Ennenno Janmalabandham July 21st: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ - గొడ్రాలివంటూ వేదని అవమానించిన మాళవిక- ఖైలాష్ ని ఉతికి ఆరేసిన నీలాంబరి
మాళవికని మళ్ళీ తిరిగి యష్ ఇంటికి తీసుకురావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
సులోచన వచ్చి వేదని డాక్టర్ దగ్గరకి వెళ్దామని అంటుంది. ఎందుకని వేద అంటే అదేంటి ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెస్ట్ కి వెళ్ళాలి కదా పిల్లల గురించని మాలిని అనడం మాళవిక వింటుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరకి వెళ్ళే అవసరం లేదని వేద అంటే ఎందుకని సులోచన అడుగుతుంది. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఖుషి, ఆదిత్య.. ఇంకేం కావాలి వాళ్ళిద్దరూ చాలని చెప్తుంది. మాతృత్వం దేవుడిచ్చిన వరం కాదనకూడదని మాలిని సర్ది చెప్పి హాస్పిటల్ కి పంపిస్తుంది. డాక్టర్ వేదని చెక్ చేసి కొన్ని పరీక్షలు చేస్తుంది. వేద వాళ్ళని ఫాలో అవుతూ మాళవిక హాస్పిటల్ కి వస్తుంది.
డాక్టర్: మీ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయ్. మీ శరీరంలో మార్పు వచ్చింది. పిల్లలు పుట్టే అవకాశం వచ్చింది
వేద: నాకు ఇంతక ముందు హోప్స్ లేవు
డాక్టర్: మీరు మొదటి స్టెప్ తీసుకోవాలి. బెటర్ ట్రీట్మెంట్ దాని తర్వాత మొదలుపెట్టాలి. భార్యాభర్తలుగా మీరు ఒకటి కావాలి
వేద: మా పెళ్లి కూడా విచిత్రంగా జరిగింది. ఖుషి కోసం మా పెళ్లి జరిగింది. ఇద్దరినీ ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. కానీ ఇప్పుడు మేంఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం.
Also Read: ఒక్కటైన విక్రమ్, దివ్య- తులసి దేవత అంటూ పొగిడిన నందు
డాక్టర్: ఇప్పుడు మీకు బేబీ కావాలని అనుకుంటున్నారు. ఇన్నేళ్ల తర్వాత శరీరంలో మార్పు చూస్తున్నా. కానీ మీరు యశోధర్, కలవడం అవసరం
వేద: కానీ మాకు సరైన సమయం దొరికినప్పుడు మీరు చెప్పినట్టే చేస్తాను
వేద సంతోషంగా బయటకి వస్తుంటే మాళవిక కనిపిస్తుంది. నువ్వు ఏంటి ఇక్కడ అంటే నిన్ను ఫాలో అవుతూ వచ్చాను. డాక్టర్, నువ్వు మాట్లాడుకున్న మాటలు కూడా విన్నాను అనేసరికి వేద షాక్ అవుతుంది.
మాళవిక: నీకు పిల్లలు కావాలా? నువ్వు మర్చిపోయావా నువ్వు ఒక గొడ్రాలివని. ఇవన్నీ నీ వల్ల అయ్యే పనులు కావు
వేద: నాకు ఎలాంటి ఆశలైనా ఉండవచ్చు కానీ నీకు అనవసరం
మాళవిక: ఎక్కడైనా ఒక భర్త భార్యని ముట్టుకోకుండా ఉంటాడా? అసలు నీ భర్త నిన్ను ప్రేమించడం లేదేమో?లేదంటే నువ్వే నీ భర్తకి దూరంగా ఉంటున్నావా? నేను మొత్తం వినేశాను. మొగుడు పెళ్ళాల మధ్య ఎలాంటి బంధం లేనప్పుడు పిల్లలు ఎలా పుడతారు.
వేద: ఇది నా పర్సనల్ విషయం దీని గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండు
Also Read: కృష్ణని సర్ ప్రైజ్ చేసిన మురారీ- భవానీతో షికార్లు కొట్టిన తింగరిపిల్ల
మాళవిక: యశోధర్ ని పెళ్లి చేసుకున్నావ్ కానీ తను నీ వాడు కాలేదు. ఐలవ్యూ చెప్పడమే కాదు చూపించడం కూడా అవసరం. ఒక భర్త పిల్లల తల్లికి ఎంత దగ్గరగా ఉంటాడో అంత దగ్గరకి ఇంకెవరికీ దగ్గర కాలేడు. కానీ నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవు కదా. ఒక్కటి మాత్రం అయ్యావు.. ఆయా అనే పదం నీకు కరెక్ట్ గా సరిపోతుంది. యశోధర్ నిన్ను భార్యగా చూడటం లేదు ఖుషికి కేర్ టేకర్ గా మాత్రమే చూస్తున్నాడు. ఒక ఆడదానివి అనే దృష్టితో చూడలేదు. భార్యగా చూస్తే నిన్ను ఇలా ఉండేవాడు కాదు. నేను భార్యగా ఉన్నప్పుడు తన చేతులు నా మీద ఉండేవాడు. రోజంతా బెడ్ రూమ్ లోనే ఉండేవాళ్లం. నీకు పిల్లలు కావాలి కదా అల్ ది బెస్ట్
అభిమన్యు నీలాంబరి కోసం పండ్లు తీసుకొని వస్తాడు. అభి పరిస్థితి చూసి ఖైలాష్ జాలి పడతాడు. పునాది రాయి పాతింది ఎవరో తెలియదు కానీఈ ఫ్లైఓవర్ కట్టేస్తున్నావని సానుభూతి చూపిస్తాడు. ఇక పండ్లు లోపల పెట్టమని ఖైలాష్ కి చెప్తుంది. అవి తీసుకుని వెళ్ళగానే చంద్రముఖి అవతారం ఎత్తి ఖైలాష్ ని ఉతికి ఆరేస్తుంది. నీలాంబరికి అబార్షన్ చేయించాలని భ్రమరాంబిక అంటుంది. యష్ వేదని బాధపెట్టిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే వసంత్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు.