News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Brahmamudi July 21st: 'బ్రహ్మముడి' సీరియల్: ఎట్టకేలకు కావ్యని పట్టేసుకున్న రాజ్- కళావతికి పూలు కొనిచ్చిన మిస్టర్ డిఫెక్ట్

కావ్య మీద రాజ్ మనసులో ప్రేమ మొదలు కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

కావ్యని అందరితో తిట్టించాలని చూసిన స్వప్నని రాజ్ రివర్స్ లో తిడతాడు. “మీ చెల్లి ఎలాంటిదో ఈ ఇంట్లో మానానమ్మని అడిగినా చెప్తుంది. కలిసి పుట్టి పెరిగావ్ అర్థం చేసుకోలేవా? నీ పెళ్లి కోసం నానా కష్టాలు పడినా గుర్తించవా? పెళ్లికి ముందే తొందరపడి మీ అమ్మానాన్నకి తలవంపులు తెచ్చినా ప్రతీ క్షణం నీ గురించే ఆలోచించింది. నీ పెళ్లి కోసం ప్రయత్నాలు చేసింది. అలాంటిది నీ గురించి పట్టించుకోదా? వినడానికే అసహ్యంగా ఉంది” అని తిడతాడు. స్వప్న నువ్వు డైట్ చేయడం తప్పు ఆ నింద మీ చెల్లి మీద వేయడం ఇంకా పెద్ద తప్పు అనేసి వెళ్ళిపోతాడు. రాజ్ ప్రవర్తనతో అపర్ణ ఆశ్చర్యపోతుంది. కావ్య మీద నిందలు వేయడం కరెక్ట్ కాదని ఇంద్రాదేవి అంటుంది. అక్కడ కళ్యాణ్ అప్పుకి సాయం చేసే పనిలో మునిగిపోతూ ఉంటాడు. అప్పు పిజ్జా డెలివరీ చేస్తూ ఉంటే కళ్యాణ్ వెనుకాలే ఫాలో అవుతూ ఉంటాడు. పిజ్జా డెలివరీ చేసిన ప్రతి చోట టిప్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు.

డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేసేందుకు కూర్చున్న ప్రతీ ఒక్కరూ ఫోన్లు చూస్తూ ఉండటం చూసి ఇంద్రాదేవి సీరియస్ అవుతుంది. తినడానికి వచ్చి ఏం చేస్తున్నారని తిడుతుంది. ఫోన్లు చూస్తున్నారని క్లాస్ పీకుతుంది. ఇంకోసారి భోజనం చేసేటప్పుడు ఫోన్ ఎవరి చేతిలో చూసిన పగలగొడతానని వార్నింగ్ ఇస్తుంది. అమ్మమ్మ మాటలని కావ్య మెచ్చుకుంటుంది. ఇక రాజ్ సెల్ ఫోన్ వల్ల నష్టాలు మాత్రమే కాదు లాభాలు కూడా ఉన్నాయి.

Also Read: ఒక్కటైన విక్రమ్, దివ్య- తులసి దేవత అంటూ పొగిడిన నందు

రాజ్: ఒక అమ్మాయి ఉంది మన ఆఫీసులో కావలసిన కొత్త డిజైన్స్ ఇంట్లోనే గీసి ఈ ఫోన్ కి సెండ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళింట్లో చాలా స్ట్రిక్ట్ అట, అసలు డిజైన్స్ వేయనివ్వడట. ఆ అమ్మాయి పేరు చెప్పనా అని కావ్య వైపు చూసి నవ్వుతాడు. ఆ అమ్మాయి పేరు శిరీష

కనకం అప్పు కోసం కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కూతురు రాగానే తన మీద అరుస్తుంది. పెద్దమ్మ టెస్ట్ ల కోసం ఉంచమని అప్పు డబ్బులు తల్లి చేతికి ఇస్తుంది. తండ్రి భారాన్ని తగ్గించాలని కష్టపడుతున్న నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని కనకం మెచ్చుకుంటుంది. కూతురిగా అన్ని చేస్తున్నావని కృష్ణమూర్తి కూడా అభినందిస్తాడు. కావ్య ఎప్పటిలాగానే రాజ్ నిద్రపోయాడో లేదో చూసి మెల్లగా డిజైన్స్ వేసేందుకు కిందకి వెళ్తుంది. కావ్య ఉన్నప్పుడు నిద్రపోయినట్టు నటిస్తాడు. ఇక డిజైన్స్ వేయడానికి పేపర్స్ తీసుకుని మెల్లగా కావ్య వెళ్ళడం ఒంటి కన్నుతో రాజ్ గమనిస్తూనే ఉంటాడు. తను గదిలో నుంచి బయటకి వెళ్ళగానే ఈరోజు ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా  దొరికిపోతుంది లేకపోతే నాతోనే దోబూచులాడుతుందా అనుకుని కిందకి వస్తాడు.

రాజ్ కిందకి వచ్చి ఇంట్లో కావ్య ఏ మూలన దాక్కుందా అని చూస్తూ ఉండగా సోఫా వెనుక కూర్చుని ఉంటుంది. మెల్లగా వెళ్ళి సోఫా మీద కూర్చుని కావ్యకి ఎరేజర్ అందిస్తూ ఉంటాడు. కాసేపటికి కావ్య రాజ్ ని చూస్తుంది.

రాజ్: హాయ్ శిరీష చూస్తావే.. డిస్ట్రబ్ చేశానా గీసుకో

Also Read: కృష్ణని సర్ ప్రైజ్ చేసిన మురారీ- భవానీతో షికార్లు కొట్టిన తింగరిపిల్ల

కావ్య: మీరు నిద్రపోలేదా

రాజ్: లేదు నువ్వు నా ముక్కు మీద చీర కొంగు పెట్టినప్పుడు కూడ మేల్కొని ఉన్నాను. నా దగ్గర ఎందుకు దాచావు. అంటే ఏంటి నీ ఉద్దేశం, నేను కళలని గుర్తించనని, నేను కళాకారులని గుర్తించనని.. నాతో చెప్తే నీకు గుర్తింపు రాదని అనుకున్నావ్ అంతే కదా

కావ్య: అంతే

Published at : 21 Jul 2023 08:24 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial July 21st Episode

ఇవి కూడా చూడండి

Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!

Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!

Roshan Kanakala:సుమ, రాజీవ్ కనకాల విడాకులపై కుమారుడు రోషన్ కామెంట్స్ - ఓపెన్‌గా చెప్పేసిన యంగ్ హీరో

Roshan Kanakala:సుమ, రాజీవ్ కనకాల విడాకులపై కుమారుడు రోషన్ కామెంట్స్ - ఓపెన్‌గా చెప్పేసిన యంగ్ హీరో

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

టాప్ స్టోరీస్

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు