Krishna Mukunda Murari July 21st: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్: ఇంకెన్నాళ్ళు ఈ ప్రేమ సాగతీత- ముకుంద పెట్టిన కండిషన్ కి మురారీ తల వంచుతాడా?
కృష్ణ, మురారీని విడగొట్టేందుకు ముకుంద ట్రై చేస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టేందుకు ముకుంద కూడా వాళ్ళని ఫాలో అయ్యేందుకు వెళ్ళబోతుంటే భవానీ దేవి ఆపుతుంది. అమ్మని చూసి వస్తానని అబద్ధం చెప్పి బయటకి వెళ్తుంది. కృష్ణని షాపింగ్ కి తీసుకుని వస్తాడు. రింగ్ కొని తన ప్రేమని ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు. చీరలు చూస్తూ ఉండగా మురారీ వచ్చి ముఖ్యమైన విషయం చెప్పాలని పక్కకి తీసుకుని వెళతాడు. కళ్ళు మూసుకోమని చెప్పి రింగ్ బయటకి తీసుకొస్తాడు. రింగ్ తీసి కృష్ణ ముందు మోకాళ్ళ మీద నిలబడి ప్రపోజ్ చేసే టైమ్ కి పరిమళ వచ్చి కృష్ణని పిలుస్తుంది. ఇది తమ షాపు అని విజిటింగ్ చేయడానికి వచ్చానని పరిమళ చెప్తుంది. ఖచ్చితంగా విషయం చెప్పే టైమ్ కి వచ్చేసిందని మురారీ పరిమళని మనసులో తిట్టుకుంటాడు. మాటల మధ్యలో కృష్ణని మురారీ కోహినూర్ డైమండ్ తో పోలుస్తాడు. తన మీద ప్రేమతో అలా పోల్చాడా లేదంటే తింగరి తనం నచ్చి అలా అన్నాడా అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఇక పరిమళ వెళ్లిపోగానే కృష్ణ కూడా చీరలు సెలెక్ట్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోతుంది.
Also Read: ఎట్టకేలకు కావ్యని పట్టేసుకున్న రాజ్- కళావతికి పూలు కొనిచ్చిన మిస్టర్ డిఫెక్ట్
కృష్ణ కోసం మురారీ చీర సెలెక్ట్ చేస్తాడు. దీంతో తెగ మురిసిపోతుంది. షాపింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్లబోతుంటే కృష్ణ, మురారీ ఇద్దరికీ కలిపి పరిమళ దండ వేసి అభినందిస్తుంది. షాపులో అందరికీ కృష్ణ జూనియర్ డాక్టర్ తను చేసిన సేవలకు అవార్డు కూడా వచ్చిందని చెప్తుంది. ఇప్పటి వరకు తింగరి పిల్లలా కనిపించిన కృష్ణ ఇప్పుడు గొప్ప డాక్టర్ అని మెచ్చుకుంటుంది. ముకుంద మురారీ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. వెళ్ళండి మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా నేను ఫాలో అవుతాను, మీ ఇద్దరూ ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమని షేర్ చేసుకొనివ్వనని అనుకుంటుంది. సరిగ్గా మురారీ వాళ్ళ కారు వెనుకే ముకుంద వెళ్లబోతుంటే రేవతి కారు అడ్డంగా పెడుతుంది. తనని చూసి ముకుంద షాక్ అవుతుంది.
రేవతి: ఏంటి నా కొడుకు, కోడల్ని వదలవా? నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావనే నిన్ను ఫాలో అయ్యాను. నువ్వేం చెప్తే అది నమ్మడానికి నేను మీ అత్తయ్యని కాదు
ముకుంద: నేను నిజంగానే మా అమ్మని కలవడానికి అని చెప్పబోతుంటే రేవతి ఆపి పక్కనే ఉన్న గుడికి తీసుకుని వెళ్తుంది. ఆదర్శ్, ముకుంద పేరు మీద పూజ చేయిస్తుంది. వీళ్ళు షాపింగ్ కి వెళ్ళి ఉంటారు. ఒకరి మీద మరొకరు లవ్ ఎక్స్ ప్రెస్ చేసుకుంటే పరిస్థితి ఏంటని ముకుంద మనసులో అనుకుంటుంది.
రేవతి: ముకుంద నిన్ను చూస్తుంటే జాలి పడాలో కొప్పడాలో అర్థం కావడం లేదు
ముకుంద: నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే అలానే అనిపిస్తుంది
రేవతి: నోర్ముయ్ పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదా? ప్రతీసారీ నా కొడుకు కోడలు వెంట ఎందుకు పడుతున్నావ్
Also Read: గొడ్రాలివంటూ వేదని అవమానించిన మాళవిక- ఖైలాష్ ని ఉతికి ఆరేసిన నీలాంబరి
ముకుంద: మీకు మురారీ కొడుకు అవ్వచ్చు కానీ కృష్ణ మీకు కోడలు కాదు. మీకు వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలుసు. ఎందుకు ఆత్మవంచన చేసుకుంటున్నారు
రేవతి: అది అప్పటి పరిస్థితిని బట్టి ఆవేశంలో తీసుకున్న నిర్ణయం. అప్పుడు వేరు ఇప్పుడు వేరు
ముకుంద: మీ కొడుకు ఒక న్యాయం, నాకొక న్యాయమా. కృష్ణని ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న నిర్ణయం ఆవేశంతో తీసుకున్న నిర్ణయమని సమర్తిస్తున్నారు కానీ నన్ను తప్పు బడుతున్నారు. నా ప్రేమని బలి చేసుకునే అమాయకురాలిని కాదు. నా ప్రేమని దక్కించుకునేందుకు ఏమైనా చేస్తాను. నేను నేరుగా పెద్దత్తయ్య దగ్గరకి వెళ్ళి ఉన్న నిజం పూస గుచ్చినట్టు చెప్తాను. నీ కొడుకు నన్ను ముందు ప్రేమించి తన గురువు మాట కోసం కృష్ణని పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశాడని చెప్తాను