Krishna Mukunda Murari June 6th: కొడుకు, కోడలు విడిపోకుండా అదిరిపోయే ప్లాన్ వేసిన రేవతి- ముకుందకి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్
కృష్ణ వాళ్ళు చేసుకుంది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఒక ఏసీపీ అనాథ ఆశ్రమం కట్టించి పిల్లల్ని బాగా చూసుకుంటున్న మంచి మనిషిని వదులుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నాకు వచ్చింది. ఆయన మనసులో వేరేవరో అమ్మాయి కాకుండా నేను ఉండి ఉంటే గుడిలో ఉన్నట్టు ఉండేది ఏమో నాకు ఆ అదృష్టం లేకుండా పోయిందని బాధపడుతుంది. మురారీ కళ్ళకు గంతలు కట్టుకుని ఆడుకుంటూ వెళ్ళి కృష్ణని పట్టుకుంటాడు. కృష్ణ అవుట్ అంటే అక్క కాదు వేరే టీచర్ అని పిల్లలు అంటారు. కానీ మీ అక్క ఎక్కడ ఉందో నా మనోనేత్రం చెప్తుందని అనుకుంటాడు. తర్వాత కృష్ణకి కళ్ళకి గంతలు కడతాడు ఆడుతూ తన పడబోతుంటే మురారీ పట్టుకుంటాడు.
మురారీ-కృష్ణ: నా మనసులో నువ్వు ఉన్నావాని చెప్పాలని అనుకుంటున్నా కృష్ణ. ఈ ఆనందం నాకు శాశ్వతం కావాలంటే ఇంకొక జన్మ ఎత్తాలసిందే ఈ జన్మలో ఈయన మనసు నాది కాదని బాధపడుతుంది. పిల్లల కోసం మురారీ స్పెషల్ గా ఫ్రూట్స్ తెప్పిస్తాడు. సాదాసీదాగా కనిపించే వ్యక్తి ఒక మాతృమందిరాన్ని నడుపుతున్నారు. మీరు నా దృష్టిలో ఇంకా ఎదిగిపోయారు. తింగరిపిల్లలా కనిపించే తనలో ఇంత మానవత్వం ఉందా? తల్లిదండ్రులు లేని పిల్లల కోసం కృష్ణ ఇంత చేస్తుందంటే చాలా గ్రేట్.
Also Read: కేడీ గ్యాంగ్ మీద కంప్లైంట్ ఇస్తానన్న వసు- తండ్రిని తలుచుకుని బాధపడుతున్న రిషి
గీతిక-ముకుంద: కృష్ణ మురారీ అగ్రిమెంట్ మ్యారేజ్ అని రేవతి అత్తయ్యకి చెప్పేశాను. కృష్ణ వెళ్లిపోతుందని నీకు నమ్మకం ఉందా? వెళ్లిపోతుందని మురారీ చెప్పాడు. అయితే తను వెళ్లిపోయే దాకా వెయిట్ చేయి ఆ తర్వాత నీ మనసులో విషయం బయట పెట్టు. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. కృష్ణ మురారీ విడిపోతే తనని పెళ్లి చేసుకోవచ్చు.
మురారీ కారు ఆపగానే ఇద్దరూ దిగుతారు. కృష్ణ రోడ్డు దాటబోతుంటే బైక్ ర్యాష్ గా వస్తుంది. వెంటనే మురారీ తనని పక్కకి లాగేస్తాడు. మీ గుండెల్లో తలదాచుకున్న కానీ ఆ గుండెల్లో ఎవరో ఉన్నారని తెలిసి ఏదోలా ఉందని బాధపడుతుంది. మురారీ వాళ్ళు ఇంటికి వచ్చేసరికి రేవతి డల్ గా కూర్చుంటుంది. ఏంటమ్మా ఏమి మాట్లాడటం లేదని మురారీ అడిగితే నీరసంగా ఉందని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరో ఎవరి మీద కోపంగా ఉన్నారని కృష్ణ అంటుంది.
రేవతి: అవును నేను కోపంగానే ఉన్నాను అది నీమీదే.
ముకుంద: అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి అడగబోతుందా అడగనివ్వు మంచిది
రేవతి: మీరు ఇద్దరూ కాపురం చేయడం లేదు నాకు అర్జంట్ గా మనవడో మనవరాలో కావాలి
ముకుంద: అంటే చిన్నత్తయ్య అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి బయట పడకుండా ఇద్దరినీ దగ్గర చేయాలని చూస్తుందన్న మాట
రేవతి: నేను మనవడి కోసం ఎదురుచూస్తుంటే మీరు ఐస్ క్రీమ్ లు అంటూ పనికిమాలిన పనులు చేస్తున్నారు
Also Read: వేడి వేడి నీళ్ళతో అభిమన్యుకి నీలాంబరి పాదపూజ- మాళవిక కోసం సులోచనని తిట్టిన వేద
కృష్ణ: ఏసీపీ సర్ మనసులో నేను ఉంటే ఈ పాటికి నా కడుపులో బిడ్డ ఖచ్చితంగా ఉండేది కానీ ఆయన మనసులో వేరే అమ్మాయి ఉంది.
మురారీ: కృష్ణ అగ్రిమెంట్ అయిపోగానే వెళ్లిపోకుండా ఇక్కడే ఉంటానని అంటే వెంటనే కాపురం మొదలుపెట్టేసెవాడిని ఏం అర్థం కావడం లేదు. కొంచెం టైమ్ కావాలి మమ్మీ. తనకి కూడా టైమ్ కావాలని కృష్ణ కూడ చెప్తుంది.
రేవతి: వచ్చే సంవత్సరం ఈ రోజుకల్లా నా చేతులో మనవడో మనవరాలో ఉండాలి అర్థం అయ్యిందా? నేను నిన్ను గైనకాలజిస్ట్ దగ్గరకి తీసుకెళ్తాను నువ్వు అర్జంట్ గా మందులు వాడాల్సిందే. గుడికి తీసుకెళ్ళి ముడుపు కట్టిస్తాను ఇక మిమ్మల్ని నేను ఇలాగే వదిలేయలేను ఈ వంశం నిలబడాలి అంతే