణకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ వాల్ క్లాక్ లో టైమ్ సరిగా లేదని స్టూల్ ఎక్కి కింద పడబోతుంటే మురారీ పట్టేసుకుంటాడు. ఏంటి ఈ సాహసాలు కృష్ణ అంటాడు. ఈ ప్లాన్ కాకపోతే ఇంకొక ప్లాన్ వేద్దాం సక్సెస్ అవుతామని మురారీకి ధైర్యం చెప్తుంది. నందిని కృష్ణ దగ్గరకి వెళ్లాలని మారాం చేస్తుంటే గౌతమ్ ఆపుతాడు. అక్కడ కృష్ణ వాళ్ళతో పాటు మీ మమ్మీ వాళ్ళు కూడా ఉంటారనేసరికి వద్దు అమ్మ నిన్ను షూట్ చేస్తుందని బాధపడుతుంది. సరే అయితే వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తుంది. సరే చెప్తానని గౌతమ్ సర్ది చెప్తాడు. కృష్ణ పెద్ద క్యారేజ్ తీసుకొచ్చి అది ఆఫీసుకి తీసుకెళ్ళి తినమని చెప్తుంది. వామ్మో నేను తినలేను క్షమించి దయ ఉంచి ఇవన్నీ తీసేసి ఒక చిన్న బాక్స్ లో అన్నం పెట్టి ఒక కూర వేసి తీసుకురమ్మని అంటాడు. కానీ కృష్ణ మాత్రం ఒప్పుకోదు మనకి అన్నం పెట్టకుండా బాధపెట్టిన వాళ్ళకి ఈ క్యారేజ్ గుణపాఠం కావాలని చెప్తుంది.
Also Read: యష్ వేద కోసం కొన్న డ్రెస్ వేసుకున్న మాళవిక- ఇద్దరి మధ్య చిచ్చు మళ్ళీ రగిలేనా?
కృష్ణ హాస్పిటల్ లో తన బాబాయి అంజీ అనే వ్యక్తిని పలకరిస్తుంది. తన కొడుక్కి బాగోలేదని నెల నుంచి హాస్పిటల్ లో ఉన్నాడని చెప్పి బాధపడతాడు. అబ్బాయి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి చేస్తారు. తన కొడుకుని రక్షించినందుకు అంజీ కృతజ్ఞతలు చెప్తాడు. మీ నాన్నలాగే నీది గొప్ప మనసు అని మెచ్చుకుంటాడు. నువ్వు డాక్టర్ అయినందుకు మీ నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడని అంటాడు. నాన్న చావుకు ఏసీపీ సర్ బాధ్యులని తప్ప ఆయనలో వెతికినా కోపం కనిపించదని చెప్తుంది.
అంజీ: మీనాన్న చావుకు ఏసీపీ కారణం ఏంటి. లేదమ్మా ఇందులో మురారీని తప్పుగా అర్థం చేసుకున్నావ్. ఆరోజు జరిగింది వేరు. ఎలాగైనా శివన్నని అరెస్ట్ చేయాలని నాన్న, ఏసీపీ సర్ కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారు షూట్ చేయమని నాన్న, రిస్క్ వద్దని మురారీ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో షూట్ చేయకపోతే తన మీద ఒట్టుఅని ఒత్తిడి తీసుకొచ్చారు, తప్పని సరి పరిస్థితుల్లో షూట్ చేశారు
కృష్ణ: అంటే నాన్న చావుకి
అంజీ: ఏసీపీ సర్ బాధ్యులు కాదు శివన్న మిషన్ లో నాన్నని పాల్గొనొద్దని చెప్పారు కానీ నాన్న ఒప్పుకోలేదు
కృష్ణ మురారీని అవమానించిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుని బాధపడుతుంది. నిజం చెప్పి చాలా గొప్ప సహాయం చేశారని కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను ఏం చేసినా నా తప్పుకి ప్రాయశ్చితం లేడని కృష్ణ గుడికి వచ్చి మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతుంది. గుడిలో పూజారి కృష్ణని చూసి మురారీకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. దీంతో వెంటనే మురారీ గుడికి వస్తాడు.
Also Read: జానకిని శత్రువులా చూస్తున్న జ్ఞానంబ- ఇంట్లో సునామీ సృష్టిస్తానన్న మధుకర్